Woman 'gang-raped', paraded with garland of slippers in Delhi అత్యాచార బాధితురాలి మెడలో చెప్పులు వేసి ఊరేగింపు..

Kidnapped gang raped hair chopped 4 arrested after assault on delhi woman

woman gangrape, assaulted, kidnapped, delhi, republic day arrest, Shahdara gang rape, Delhi gang rape,Vivek Vihar gang rape, sexual assault on woman, DCW chief Swati Maliwal, Delhi Police, illicit liquor sellers, woman's personal enmity,

The Delhi Police has arrested four accused after a woman was allegedly kidnapped, gang-raped and assaulted in the Vivek Vihar area of the national capital on Republic Day. The incident is suspected to be the result of the woman's personal enmity with the accused, police said. The woman's hair was chopped, she was garlanded with shoes and made to walk the streets by the accused as the locals cheered on.

ITEMVIDEOS: అత్యాచార బాధితురాలికి పరాభవం.. మెడలో చెప్పులు వేసి ఊరేగింపు..

Posted: 01/27/2022 01:46 PM IST
Kidnapped gang raped hair chopped 4 arrested after assault on delhi woman

సరిగ్గా దేశ గణతంత్ర దినోత్సవ వేడుకల రోజున దేశరాజధాని న్యూఢిల్లీలో దారుణం జరిగింది. తన బిడ్డతో కలసి ఓ వీధిలో ఒంటరిగా నివసిస్తున్న మహిళపై ముగ్గురు స్థానికులు బహిరంగంగా సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. బహిరంగంగా జరుగుతున్న ఈ దారుణాన్ని అక్కడి మహిళలు అడ్డుకోవాల్సిందిపోయి అత్యాచారం చేస్తున్న మగవారికి మద్దతుగా నిలిచారు. తీవ్ర మానిసిక అందోళనకు గురైన అత్యాచార బాధితురాలిని అక్కడి మహిళలు మరింతగా అవమానించారు. అమెను శిరోముండనం చేసి, మెడలో చెప్పులదండేసి వీధుల్లో ఊరేగించారు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని వివేక్ విహార్ కస్తూర్బా నగర్ లో గణతంత్ర దినోత్సవం రోజునే జరిగింది.

బాధితురాలి చెల్లెలి ఫిర్యాదుతో పాటు జాతీయ మహిళా కమీషన్ అదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు మహిళలను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అమెపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు మాత్రం ఇప్పటికీ పరారీలోనే వున్నారు. అయితే బాధితురాలని స్థానిక మహిళలు దారుణంగా అవమానిస్తున్న తరుణంలో ఘటనను కొందరు స్థానికులు వీడియో తీసి నెట్టింట్లో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. ఇంతకీ బాధితురాలు చేసిన నేరం ఏమిటీ.? ఆమెను స్థానిక మహిళలు ఎందుకు టార్గెట్ చేశారు. అమెకు స్థానిక యువకుడి మరణానికి కారణం ఏమిటీ.? అన్న వివరాల్లోకి వెళ్తే.. భర్త చనిపోవడంతో.. ఉన్న తన ఒక్కగానొక్క కూతురితో కలిసి స్థానికంగా బతుకుతోంది.

ఆమె ఇంటి పక్కనే ఉండే ఓ యువకుడు ఆమెను ఇష్టపడ్డాడు. అమెను పెళ్లి చేసుకుంటానని కూడా వెంటపడ్డాడు. అయితే అప్పటికే ఓ బిడ్డకు తలైన కారణంగా అమె యువకుడి ప్రేమను నిరాకరించింది. తన బిడ్డకు మంచి భవిష్యత్తు కోసమే తాను బతుకుతున్నానని చెప్పింది. అయితే బాధితురాలు నిరాకరించిన తరువాత కొన్నాళ్లకు అమె వెంట పడే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై ఆగ్రహం చెందిన ఆ యువకుడి కుటుంబ సభ్యులు ఆ మహిళపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించారు. అమె కారణంగానే తమ బిడ్డ బలవన్మరణానికి కారణమని వారు భావించారు. సరిగ్గా గణతంత్ర దినోత్సవం రోజున సదరు బాధితురాలిని ఇంట్లో నుంచి బయటకు లాగారు. ముగ్గురు బహిరంగంగా గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.

అక్కడే ఉన్న మహిళలంతా ఆపాల్సిందిపోయి ఆ మగవారిని ప్రోత్సహించారు. సామూహిక అత్యాచారం తర్వాత బాధితురాలికి నిందితులు శిరోముండనం చేశారు.. చితకబాదారు.. మొహానికి నల్ల రంగు పూసి.. మెడలో చెప్పులదండ వేసి వీధులన్నీ తిప్పారు. ఆ వీడియోను చూసిన ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్ అయింది. 20 ఏళ్ల అమ్మాయిపై అక్రమ మద్యం అమ్మకందారులు దారుణానికి తెగబడ్డారని, దీనిపై ఢిల్లీ పోలీసులు 72 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఢిల్లీ విమెన్ కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ ఆదేశించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులు, వారికి సహకరించిన మహిళలపైనా కేసు నమోదు చేయాలని ఆదేశాలిచ్చారు. ఇంతకుముందు నిందితులపై అక్రమ మద్యం అమ్మకాలు, డ్రగ్స్ కార్యకలాపాలకు సంబంధించిన కేసులనూ తిరగదోడాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles