Tributes paid to NTR on his death anniversary ఎన్టీఆర్ కు అంజలి ఘటించిన కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు

Balakrishna jr ntr family members remembered ntr on his 26th death anniversary

NT Rama Rao, Former Chief Minister, 26th death anniversary, floral tributes, NTR Ghat, Hussain Sagar lake, Nandamuri Balakrishna, NTR, Telangana, Andhra Pradesh

Rich tributes were paid to former Andhra Pradesh Chief Minister NT Rama Rao on his 26th death anniversary. Rama Rao’s son and popular actor N Balakrishna and other family members and leaders of TDP paid floral tributes at NTR Ghat on the banks of Hussain Sagar lake in Hyderabad.

ఎన్టీఆర్ 26వ వర్థంతి: అంజలి ఘటించిన కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు

Posted: 01/18/2022 11:49 AM IST
Balakrishna jr ntr family members remembered ntr on his 26th death anniversary

ఆంధ్రుల ఆరాధ్యదైవంగా, ఆఖిలాంధ్ర తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ఇప్పటికీ ఎప్పటికీ గూడుకట్టుకున్న అభిమాన నటుడు విశ్వవిఖ్యాత సార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని స్థాపించి.. దేశరాజకీయాలలో పెను ప్రకంపనలు సృస్టించిన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారాక రామారావు 26వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద కుటుంబీకులు నివాళులర్పించారు. నందమూరి నటసింహం బాలకృష్ణతో పాటు నందమూరి రామకృష్ణ, సుహాసిని ఎన్టీఆర్‌ ఘాట్‌కు చేరుకొని నివాళుర్పించి, ఆయన సేవలను గుర్తు చేశారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్‌ చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్‌ను మరిచిపోరన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ స్ఫూర్తిగా నిలిచారని, మాట తప్పని వ్యక్తిత్వం అందరికీ ఆదర్శమన్నారు. తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పారని, బడుగు బలహీన వర్గాలు, పీడిత ప్రజలకు పదవులు ఇచ్చారని తెలిపారు. తెలంగాణలో 610 జీవోను తీసుకొచ్చింది ఎన్టీఆరేన్నారు. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని 610 జీవోలు అమలు చేశారని బాలకృష్ణ పేర్కొన్నారు. ఇక మరోవైపు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నివాళులు అర్పించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. కోవిడ్ బారిన పడిన కారణంగా ఆయన స్వియ నిర్భంథంలో ఉంటూనే ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ మార్గదర్శకంలోనే కార్యకర్తలు, ప్రజలు నడవాలని ఆయన కోరారు. టీడీపీ స్థాపనతో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటారని ఆయన కొనియాడారు. కోవిడ్ ప్రోటోకాల్ నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు రాని జూనియర్ ఎన్టీఆర్.. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తాతయ్య సీనియర్ ఎన్టీఆర్ కు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తన తాతను తలచుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు.

'తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ, నేటికీ, ముమ్మాటికీ... ధ్రువతార మీరే' అని తారక్ ట్వీట్ చేశాడు. తన తాత ఫొటోను షేర్ చేశాడు. మరోవైపు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ, నందమూరి సుహాసిని, లక్ష్మీపార్వతి తదితరులు నివాళి అర్పించారు. ఎన్టీఆర్‌కు మరణం ఉండదని లక్ష్మీపార్వతి అన్నారు. ఎన్టీఆర్ ఘాట్‌లోని సమాధి వద్ద నివాళులు అర్పించిన అమె.. ఎన్టీఆర్‌ భౌతికంగా దూరమైనా అందరి మనసుల్లో ఉన్నారన్నారు. జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్‌ చరిత్ర సృష్టించారని లక్ష్మీపార్వతి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles