దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు భారత్‌లో దాదాపు ఐదువేలకుపైగా కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మెరుపు వేగంతో వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారి ఇప్పటికే అమెరికా, బ్రిటెన్, దక్షిణాప్రికా దేశాల్లో లక్షలాధి మందిని ప్రభావితం చేసింది. ఇక భారత్ లోనూ ఇది ప్రభావం చాటుతోంది. అయితే దీని బారినపడ్డ వారిలో చాలా తక్కువ మందిలో లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే చాలా మందిలో ఒమిక్రాన్ లక్షణాలు ఏమాత్రం కనిపంచడం లేదు. ఈ క్రమంలో ఒమిక్రాన్ ఉవ్వెత్తున లేచినా అంతే వేగంగా తగ్గుముఖం పడుతుందని వైద్య నిపుణులు పేర్కోంటున్నారు.
కరోనా ఒమిక్రాన్ వైరస్ కేసులు భారత్ లో జనవరి చివరికి తారస్థాయికి చేరి, ఫిబ్రవరిలో తగ్గుముఖం పడతాయని ప్రముఖ ఎపిడెమాలజిస్ట్, మిచిగాన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త భ్రమర్ ముఖర్జీ తెలిపారు. ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ముందుగానే కేసులు గరిష్ఠాలకు చేరి తగ్గుతాయని అంచనా వేశారు. ఈ రాష్ట్రాల్లో వచ్చే వారం రోజుల్లోనే కేసులు పతాకస్థాయికి చేరతాయన్నారు. ఢిల్లీలో పునరుత్పత్తి రేటు 2 శాతం వరకు వెళ్లి (ఒకరి నుంచి ఇద్దరికి సోకడం) 1.4 శాతానికి తగ్గినట్టు ముఖర్జీ తెలిపారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వచ్చే వారంలోనే కరోనా పాజిటివ్ కేసులు గరిష్ఠాలకు చేరతాయని, దేశవ్యాప్తంగా జనవరి చివరికి తారస్థాయికి చేరి, అనంతరం తగ్గిపోతాయని ముఖర్జీ అభిప్రాయపడ్డారు.
ఒమిక్రాన్ కరోనా వేరియంట్ కు వేగంగా వ్యాప్తి చెందే గుణం ఉందని.. కార్చిచ్చులా వ్యాపిస్తోందని.. అలాగే అదే రీతిలో తగ్గుముఖం కూడా పడతుందని.. ఇది ఎక్కువ రోజుల పాటు కొనసాగబోదని తన విశ్లేషణను ముఖర్జీ వివరించారు. కేసులు ఎక్కువగా వచ్చినా, ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య తక్కువగా ఉందన్నారు. దీనికి దేవుడి అనుగ్రహం, టీకాలు ఇవ్వడం, ప్రజారోగ్య చర్యలు దోహదపడి ఉండొచ్చన్నారు. భారత్ లో సహజ రోగనిరోధకతకు తోడు టీకాలు ఇవ్వడం మేలు చేసిందన్నారు. ఇతర దేశాల్లో కేసులు భారీగా ఉండడం, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య ఎక్కువగా ఉండడానికి టీకాలు తగినంత తీసుకోకపోవడమే కారణమని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 13 | తన బిడ్డ అపదలో ఉన్నాడంటే ప్రతీ తల్లి గజేంద్రమోక్ష ఘట్టంలోని శ్రీమహావిష్ణువు రూపం దాల్చి అత్యంత వేగంగా ప్రతిస్పందించి రక్షిస్తుందని అంటారు. తన బిడ్డకు ఆపద వస్తుందంటే అవసరమైతే పులితో కూడా పోట్లాడి.. తన... Read more
Aug 13 | బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే చేసిన తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు పోందాలంటే యువకులు లంచం ఇవ్వాలి.. యువతులైతే మరో రకంగా సహకరించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రియాంఖ ఖార్గే... Read more
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more