India Logs 1.49 Lakh New Covid Cases, death toll passes 500,000 తగ్గిన కరోనా మహమ్మారి కేసులు.. ఐదు లక్షలు దాటిన మరణాలు

Coronavirus live updates india logs 1 49 lakh new cases death toll passes 500 000

Covid-19 live updates, Covid-19, Covid-19 cases in india, coronavirus death in india, corona deaths in india, corona alpha deaths in india, corona delta variants deaths in india, corona omicron variant deaths in india, coronavirus cases in india, india covid cases, india covid cases in 24 hours, total covid deaths in india, india covid, omicron cases in india, omircron subvariant, omicron india, omicron

India reported 1.49 lakh new Covid cases today, 13% lower than yesterday. The positivity rate fell to 9.2%. The active cases constitute 3.42 per cent of the total infections, while the national COVID-19 recovery rate decreased to 95.39 per cent, the health ministry said. India's official death toll from COVID-19 crossed 500,000 on Friday, even as many experts flag underreporting of cases across the country.

తగ్గిన కరోనా మహమ్మారి కేసులు.. ఐదు లక్షలు దాటిన మరణాలు

Posted: 02/04/2022 12:01 PM IST
Coronavirus live updates india logs 1 49 lakh new cases death toll passes 500 000

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,49,394 కొత్త కేసులు నమోదు అయ్యాయని కేంద్ర వైద్యఅరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. అంతకు ముందు రోజుతో పోలిస్తే ఏకంగా 13 శాతం కరోనా కేసుల్లో తగ్గుముఖం కనిపించింది. ఇక దేశంలో టెస్టుల ఆధారంగా పాజిటివిటీ రేటు 9.27 శాతంగా నమోదు అయ్యింది. ఇదిలావుంటే దేశంలో కరోనా మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య అధికారిక సంఖ్య ఏకంగా ఐదు లక్షల మార్కు దాటింది. ఇది అధికారికంగా ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారమే కాగా, ఇంతకు మించిన మరణాలు నమోదయ్యాయన్న వార్తలు వినబడుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవఁధిలో దేశంలో ఏకంగా 1072 మరణాలు నమోదయ్యాయి.

కాగా, దేశంలో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. రికవరీల సంఖ్య 2, 46, 674 కాగా, గత ఒక్కరోజులో కరోనాతో దేశవ్యాప్తంగా 1,072మంది చనిపోయారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య అధికారికంగా ఐదు లక్షలు దాటింది(5, 00,055). ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 14, 35, 569గా ఉంది. అత్యధిక కేసులు Omicron variant of SARS-COV2(ఒమిక్రాన్‌ వేరియెంట్‌)వే ఉన్నాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ 168.47 కోట్ల డోసులకు చేరుకుంది. కరోనా విజృంభణ కేరళలో అత్యధికంగా కొనసాగుతోంది. అమెరికా, బ్రెజిల్‌ తర్వాత అత్యధిక కరోనా మరణాలు నమోదు అయిన దేశంగా భారత్‌ నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 387.5 మిలియన్ల కరోనా కేసులు నమోదు అయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles