మొబైల్ ఫోన్ వినియోగదారులు టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నారు. ఈ కోత్త సంవత్సరంలో తొలిసారిగా ట్రాయ్ తీసుకున్న నిర్ణయం మొబైల్ ఫోన్ వినియోగదారులకు ఒకింత గుడ్ న్యూస్ మాదిరిగానే వుంది. మరీ ముఖ్యంగా ప్రీపెయిడ్ మొబైల్ యూజర్లకు ఇది కలిసివచ్చే అంశం. ఎందుకంటే ప్రీపెయిడ్ ప్యాక్ వ్యాలిడిటీ విషయంలో ట్రాయ్ సరికొత్త నిబంధన తీసుకురావడమే కాదు టెలికాం సర్వీసు అందించే సంస్థలన్నీ దీనిని ఖచ్చితంగా అమలుపర్చాలని అదేశించింది. ఏంటా నిర్ణయం అని అలోచిస్తున్నారు కదూ. టెలికాం సర్వీసు అందించే సంస్థలు అన్ని ఇకపై నెల రోజుల కాలపరిమితితో ఒక ప్లాన్ ఉండేలా తప్పనిసరిగా చేసుకోవాలని అదేశాలు జారీ చేసింది
అదేంటి ఇప్పటికే టెలికాం సంస్థలు ఈ నెలసరి మంత్లీ ప్లాన్ అందుబాటులోకి తీసుకువచ్చాయి కదా., అంటారా.? గతంలో ప్రీపెయిడ్ ప్యాక్‌లు 30 రోజుల కాలపరిమితితో లభ్యమయ్యేవి. అయితే, ఆ తర్వాత వీటిని అన్ని టెలికం సంస్థలు 28 రోజులకు తగ్గించేశాయి. ఫలితంగా సంవత్సరానికి 13 సార్లు రీచార్జ్ చేసుకోవాల్సి వస్తోంది. వినియోగదారులకు ఇది భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి సంస్థ 30 రోజుల కాలపరిమితితో ప్రీపెయిడ్ రీచార్జ్ ప్యాక్‌లను తీసుకురావాలని ఆదేశించింది. ఇందులో ప్లాన్ ఓచర్, ఒక స్పెషల్ టారిఫ్ ఓచర్, కాంబో వోచర్లు ఉండాలని స్పష్టం చేసింది. ప్రతి నెల ఒకే తేదీన వీటిని రీచార్జ్ చేసుకుంటే సరిపోయేలా ఉండాలని ఆదేశించింది. అంతేకాదు, రెండు నెలల్లోపు తమ ఆదేశాలను అమలు చేయాలని ఆదేశించింది.
(And get your daily news straight to your inbox)
May 25 | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఢిల్లీ పటియాలా హౌజ్ ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతోపాటు రూ.10లక్షల జరిమానా... Read more
May 25 | తన కుటుంబం ఒక చిన్న ఇళ్లు కొనుక్కోవాలని అనుకుంది. అయితే తాముండే గ్రామంలో కాకుండా జిల్లా కేంద్రంలో అంటే లక్షల రూపాయల వ్యవహారం. ఐతే లక్షలు కావాలంటే ఎవరు మాత్రం ఇస్తారు. వ్యాపారం చేస్తామంటే... Read more
May 25 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై న్యాయస్థానం అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి అక్కడ చిత్రాలను రూపోందించిన దర్శకుడిగా పాపులారిటీని సంపాదించిన ఆయన..... Read more
May 25 | ఆవేశం, కంగారు, తొందరపాటు మనల్ని ఊబిలోకి నెట్టివేస్తాయి. వీటి ప్రభావంతో ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు.. చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. అందుకనే పెద్దలు అంటారుగా తన కోపమే తన శత్రువు,... Read more
May 25 | ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోన మహమ్మారి.. భారతదేశంలోనూ అధికారికంగా ఐదు లక్షలమందికిపైగా పోట్టనపెట్టుకుంది. అయితే అల్పా, డెల్టా వేరియంట్లు నేరుగా పేషంట్ల శ్వాసకోశలపై ప్రభావాన్ని చూపగా, ఆతరువాత తీవ్ర లక్షణాలు లేనిది... Read more