Man claims daughter died of vaccine, claims Rs 1,000 cr compensation ‘‘నా కూతురు ప్రాణం తీసిన టీకా.. రూ.1000 కోట్ల పరిహారం చెల్లించండీ’’

Plea in bombay hc seeks rs 1 000 crore compensation alleging death from covid vaccine

Coronavirus, Covid-19, Omicron, Alpha variant, Delta variant, Delta Plus in India, Omicron variant covid cases, corona vaccine, covishield, covaxin, Mumbai, Bombay High Court, coronavirus vaccine death in India, coronavaccine death in Maharashtra, Covid vaccine registration, covid cases in india, corona update in india, coronavirus news, india coronavirus, coronavirus in india, omicron virus variant, omicron virus india, omicron virus variant, Covid guidelines

A plea has been filed before the Bombay High Court by the father of a deceased medical student, seeking ₹1,000 crores as compensation for the death of his daughter, who he claimed died due to the side effects of COVID vaccine.

‘‘నా కూతురు ప్రాణం తీసిన టీకా.. రూ.1000 కోట్ల పరిహారం చెల్లించండీ’’

Posted: 02/03/2022 10:31 AM IST
Plea in bombay hc seeks rs 1 000 crore compensation alleging death from covid vaccine

కరోనా మహమ్మారి విజృంభనను కట్టడి చేసేందుకు వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు కలసి కనుగొన్న వాక్సీన్ దేశప్రజల్లో ఎందరెందరికో భరోసాను కల్పించింది. కేంద్రప్రభుత్వం పర్యవేక్షణలో దేశప్రజలందరికీ కరోనా టీకాను వేస్తున్న ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే ఈ కరోనా వాక్సీన్ వచ్చిన కొత్తలో టీకా దుష్ప్రభావాల కారణంగా కొందరు మరణించారు. అయితే అందులో కొందరు వైద్యులు కూడా ఉన్నారు. కొందరు టీకీ తరువాత పలు ఔషదాలు వాడకూడదని కూడా ఆ తరువాత వైద్యులు సూచించారు. అయితే కారణాలు తెలియదు కానీ.. ఈ టీకా వల్ల తన కుమార్తె ప్రాణం పోయిందని, ఇందుకు గాను పరిహారంగా రూ. 1000 కోట్లు చెల్లించాలంటూ ఔరంగాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి బాంబే హైకోర్టును ఆశ్రయించాడు.

ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాల్లోకి వెళ్తే.. నాసిక్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్న స్నేహాల్ గతేడాది జనవరి 28న కొవిషీల్డ్ టీకా వేసుకున్నారు. మార్చి 1న మరణించారు. తన కుమార్తె టీకా దుష్ప్రభావాల కారణంగానే మరణించిందని ఆమె తండ్రి లునావత్ కోర్టును ఆశ్రయించాడు. ఆమెకు న్యాయం కావాలని కోరాడు. ఆరోగ్య కార్యకర్తలంతా టీకా తీసుకోవాలని, అది పూర్తి సురక్షితమని, ఎలాంటి హానీ ఉండదని మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతోనే తన కుమార్తె టీకా వేసుకుందని లునావత్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. టీకా పూర్తి సురక్షితమని డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కూడా చెప్పిందని గుర్తు చేశారు.

ఎయిమ్స్ డైరెక్టర్, మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ తప్పుడు ప్రచారం వల్లే తన కుమార్తె, మరెంతోమంది ఆరోగ్య కార్యకర్తలు టీకా తీసుకున్నారని పేర్కొన్నారు. టీకా తీసుకున్న తర్వాత దుష్ప్రభావాల కారణంగా తన కుమార్తె చనిపోయిందని లునావత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏఈఎఫ్ఐ కమిటీ కూడా చెప్పిందని గుర్తు చేశారు. కాబట్టి, పరిహారంగా 1000 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వం, సీరం సంస్థలను ఆదేశించాలని లునావత్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. గత వారమే ఆయన ఈ పిటిషన్‌ను దాఖలు చేయగా, విచారణకు ఇంకా తేదీ ఖరారు కాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles