Three Maoists killed in encounter at Mulugu తెలంగాణ-చత్తీస్ గడ్ సరిహద్దులో ఎన్ కౌంట‌ర్: ముగ్గురు మావోల హతం

Three maoists killed in encounter at telangana chattishgarh border

Maoists, Encounter, Maoist Party, Maoists, CRPF, anti-naxal squad, singh ganpat rao patil, Venkatapuram, (Nuguru) mandal, Mulugu district, Chattisgarh-Telangana State border, telangana state, pesalapadu forest area, Telangana Grey Hounds, Six Maoist killed Bijapur, four women naxals, naxals killed, encounter with naxals, police personnel, crude bomb explosion, Dantewada district, Chhattisgarh, Crime

Three Maoists were killed in an encounter with the police in Venkatapuram (Nuguru) mandal close to Chattishgarh border in Mulugu district. Sources said a constable of Greyhounds, the elite anti-Naxal squad of Telangana State, sustained injuries in the incident. It is suspected that divisional level leaders of the outlawed CPI Maoists were killed in the exchange of fire between police and Maoists

తెలంగాణ-చత్తీస్ గడ్ సరిహద్దులో ఎన్ కౌంట‌ర్: ముగ్గురు మావోయిస్టుల హతం

Posted: 01/18/2022 12:34 PM IST
Three maoists killed in encounter at telangana chattishgarh border

మావోయిస్టు పార్టీలో మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే దెబ్బమీద దెబ్బలతో పార్టీ ఉనికికే ప్రమాదం సంభవిస్తున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల నుంచి చత్తీస్ గడ్ రాష్ట్రంలోని వలసవెళ్లి కదలికలను పూర్తిగఆ రాష్టానికే పరిమితం చేశారు. అయితే ఈ మధ్యకాలంలో సరిహద్దుల నుంచి తెలంగాణలోకి వస్తున్న మావోయిస్టులకు పోలీసులు చెక్ పెడుతున్నారు. ఇటీవల తెలంగాణలోకి వచ్చి మాజీ సర్పంచ్ భర్తను హతమార్చిన మావోలకు గట్టి ఎదురుదెబ్బ ఇవాలని ఎదురుచూస్తున్న పోలీసులు.. ఇవాళ వెకువ జామున జరిగిన ఎన్ కౌంటర్ తో బదులు తీర్చుకున్నారు. తెలంగాణ-చత్తీస్ గడ్ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్లో ముగ్గురు మావోలను పోలీసులు హతమార్చారు.

ములుగు జిల్లాలోని నుంగూరు మండలపరిధిలోని వెంకటాపురంలో ఛత్తీష్‌గఢ్‌ సరిహద్దుకు సమీపంలో ఇవాళ తెల్లవారుజామున పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు.
ఈ ఘటనలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎలైట్ యాంటీ నక్సల్ స్క్వాడ్ గ్రేహౌండ్స్‌కు చెందిన ఒక కానిస్టేబుల్ గాయపడ్డారని పోలీసువర్గాలు తెలిపాయి. ఎన్‌కౌంటర్ స్థలం నుండి మావోలకు చెందిన అదునాతన రైఫిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ ఎదురుకాల్పుల్లో సీపీఐ మావోయిస్టు డివిజన్ స్థాయి నాయకులు మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ గణపత్ రావ్ పాటిల్ ఈ ఎదురుకాల్పుల విషయమై సందిస్తూ.. ఈ ఘటన గురించి పూర్తి సమాచారం ఇంకా అందలేదని చెప్పారు. ‘‘ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని అడవుల్లో పోలీసులు ఇంకా కూంబింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇప్పటికీ ఆయా ప్రాంతంలో మావోయిస్టులు తలదాచుకున్నారన్న వార్తలు వినబడుతున్నాయిని, అందుకని వారి కోసం అన్వేషణ కొనసాగుతోందని అన్నారు. మావోల కోసం కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అన్నారు. అయితే ఎదురుకాల్పుల్లో మరణించిన మావోయిస్టులు ఎవరన్న విషయాలతో కూడిన సమాచారాన్ని తరువాత ప్రకటిస్తామని గణపత్ రావ్ పాటిల్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles