woman recovers lost diamond bangle ప్యాసెంజర్ చెంతకు మిసైన వజ్రాలు పొదిగిన గాజు..

Trolley retriever returns diamond studded bangle to owner

Honest Trolley Retriever, Ashraf Moideen, diamond-studded bangle, Mangalore International Airport, passenger, Bengaluru, terminal manager, Karnataka, crime

A woman got back her high-value diamond-studded bangle she had lost at the airport here, thanks to the honesty of airport employees. The bangle was returned to the true owner by the security team of the airport by trolley retriever, Ashraf Moideen. The woman in question had come to the airport to escort her relative coming from Bengaluru to her home. On that occasion, her diamond bangle had gone missing.

విమానాశ్రయ సిబ్బంది నిజాయితీ.. ప్యాసెంజర్ చెంతకు వజ్రాలు పొదిగిన గాజు..

Posted: 02/04/2022 01:49 PM IST
Trolley retriever returns diamond studded bangle to owner

రోడ్డుపై పది రూపాయలు దొరికినా.. మనదేనని బుకాయించి జేబులో వేసుకునేవారి సంఖ్య అధికమైన ఈ రోజుల్లో.. ఇంకా నీతిగా, నిజాయితీగా లక్షల విలువైన వస్తువులు లభించినా దానిని సంబంధిత వ్యక్తులకు అందజేయాలని కొరుతూ అధికారులకు అప్పగించేవారు ఇంకా ఉన్నారు. ఈ మధ్యకాలంలో అలాంటి అటో డ్రైవర్లను కొంతమందిని మనం చూస్తూనే వున్నాం. అలాంటివారి కోవకే చెందినవారు అష్రఫ్ మొయిద్దీన్. ఇంతకీ ఈయన ఎవరు.? ఏం చేశారు. తన నిజాయితీని ఎలా చాటుకున్నారు అని అంటారా.?. ఈ వివరాల్లోకి వెళ్తే.. అష్రప్ మొయిద్దీన్ అనే వ్యక్తి మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో నాల్గవ తరగతికి చెందిన ఉద్యోగి.  

విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న ప్రయాణికులు తమ వస్తువులను ట్రాలీలపై పెట్టుకుని తమ వాహనాల వద్దకు చేరుకోవడం కామన్. అయితే అలా వారు వదిలిన ట్రాలీలను ఒక్క దగ్గరకు చేర్చి విమానాశ్రయంలోకి తీసుకెళ్లి పెట్టే విధులు నిర్వహిస్తున్నారు అష్రప్. కాగా ఆయన ఇలా విధులు నిర్వహిస్తున్న తరుణంలో ఆయన విమానాశ్రయంలోని దిగువ అంతస్థులో బయటకు వెళ్లే మార్గంలో వజ్రాల పొదిగిన కంకణం (మహిళలు చేతికి ధరించే గాజు) లభించింది. దానిని ఎవరో పారేసుకున్నారని భావించిన అష్రఫ్ విమానాశ్రయంలోని సీఐఎస్ఎఫ్ అధికారులకు అందజేశారు. దీంతో అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు.

కాగా వజ్రాలు పొదిగిన ఈ కంకణం బెంగళూరు నుంచి వచ్చిన తన బంధువును రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన ప్రయాణికురాలి బంధువుకు చెందినది. తన కంకణం తప్పిపోయిందని ఇంటికి వెళ్లిన తరువాత తెలుసుకున్న అమె.. విమానాశ్రయంలోనే ఇది పడివుంటుందని భావించి.. వెంటనే దానిని గుర్తించాలని విమానాశ్రయంలోని సంబంధిత అధికారులకు సమాచారం అందించింది. దీంతో అమె పిర్యాదును నమోదు చేసుకున్న సీఐఎస్ఎఫ్ అధికారులు అమెను విమానాశ్రయానికి రమ్మని చెప్పారు. అమె రాగానే వెంటనే దానిని గుర్తించడమే కాకుండా ఎంతో నిజాయితీగా అధికారుల వద్దకు తీసుకువచ్చి అప్పగించిన అష్రఫ్ వద్దకు వెళ్లి ఆయన చేతనే దానిని కోల్పోయిన వ్యక్తికి ఇప్పించారు.  

పార్కింగ్ లాట్ లో ట్రాలీలను ఒక్కచోటకు చేరుస్తున్న అష్రఫ్‌ మొయిద్దీన్‌ అనే ట్రాలీ కూలీ వద్దకు సీఐఎస్ఎఫ్ అధికారులు అమెను తీసుకెళ్లారు. అక్కడ విదులు నిర్వహిస్తున్న అష్రఫ్ ను పిలిచి ఆయన చేత్తోనే అమెకు ఆ వజ్రాలు పోదిగిన కంకణాన్ని అందించారు. అయితే అంతుకుముందు విమానాశ్రయంలోని లాస్ట్ అండ్ ఫౌండ్ డిమార్టుమెంటు మేనేజరు సదరు ప్రయాణికురాలి ఐడెంటిటీని పరిశీలించిన తరువాత ఈ కార్యక్రమం జరిగింది. కాగా, ఈ సందర్భంగా అష్రప్ స్పందిస్తూ. విలువైన కంకణాన్ని స్వీకరించినందుకు ప్రయాణీకురాలి ముఖంలో కనిపించిన సంతోషం.. తనకు అత్యంత సంతృప్తిని కలిగించిందని అన్నారు. అయితే అష్రఫ్ ఇలా తన నిజాయితీని చాటుకోవడం రెండో పర్యాయమని విమానాశ్రయ అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles