Vaikuntha Ekadashi on low-key in Hyderabad వైష్ణవాలయాలలో మార్మోగుతున్న హరినామస్మరణలు

Devotees of telugu states throng vaishanv temples on vaikuntha ekadashi

mukkoti ekadasi, tirumala tirupati, yadadri, Sri Laxmi Narasimhaswamy, vaikunta dwara darshanam, vemulavada rajanna, vaishana temple, Telugu states

Devotees throng Vaishnavite shrines in the two Telugu states including the Tirumala Tirupati Devasthanam and Yadadri Sri LaxmiNarasimhaswamy Temple, chilukuru Balaji Temple, Vemulavada Rajanna Temple, and all temples in the locality to perform special puja and to have UttataDwara Darshanam today, which is said to be Auspicious.

వైకుంఠ ఏకాదశి పర్వదినాన కొనసాగుతున్న ఉత్తరద్వార దర్శనాలు

Posted: 01/13/2022 10:42 AM IST
Devotees of telugu states throng vaishanv temples on vaikuntha ekadashi

ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలు హరినామస్మరణతో మారుమ్రోగుతోంది. వేకువ జామునుంచే భక్తులు దేవాలయాలకు పోటెత్తుతున్నారు. వైష్ణవాలయాల్లో హరినామస్మరణ, గోవింద నామస్మరణ మారుమోగుతున్నాయి. ఇక వైష్ణవాలయాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో శైవక్షేత్రాలలోనూ భక్తులతో ఉదయం నుంచే కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుని భక్తులు పులకించిపోతున్నారు. కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఆలయాల్లో కొవిడ్ మార్గదర్శకాలను అమలు చేస్తున్నారు. అయితే, కొన్ని ఆలయాల్లో మాత్రం వైకుంఠ ద్వార దర్శనాలు రద్దు చేశారు.

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి 12.05 గంటలకు వైకుంఠ ద్వారం తెరుచుకున్నది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో వేద పండితులు ధనుర్మాస పూజలు నిర్వహించారు. పూజల అనంతరం 1.45 గంటల నుంచి స్వామివారు ఉత్తరద్వారం ద్వారా భక్తులకు దర్శనమిస్తున్నారు. పర్వదినం సందర్భంగా తిరుమలలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారిని మాడవీధుల్లో స్వర్ణరథంపై ఊరేగించారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారిని స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగించారు. ఈ రథోత్సవంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ దంపతులు, తదితర ప్రముఖులు పాల్గొని స్వర్ణరథాన్ని లాగారు.

సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు సహస్రదీపాలంకార సేవను నిర్వహిస్తున్నారు. అనంతరం స్వామివారు ఉభయనాంచారులతో కలిసి తిరుచ్చిపై మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ నెల 14న వైకుంఠ ద్వాదశి పర్వదినాన స్వామి పుష్కరిణి తీర ముక్కోటి తిరుమలలో ఏకాంతంగా జరుపనున్నారు. శ్రీవారి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంతోపాటు, ప్రధాన కూడళ్లలో విద్యుద్దీకరణ పనులను చేపట్టారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరిన జస్టిస్‌ ఎన్వీ రమణకు ఆలయ అధికారులు, టీటీడీ చైర్మన్‌, స్థానిక ఎమ్మెల్యే ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌ కూడా కుటుంబసమేతంగా స్వామి సేవలో పాల్గొన్నారు.

తెలంగాణ తిరుపతిగా బాసిల్లుతున్న ముక్కోటి ఏకాదశి పర్వదినం కావడంతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి భక్తులకు వైకుంఠ ద్వారదర్శనం ఇచ్చారు. స్వామివారి బాలలయంలో తూర్పు ద్వారం గుండా ఉదయం 6.49 గంటలకు స్వామి వారు దర్శనమిచ్చారు. కొండ కింద కొలువై ఉన్న పాతగుట్ట దేవస్థానంలో కూడా స్వామివారు భక్తులకు ఉదయం 6.49 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలను ప్రారంభించారు. కొవిడ్ నిబంధనల కారణంగా భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్ష్మీసమేత నారసింహుడిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రత్యేకంగా తెప్పించిన పూలు, వజ్రవైడూర్యాలతో ప్రత్యేక సేవపై స్వామివారిని చూడముచ్చటగా అలంకరించారు. ఉదయం 6:49 నుంచి వైకుంఠ ద్వారదర్శనాలు ప్రారంభించారు.

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విలసిల్లి హరిహరక్షేత్రంగా బాసిల్లుతున్న వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకల‌ను కోవిడ్-19 నిబంధనల మేరకు అంతరంగికంగానే అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం ప్రాతః కాల పూజల అనితరం శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారిని, శ్రీ లక్ష్మీ సమేత అనంత‌ పద్మనాభస్వామివారిని అందంగా అలంకరించబడ్డ పల్లకిలో, పెద్ద సేవలో కూర్చుండబెట్టి ఆలయం చుట్టూ వేద పండితుల వేద మంత్రోచ్చరణాల మధ్య మూడు ప్రదక్షిణలు గావించారు. ఆలయ వేదపండితులు, అర్చకుల వేద పనసలతో రాజన్న ఆలయం మారుమోగింది. అనంతరం ఉత్సవమూర్తులతో ఉత్తర ద్వారం గుండా వెళ్తున్న క్రమంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles