a unique case of reincarnation in rajasthan పునర్జన్మ: 9ఏళ్ల క్రితం ఎలా చనిపోయిందో చెప్పిన 4ఏళ్ల బాలిక

Rajasthan udaipur know the story of reincarnation 4 year old girl told shocking things

4-year-old girl, Kinjal, reincarnation, Ratan Singh, Pankaj, Usha, Nathdwara, Parawal, Rajsamand, Piplantri, Udaipur, Rajasthan, Crime

In Rajsamand, Rajasthan, a 4-year-old girl has claimed about her reincarnation. Everyone from the parents to the relatives and the villagers are astonished by the words of the girl. The things and tales that the innocent is telling about the past lives have turned out to be true.

పునర్జన్మ: 9ఏళ్ల క్రితం ఎలా చనిపోయిందో చెప్పిన 4ఏళ్ల బాలిక

Posted: 01/25/2022 12:24 PM IST
Rajasthan udaipur know the story of reincarnation 4 year old girl told shocking things

పునర్జన్మల ఆధారంగా అనేక బాషల్లో పలు సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే పునర్జన్మ అనేవి నిజంగా ఉన్నాయా? లేక కేవలం కల్పితాలేనా..? అని అడిగితే మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతుంటాయి. కొందరు ఉన్నాయని నమ్మితే, మరికొందరు అలాంటివేవీ లేవని కొట్టిపడేస్తుంటారు. ఎవరు ఏం చెప్పినా.. లేవు అన్నవాటికి ఆధారాలు అవసరం లేదు. కాబట్టి.. దానికే ఎక్కువ మంది ఓటు వేస్తుంటారు. ఇక పునర్జన్మలు వున్నాయని అంటే.. ఎలా నిరూపిస్తాం.. కానీ పునర్జన్మలు వున్నాయని.. గట్టిగా చెప్పడమే కాదు.. తన గత జన్మలోని బిడ్డలను, తోబుట్టువులను కూడా గుర్తుపట్టి వారితో నిత్యం ఫోన్ లో టచ్ లో ఉందీ బాలిక. ఔనా అంటూ అశ్చర్యపోతున్నారా.. ఇది ముమ్మాటికీ నిజం.

రాజస్థాన్‌కు చెందిన నాలుగేళ్ల బాలిక గత జన్మ వివరాలను పూసగుచ్చినట్టు వివరిస్తూ అందరినీ సంభ్రమాశ్చర్యానికి గురిచేస్తోంది. ఏదో నోటికి వచ్చింది అలా చెబుతోందని అనుకుంటున్నారా.? కానేకాదు. బాలిక చెప్పిన విషయాలపై ఆరా తీస్తే అన్నీ నిజమేనని తేలింది. ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని పారావాల్ గ్రామానికి చెందిన రతన్‌సింగ్ చుందావత్‌కు ఐదుగురు కుమార్తెలు. వారిలో నాలుగేళ్ల కింజల్ ఒకరు. ఏడాది క్రితం నా సోదరుడు ఏడంటూ తండ్రి రతన్‌సింగ్‌ను ఆ బాలిక అడిగింది. అయితే, ఆమె మాటలను రతన్‌సింగ్ పట్టించుకోలేదు. అయినప్పటికీ ఆమె అడగడం మానలేదు. ఒక రోజు బాలిక తన గతజన్మ స్మృతుల గురించి పూసగుచ్చినట్టు తల్లిదండ్రులకు వివరించింది.

అప్పట్లో తన తల్లిదండ్రులు, సోదరుడి గురించి చెబుతూ వారి పేర్లను కూడా చెప్పింది. అప్పట్లో తన పేరు ఉష అని, 2013లో ప్రమాదశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి.. ఆ మంటల్లో కాలిపోయి మరణించానని చెప్పింది. దీంతో కుమార్తె మానసిక అనారోగ్యంతో బాధపడుతోందని భావించి వెంటనే చిన్నారిని వైద్యులకు చూపించారు. పరీక్షల్లో ఆమెకు ఎలాంటి సమస్యలు లేవని వైద్యులు తేల్చారు. ఆరోగ్య సమస్యలు లేవని తేలడంతో బాలికను వెంటపెట్టుకుని ఆమె చెబుతున్న పిప్లాంత్రి అనే గ్రామానికి వెళ్లారు. వీరుంటున్న గ్రామానికి అది 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. గ్రామానికి వెళ్లిన చిన్నారి తన గత జన్మ తల్లిదండ్రులను గుర్తించింది.

తన ఇద్దరు పిల్లలు ఎలా ఉన్నారని వారి పేర్లతో సహా అడిగి తెలుసుకుంది. ఆ ఇంటితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలడంతో తాను చనిపోయానంటూ ఆ రోజు జరిగిన ఘటనను పూర్తిగా వివరించింది. చిన్నారి మాటలు పూర్తి వాస్తవంగా ఉండడంతో ఇరు కుటుంబాలు ఆమె చెప్పింది నిజమేనని తేల్చారు. ఈ ఘటన తర్వాత రెండు కుటుంబాల మధ్య బంధుత్వానికి అతీతమైన బంధం ఏర్పడింది. బాలిక ప్రస్తుతం తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. గత జన్మలోని తల్లిదండ్రులతో తరచూ ఫోన్‌లో మాట్లాడుతూ.. తనకన్నా వయసులో పదేళ్ల పెద్దవారైన తన పిల్లల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటోంది. ఈ విషయం మాత్రం ఇప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాలలో సంచలనంగా మారింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 4-year-old girl  Kinjal  reincarnation  Ratan Singh  Pankaj  Usha  Nathdwara  Parawal  Rajsamand  Piplantri  Udaipur  Rajasthan  Crime  

Other Articles

Today on Telugu Wishesh