తప్పుడు సమాచారంతో పాటు భారత్ దేశానికి వ్యతిరేకమైన కంటెంట్ కలిగిన పలు పాకిస్తాన్ యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం కొరడా జులిపించింది. దేశానికి విరుద్ధంగా తప్పుడు, అసంబధ్దమైన సమాచారాన్ని ప్రసారం చేస్తూ.. విద్వేషాలను రెచ్చగోట్టే యత్నాలకు పాల్పడుతున్న పాకిస్తాన్ ఆధారిత యూట్యూబ్ ఛానెళ్లను కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ బ్లాక్ చేసింది. పాకిస్తాన్ కు చెందిన సుమారు 35 యూట్యూబ్ ఛానెళ్లపై ఈ మేరకు కొరడా జులిపించామని తెలిపింది. కాగా బ్లాక్ చేసిన ఛానెళ్ల కంటెంట్‌లో పాకిస్తాన్ తన ద్వంద బుద్దిని బయటపెట్టుకుందని.. వారి దేశానికి చెందిన సమాచారం ప్రసారం చేసే బదులు.. భారత్ కు సంబంధించిన సమాచారం ప్రసారం చేయడమేంటని ప్రశ్నించింది.
అందులోనూ ఏకంగా భారత సాయుధ బలగాలు, కాశ్మీర్, భారత్ విదేశీ సంబంధాలకు సంబంధించిన అంశాలను ప్రసారం చేయడమే తప్పు కాగా.. అసంబంధ్దమైన తప్పుడు కథనాలతో కూడిన అంశాలను ప్రస్తావిస్తూ ప్రసారాలు చేస్తోందని అరోపించారు. అంతేకాదు మాజీ సీడీఎస్ బిపిన్ రావత్ మరణం వంటి విషయాలకు సంబంధించి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ గురువారం 35 యూట్యూబ్ ఛానెల్‌లు, రెండు ట్విట్టర్ ఖాతాలు, రెండు ఇన్స్టాగ్రామ్ ఖాతాలు, రెండు వెబ్సైట్లు, ఒక ఫేస్బుక్ ఖాతాను బ్లాక్ చేసినట్లు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ విక్రమ్ సహాయ్ శుక్రవారం తెలిపారు.
అయితే ఈ ఖాతాలన్నీ పాకిస్తాన్ నండి పనిచేస్తాయని, పైగా భారత్‌కి వ్యతిరేకంగా నకిలీ వార్తలను, కంటెంట్లను వ్యాప్తి చేయడమే ముఖ్యోద్దేశం అని పేర్కొన్నారు. అంతేకాదు బ్లాక్ చేసిన ఖాతాలకు సుమారు 130 కోట్ల వ్యూస్, దాదాపు 1.2 కోట్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారని విక్రమ్ సహాయ్ అన్నారు. ఈ మేరకు బ్లాక్ చేసిన ఖాతాలలో అప్నీ దునియా నెట్వర్క్ 14 యూట్యూబ్ ఛానెల్‌ళ్లను నిర్వహిస్తోందని, తల్హా ఫిల్మ్స్ నెట్వర్క్ 13 యూట్యూబ్ ఛానెళ్లను నిర్వహిస్తున్నాయని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2021 నిబంధన16 ప్రకారం జారీ చేసిన ఆదేశాలను ఈ ఖాతాలు ఉల్లంఘించాయని పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
May 25 | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఢిల్లీ పటియాలా హౌజ్ ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతోపాటు రూ.10లక్షల జరిమానా... Read more
May 25 | తన కుటుంబం ఒక చిన్న ఇళ్లు కొనుక్కోవాలని అనుకుంది. అయితే తాముండే గ్రామంలో కాకుండా జిల్లా కేంద్రంలో అంటే లక్షల రూపాయల వ్యవహారం. ఐతే లక్షలు కావాలంటే ఎవరు మాత్రం ఇస్తారు. వ్యాపారం చేస్తామంటే... Read more
May 25 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై న్యాయస్థానం అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి అక్కడ చిత్రాలను రూపోందించిన దర్శకుడిగా పాపులారిటీని సంపాదించిన ఆయన..... Read more
May 25 | ఆవేశం, కంగారు, తొందరపాటు మనల్ని ఊబిలోకి నెట్టివేస్తాయి. వీటి ప్రభావంతో ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు.. చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. అందుకనే పెద్దలు అంటారుగా తన కోపమే తన శత్రువు,... Read more
May 25 | ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోన మహమ్మారి.. భారతదేశంలోనూ అధికారికంగా ఐదు లక్షలమందికిపైగా పోట్టనపెట్టుకుంది. అయితే అల్పా, డెల్టా వేరియంట్లు నేరుగా పేషంట్ల శ్వాసకోశలపై ప్రభావాన్ని చూపగా, ఆతరువాత తీవ్ర లక్షణాలు లేనిది... Read more