Ex-minister Shankar convicted in 2 cases కోర్టు దోషిగా తేల్చడంతో.. సోమ్మసిల్లి పడిపోయిన మాజీ మంత్రి

Former minister collapses after court convicts him in two cases

former minister p shanker rao, N pandu yadav, Jangaiah, Shivaramulu yadad, aggriculture land, chetanpally, shadnagar, sridevi, voluntarily hurting, Telangana, Crime

A former minister, P Shankar Rao, was convicted in two different criminal cases by MLA and MP Special Court on Wednesday. The judge awarded him punishment to pay a penalty of 3,500 for both the offences. In the first case, N Pandu Yadav lodged a complaint against Shankar Rao that he trespassed into his agriculture land. In an another case, a complainant Sridevi claimed that Shankar Rao came up to her in search of her husband.

కోర్టు దోషిగా తేల్చడంతో.. సోమ్మసిల్లి పడిపోయిన మాజీ మంత్రి

Posted: 01/13/2022 11:36 AM IST
Former minister collapses after court convicts him in two cases

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల న్యాయస్థానంలో దోషిగా నిర్థారించబడినట్టు కోర్టు తీర్పును వినగానే సోమ్మసిల్లి కిందపడ్డారు. సృహతప్పిన ఆయనను వెంటనే న్యాయస్థాన సిబ్బంది నీళ్లు చల్లి లేపారు. ఎవార మంత్రి అంటారా.? ఆయనే షాద్ నగర్, కంటోన్మెంట్ ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ శాసనసభ్యుడు పి.శంకర్‌రావు. ప్రజాప్రతినిధుల న్యాయస్థానంలో ఆయన రెండు కేసులలో దోషిగా తేలారు. ఓ భూవివాదానికి సంబంధించిన కేసులో దోషిగా తేలడంలో పాటు మరో కేసులో ఓ గృహిణిపై దాడి చేయడంతో పాటు వారి ఇంట్లోకి దౌర్జన్యంగా చోరబడి రభస చేసినట్లు తేలింది. కాగా మరో కేసులో ఆయనపై నేరారోపణలు రుజువు చేసేందుకు సరైన సాక్ష్యాలు లేకపోవడంతో న్యాయస్థానం అయనను నిర్ధోషిగా ప్రకటించింది.

అయితే, భూ వివాదంలో బెదిరింపులు, మహిళను దూషించిన కేసులో మాత్రం శంకర్‌రావును కోర్టు దోషిగా తేల్చింది. మహిళను దూషించిన కేసులో రూ. 2,000, మరో కేసులో రూ. 1,500 జరిమానా విధించింది. కోర్టులోనే ఉన్న మాజీ మంత్రి తీర్పు వెలువడిన వెంటనే షాక్‌తో స్పృహ తప్పి పడిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. షాదనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆరేండ్ల క్రితం శంకర్‌రావు ఓ భూ వివాదంలో జోక్యం చేసుకొని పలువురిని బెరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఓ ఇంట్లోకి అక్రమంగా చొరబడి మహిళను బెదిరించారని కూడా ఆయనపై మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి.

వీటిపై సుదీర్ఘ విచారణ అనంతరం ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్‌ తీర్పు చెప్పారు. శంకర్రావుకు మొదట కోర్టు ఆరు నెలలు జైలుశిక్ష విధించింది. అయితే, న్యాయమూర్తి తీర్పు చదువుతున్న సమయంలో కోర్టు హాల్‌లోనే శంకర్‌రావు వీల్‌చైర్‌లో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి శిక్షను రద్దుచేసి ఓ కేసులో రూ.2,000, మరో కేసులో రూ.1,500 జరిమానా విధించిది. మూడో కేసులో ఆయనపై ఉన్న అభియోగాలను కొట్టివేశారు. ఈ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొందరిపై కేసులను కోర్టు కొట్టివేసింది. శంకర్‌రావు పై కోర్టులో అప్పీల్‌ చేసుకొనేందుకు అవకాశం ఇచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles