"Treason By Modi Government": Rahul Gandhi దేశద్రోహానికి పాల్పడిన మోడీ ప్రభుత్వం: రాహుల్ గాంధీ

Modi govt committed treason rahul gandhi on pegasus spyware

Pegasus spyware, NSO Pegasus spyware India, Pegasus Spyware News, Pegasus Spyware Latest News, India Pegasus Deal, Rahul Gandhi on Pegasus deal, congress on pegasus deal, union minister on pegasus deal, union minister supari media, national politics

Opposition Congress leaders including Rahul Gandhi ripped into the BJP-led centre today after an investigative piece by a US newspaper said India bought Israeli spyware in a $2 billion deal in 2017. The spyware, Pegasus, made by Israeli firm NSO has been in the centre of a big controversy over its alleged used against the public, military and civil officers, politicians, activists, judges and journalists for illegal surveillance.

పెగసెస్ డీల్: మోడీ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడిందన్న రాహుల్ గాంధీ

Posted: 01/29/2022 02:10 PM IST
Modi govt committed treason rahul gandhi on pegasus spyware

పెగాస‌స్ నిఘా సాఫ్ట్‌వేర్‌ను ఇండియా కొనుగోలు చేసిన‌ట్లు అమెరికాకు చెందిన న్యూ యార్క్ టైమ్స్ ప‌త్రిక ఓ సంచ‌ల‌న క‌థ‌నాన్ని రాసిన విష‌యం తెలిసిందే. దీంతో మళ్లీ దేశంలో ఈ వ్యవహారం విషయమై రాజకీయ దుమారం రేగుతోంది. ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర విమర్శలు సంధిస్తున్నాయి. పెగసస్‌ స్పైవేర్‌ను 2017లోనే భారత ప్రభుత్వం కొనుగోలు చేసిందని న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం ప్రచురించింది. దీనిపై ఇవాళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. మోదీ స‌ర్కార్ దేశ‌ద్రోహానికి పాల్ప‌డిన‌ట్లు ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో ఆరోపించారు.

దేశ ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ల‌పై నిఘా పెట్టేందుకు మోదీ స‌ర్కార్ ఇజ్రాయిల్ నుంచి పెగాస‌స్ స్పై సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిన‌ట్లు రాహుల్ విమ‌ర్శించారు. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లు, రాజ‌కీయ‌వేత్త‌లు, ప్ర‌జ‌ల‌పై ఆ స్పైవేర్‌తో నిఘా పెట్టిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు. గ‌వ‌ర్న‌మెంట్ సంస్థ‌లు, ప్ర‌తిప‌క్ష నేత‌లు, సైనిక ద‌ళాలు, న్యాయ‌వ్య‌వ‌స్థ‌తో లింకున్న వారి ఫోన్ల‌ను పెగాస‌స్‌తో ట్యాప్ చేసినట్లు రాహుల్ ఆరోపించారు. ఇవ‌న్నీ దేశ‌ద్రోహ ప‌నులే అన్నారు. దీనిపై కేంద్ర మంత్రి వీకే సింగ్ తీవ్రంగా మండిపడ్డారు.

అదొక ‘సుపారీ మీడియా’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతేడాది ఇండియాలోని ప్రముఖుల ఫోన్లు ట్యాప్‌ చేసేందుకు పెగసస్‌ అనే స్పైవేర్‌ను కేంద్ర ప్రభుత్వం వినియోగించిందన్న వార్తలు సంచలనం సృష్టించాయి. పార్లమెంట్‌ను సైతం ఈ అంశం కుదిపేసింది. అయితే, ఈ వార్తలను కేంద్రం అప్పట్లోనే ఖండించింది. అలాంటి స్పైవేర్‌ ఏదీ కొనుగోలు చేయలేదని వివరణ ఇచ్చింది. అయితే తాజాగా న్యూయార్క్‌ టైమ్స్‌ మాత్రం 2017లోనే కేంద్రం ఈ స్పైవేర్‌ను కొన్నదంటూ

ఓ కథనాన్ని ప్రచురించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles