TDP leader hacked to death in Andhra Pradesh గుంటూరు జిల్లా టీడీపీ నేత చంద్ర‌య్య దారుణ హ‌త్య‌..

Tdp leader hacked to death in andhra pradesh s guntur district

TDP leader Murder, TDP leader Murder in Guntur, TDP leader Murder in veldurthi, TDP leader Murder in Gundlapadu village, TDP leader Murder in Andhra Praesh, Chandrababu naidu condemns TDP leaders Murder, Nara Lokesh condemns TDP leaders Murder, TDP leader, murdered, TDP leader Murder, Gundlapadu village, veldurthi, Guntur, Chandrababu naidu, Nara Lokesh, YSRCP, Andhra Pradesh, Crime

Unidentified miscreants hacked TDP leader Thota Chandraiah to death in Gundlapadu village under Veldurthi Mandal of Andhra Pradesh’s Guntur district. Chandraiah was attacked and killed when he was going to his village on a two-wheeler. The TDP has announced all required support to the Chandraiah family. The former chief minister and TDP chief N Chandrababu Naidu condemned the incident and announced a visit to Macherla.

గుంటూరు జిల్లా టీడీపీ నేత చంద్ర‌య్య దారుణ హ‌త్య‌.. తీవ్రంగా ఖండించిన చంద్రబాబు

Posted: 01/13/2022 03:52 PM IST
Tdp leader hacked to death in andhra pradesh s guntur district

పల్నాడు గడ్డపై మరోమారు ప్రత్యర్థి వర్గాల మధ్య పగలు ప్రాణాలు తీసాయి. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో జరిగిన రాజకీయ నేత హత్య తీవ్ర కలకలం రేపింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు తోట చంద్రయ్య దారుణ హత్యకు గురికావ‌డంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం అలుముకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. టీడీపీ నేత చంద్రయ్యకు ఆయ‌న‌ రాజకీయ ప్రత్యర్థుల మధ్య కొంత కాలంగా గొడ‌వ‌లు ఉన్నాయి. చంద్రయ్య ఈ రోజు ఉద‌యం పని నిమిత్తం బైకుపై బయలుదేరి వెళ్లారు. ముంద‌స్తు ప్ర‌ణాళిక ప్ర‌కారం చంద్ర‌య్య కోసం కాపు కాసిన ప్రత్యర్థులు బైక్‌కు ఓ కర్ర అడ్డుపెట్ట‌డంతో చంద్ర‌య్య కింద‌ప‌డిపోయారు.

దీంతో ఆయ‌న‌పై కత్తులు, కర్రలతో దాడి చేస్తూ విరుచుకుప‌డ‌డంతో చంద్ర‌య్య ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన అనంతరం గుండ్ల‌పాడులో ఉద్రిక్తత నెలకొన‌డంతో మాచర్ల పోలీసులు అక్కడికి చేరుకుని ప‌రిస్థితులు చేయి దాటిపోకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఆధిపత్యపోరే ఈ హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని భావిస్తున్నారు. అయితే, పోలీసులు చాలా ఆల‌స్యంగా గ్రామానికి వ‌చ్చార‌ని చంద్ర‌య్య కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం చంద్రయ్య మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేయ‌గా, త‌మ ప్రాంత టీడీపీ నేత‌ బ్రహ్మారెడ్డి వచ్చే వరకు మృతదేహాన్ని తరలించ‌రాదని కుటుంబ సభ్యులు అడ్డుప‌డ్డారు. దీంతో గుండ్ల‌పాడులో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ప‌లువురు టీడీపీ నేత‌లు ఆ గ్రామానికి త‌ర‌లివెళ్తున్నారు.

టీడీపీ నేత తోట చంద్రయ్యను కొందరు వ్యక్తులు దారుణంగా నడిరోడ్డుపై గొంతు కోసి హ్యత చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ అరాచక పాలనలో ఇప్పటికే చాలా మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క పల్నాడులోనే పదుల సంఖ్యలో హత్యలు జరిగాయన్నారు. జగన్ పాలనపై తిరగబడుతుండడం వల్లే ప్రజలను భయపెట్టేందుకు వైసీపీ నేతలు ఈ హత్యలకు దిగుతున్నారని ఆరోపించారు. దాడులు చేసేవారికే పదవులను ఇచ్చే విష సంస్కృతికి జగన్ బీజం వేశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బోండా ఉమా, బుద్ధా వెంకన్నలపై వైసీపీ వర్గీయులు హత్యాయత్నం చేశారని, పోలీసులు అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే వైసీపీ బరితెగింపులు ఆగేవని అన్నారు. చంద్రయ్య కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles