BJP MLA’s son among 7 students killed in road accident మహారాష్ట్ర రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే ఏకైక పుత్రుడు దుర్మరణం

Maharashtra seven medical students killed in accident in wardha district

Wardha, Maharashtra, Neeraj Chauhan, Vivek Nandan, Pratyush Singh, Shubham Jaiswal, Avishkar Rahangdale, Pawan Shakti, medical intern Nitesh Singh, Selsura accident, Narendra Modi, Avishkar Rahangdale, Wardha accident, Wardha SP Prashant Holkar, Selsura, Vijay Rahangdale

Seven medical students died in Maharashtra’s Wardha district on Monday night after their vehicle fell off a bridge, ANI reported. The accident took place near the Selsura village of Wardha. All of those who died were students at the district’s Sawangi Medical College. Of the seven one is Avishkar Rahangdale, is the son of Bharatiya Janata Party MLA in Maharashtra, Vijay Rahangdale.

రోడ్డు ప్రమాదం: ఏడుగురు వైద్య విద్యార్థుల దుర్మరణం.. మృతుల్లో ఎమ్మెల్యే ఏకైక పుత్రుడు

Posted: 01/25/2022 11:28 AM IST
Maharashtra seven medical students killed in accident in wardha district

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాష్ట్రంలోని వార్థా జిల్లా పరిధిలోని జరిగిన ప్రమాదంలో ఏడుగురు వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. సావంగిలోని దత్తా మేఘే మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు యావత్‌ మాల్ నుంచి వార్ధాకు కారులో వెళ్తుండగా గత అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంటన్నర సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సెల్సురా వద్ద వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీ కొట్టాడు. దీంతో అది అదుపుతప్పి వంతెన పైనుంచి కింద పడి నుజ్జునుజ్జు అయింది. దీంతో విద్యార్థులందరూ అక్కడికక్కడే మృతి చెందారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న లారీ డ్రైవర్ వార్దా చేరుకోగానే పోలీసులకు సమాచారం అందించాడు.

పోలీసులు వివరాల ప్రకారం ఈ ప్రమాదం సోమవారం రాత్రి 1.30 గంటల ప్రాంతంలో జరిగింది. కారు డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు ప్రారంభించారు. మృతుల్లో గోండ్యా జిల్లా తిరోడా బీజేపీ ఎమ్మెల్యే విజయ్ రహంగ్‌డేల్ ఏకైక కుమారుడు ఆవిష్కర్ రహంగ్‌డేల్ కూడా ఉన్నట్టు  గుర్తించారు. మరోవైపు, ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు పోలీసుల రాకకుముందే విద్యార్థులను కాపాడే ప్రయత్నం చేశారు. అయితే, అప్పటికే వారంతా మరణించినట్టు చెప్పారు.

మృతులు.. నీరజ్ చౌహాన్, వివేక్ నందన్, ప్రత్యూష్ సింగ్, శుభమ్ జైస్వాల్ ఎంబీబీఎస్ చివరి సంవత్సరం విద్యార్థులు కాగా, అవిష్కర్ రహంగ్‌డేల్, పవన్ శక్తి మొదటి సంవత్సరం విద్యార్థులు, నితేష్ సింగ్ మెడికల్ ఇంటర్న్. కాగా, మృతి చెందిన ఏడుగురు విద్యార్థుల మృతదేహాలను పోలీసులు సావంగి మెడికల్ కాలేజీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వైద్య విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేస్తూ మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికి ₹ 2 లక్షలు గాయపడిన వారికి ₹ 50,000 ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles