Railway passengers to pay development fee extra soon ప్రయాణికులపై కొత్తగా స్టేషన్ యూజర్ చార్జీల వడ్డన..

Railway passengers to shell out extra as development fee for revamped stations

Railway passengers, ticket fares, user charges, non-suburban passengers, redeveloped stations, railway board, suburban passengers, Railway Ministry

Railway Ministry is burdening the passengers to shell out additional Rs 10- to Rs 50 for ticket fares as user charges for availing state-of-the-art amenities at redeveloped stations in future. As per letter issued by railway board class wise station development fee shall be charged from the passengers.

ప్రయాణికులపై కొత్తగా స్టేషన్ యూజర్ చార్జీలు.. వడ్డనకు రైల్వేశాఖ సిద్దం..

Posted: 01/12/2022 06:58 PM IST
Railway passengers to shell out extra as development fee for revamped stations

సామాన్యులు, పేదలను తక్కువ ధరలో సుదూర ప్రయాణాలు అందించే రైలు మార్గం కూడా ఇక మరింత ప్రియం కానుంది. కరోనా కష్టకాలం నుంచి రైలు ప్రయాణాలలో ఇదివరకు అందించిన సబ్సీడీలను పునరుద్దరించని రైల్వే శాఖ.. మూలిగే నక్కపై తాటికాయ వేసినట్లుగా రైలు ప్రయాణికులపై మరింత అదనపు భారం మోసేందుకు సిద్దమయ్యింది. కరోనా అనంతరం పున:ప్రారంభమైన రైళ్లలో అన్ రిజర్వు క్లాస్ కూడా రిజర్వుడ్ క్లాస్ గా మారింది. దీంతో పేదల సుదూర ప్రయాణాలకు కళ్లెం పడింది. రెక్కాడితే కాని డొక్కాడని జీవులపై కూడా రైలు ప్రయాణభారాన్ని మోపిన రైల్వేశాఖ ఇక తాజాగా మరో వడ్డనకు సిద్దమైంది.

ఓ వైపు కేంద్రం రైల్వే బడ్జెట్ ను ఎత్తేసి.. ఒకే బడ్జెట్ విధానాన్ని అవలంభించడం వెనుక అసలు కారణాలు ఏమై ఉంటాయా.? అన్న అనుమానాలు ఇప్పుడిప్పుడే అవగతం అవతున్నాయి. టికెట్ల ధరలను అమాంతం పెంచేసి.. ఓ వైపు సబ్సడీ విధానాన్ని ఎత్తేసి.. మరోవైపు భారాన్ని పెంచుతూ.. ఇంకోవైపు రైళ్లను ప్రైవేటీకరిస్తూ.. ఇది చాలదన్నట్లు పండుగ వేళ్లలో ప్లాట్ ఫామ్ టికెట్లు పెంచుతూ.. అన్ లైన్ టికెటింగ్ కు ఇంటర్నెట్ చార్జీలు వసూళ్లు చేస్తూ.. కేవలం వ్యాపార ధోరణి అవలంభిస్తూ.. రైలు ప్రయాణాల వెనుకున్న అసలు ఉద్దేశాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఇక తాజాగా మరో అదనపు చార్జీలను ప్రయాణికులపై వడ్డించేందుకు రెడీ అవుతున్నారు.

అదేంటంటే.. కొత్తగా స్టేషన్ల డెవలప్ మెంట్ ఫీజు (ఎస్డీఎఫ్) లేదా యూజర్ ఫీజు రూపంలో రుసుములను రైల్వే శాఖ వసూలు చేయనుంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లను అత్యాధునిక వసతులతో, విమానాశ్రయాలను తలపించే మాదిరిగా రైల్వే శాఖ తీర్చిదిద్దుతోంది. ఈ పనుల కాంట్రాక్టులను ప్రైవేట్ సంస్థలు చేపడుతున్నాయి. ఇందులో కొన్నింటి అభివృద్ధి పూర్తి కాగా, మరికొన్ని అభివృద్ధి దశలో ఉన్నాయి. ఇలా అభివృద్ధి చేసిన స్టేషన్ల నుంచి రైలు ఎక్కి వెళ్లే వారు.. అలాగే ఈ స్టేషన్లలో రైలు దిగే వారి నుంచి ఎస్డీఎఫ్ ను రైల్వే శాఖ వసూలు చేయనుంది. రూ.10 నుంచి రూ.50 వరకు ఈ చార్జీ పడనుంది.

టికెట్ బుక్ చేసుకున్నప్పుడే ఆటోమేటిక్ గా ఈ చార్జీ సైతం కలసిపోతుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు రైల్వేబోర్డు ఆమోదం తెలిపి నోటిఫై చేసింది. ప్రస్తుతం విమానాశ్రయాల్లోనూ యూజర్ ఫీజును టికెట్ చార్జీలో బాగంగా వసూలు చేస్తున్నారు. అన్ని రకాల ఏసీ టికెట్లపై రూ.50, స్లీపర్ టికెట్ లపై రూ.25, అన్ రిజర్వ్ డ్ టికెట్లపై రూ.10 గా ఈ చార్జీ ఉంటుంది. సబర్బన్ రైలు సర్వీసులపై ఈ చార్జీ ఉండదు. అంతేకాదు ఇలా అభివృద్ధికి నోచుకున్న స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ ధరను కూడా రూ.10 పెంచనున్నారు. ఈ రూపంలో వచ్చిన ఆదాయాన్ని స్టేషన్ల అభివృద్ధి, నిర్వహణ చేపట్టిన కాంట్రాక్టు సంస్థలు, రైల్వే పంచుకుంటాయి. ముందుగా 50 స్టేషన్లలో ఈ చార్జీలను అమల్లోకి తీసుకురానున్నట్టు రైల్వే వర్గాలు తెలిపాయి. ఇలా అభివృద్ధికి నోచుకుంటున్న రైల్వే స్టేషన్లు ఏపీలో 21, తెలంగాణలో 8 ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles