Lightning In 2020 Declared Longest Single Bolt Recorded ఆకాశంలో తళుక్కుమన్న మెరుపుల్లో ఇది రికార్డే.!

770 kilometer lightning in 2020 declared longest single bolt recorded

Lightening Bolt, Longest Lightening Bolt, World Meteorological Organisation, 770-Kilometer Lightning, Professor Randall Cerveny, thunderstorms

A bolt of lightning that stretched nearly 769 kilometres across three US states in 2020 or equivalent to the distance between London and the German city of Hamburg has been declared as the longest recorded single flash by the World Meteorological Organisation (WMO).

ఆకాశంలో తళుక్కుమన్న మెరుపుల్లో ఇది రికార్డే.!

Posted: 02/03/2022 11:18 AM IST
770 kilometer lightning in 2020 declared longest single bolt recorded

ఆకాశంలో తళుక్కుమన్న ఓ మెరుపు రికార్డులకెక్కింది. ఏకంగా 768 కిలోమీటర్ల మేర మెరిసి అతిపెద్ద మెరుపుగా రికార్డులకెక్కింది. 31 అక్టోబరు 2018న బ్రెజిల్‌లోని దక్షిణ భూభాగంలో ఓ మెరుపు 709 కిలోమీటర్ల మేర తళుక్కుమంది. ఇప్పటి వరకు రికార్డైన వాటిలో ఇదే అతిపెద్ద  మెరుపు కాగా, ఇప్పుడా రికార్డు చెరిగిపోయింది. 29 ఏప్రిల్ 2020లో అమెరికాలోని మిసిసిపి, లూసియానా, టెక్సాస్ రాష్ట్రాల మీదుగా ఒకేసారి 768 కిలోమీటర్ల మేర మెరుపు సంభవించింది. ఇప్పటి వరకు నమోదైన వాటిలో ఇదే అతిపెద్ద మెరుపని వరల్డ్ మెటిరియాలజికల్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఎంవో) ప్రకటించింది.

అదే ఏడాది మరో రికార్డు కూడా నమోదైంది. సాధారణంగా మెరుపులు ఒకటి రెండు సెకన్లు మాత్రమే ఉంటాయి. కానీ, 18 జూన్ 2020న ఓ మెరుపు 17.102 సెకన్ల పాటు వెలుగులు విరజిమ్మింది. ఫలితంగా 4 మార్చి 2019న అర్జెంటినాలో 16.73 సెకన్లపాటు వెలుగులు విరజిమ్మిన మెరుపును ఇది వెనక్కి నెట్టేసింది. ఆర్ సిరీస్‌కు చెందిన జయో స్టేషనరీ ఆపరేషనల్ ఎన్విరాన్మెంటల్ శాటిలైట్లు లైటెనింగ్ మ్యాప్ టెక్నాలజీ ద్వారా ఈ గణాంకాలను నమోదు  చేసినట్టు డబ్ల్యూఎంవో తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles