Omicron BA.2 appear to have similar severity, says WHO ఒమిక్రాన్ ఉపరకం బీఏ.2 అసలు కన్నా తీవ్రం: డబ్ల్యూహెచ్ఓ ఆసక్తికర ప్రకటన

Omicron sub variant could be more infectious found in 57 countries who

Covid-19 Omicron subvariant BA.2, COVID-19, Omicron, WHO, subvariant BA.2, Omicron subvariant, BA.2, coronavirus strain, coronavirus

A sub-variant of the highly contagious Omicron coronavirus strain, which some studies indicate could be even more infectious than the original version, has been detected in 57 countries, the WHO said. The fast-spreading and heavily mutated Omicron variant has rapidly become the dominant variant worldwide since it was first detected in southern Africa 10 weeks ago.

ఒమిక్రాన్ ఉపరకం బీఏ.2 అసలు కన్నా తీవ్రం: డబ్ల్యూహెచ్ఓ ఆసక్తికర ప్రకటన

Posted: 02/02/2022 11:31 AM IST
Omicron sub variant could be more infectious found in 57 countries who

కరోనా వేరియంట్ ఒమిక్రాన్ ఉపరకం బీఏ.2పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) ఆసక్తికర ప్రకటన చేసింది. అసలు వేరియంట్ కన్నా ఈ కొసరు వేరియంట్ అంత ప్రమాదకరమేమీ కాదని డబ్ల్యూహెచ్ వో టెక్నికల్ లీడ్ మరియా కెర్ఖోవే అన్నారు. దాని వల్ల తీవ్రత పెరుగుతోందనడానికి ఎలాంటి ఆధారాల్లేవని చెప్పారు. అయితే, ప్రస్తుతం అది కూడా చాలా వేగంగా విస్తరిస్తోందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీఏ.2తో పాటు ఒమిక్రాన్ కూడా చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని అన్నారు. వేగంగా విస్తరించినా దాని తీవ్రత మాత్రం డెల్టాతో పోలిస్తే తక్కువేనని పేర్కొన్నారు.

డెన్మార్క్ లో ప్రస్తుతం ఈ బీఏ.2 వేరియంట్ కేసులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ ప్రకటన చేశారు. కాగా, చాలా దేశాలు ఆంక్షలు ఎత్తివేయడాన్ని డబ్ల్యూహెచ్ వో చీఫ్ టెడ్రోస్ అధనోం ఘెబ్రియేసస్ తప్పుబట్టారు. చాలా దేశాల్లో ఒమిక్రాన్ ఇంకా పీక్ దశకు చేరుకోలేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఆంక్షలు ఎత్తివేయడం తొందరపాటే అవుతుందని అన్నారు. వైరస్ కు లొంగిపోయామని కానీ, లేదా విజయం సాధించామని కానీ ముందే ప్రకటించడం భావ్యం కాదని సూచించారు. ఈ వైరస్ చాలా ప్రమాదకరమని, అది ఎంత వేగంగా విస్తరిస్తోందో మనకు కనిపిస్తూనే ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్ ఉపరకం బీఏ.2పై విశ్లేషణ చేస్తున్నామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles