Marriage can’t put offence of rape on different pedestal: HC భార్యలపై అత్యాచారాలను వేరుగా పరగణించలేం: హైకోర్టు

A woman remains a woman delhi high court on marital rape

Marital rape, Marital rape exemption, Justice C Hari Shankar, offence, nature of relationship, married woman, marital rape, Delhi high court, criminalisation, All India Democratic Womens Association, NGOs RIT Foundation, Crime

The Delhi High Court said that while there can be no compromise with women’s right to sexual autonomy and any act of rape has to be punished, there is a “qualitative difference” between a marital and a non-marital relationship as the former entailed a legal right to expect reasonable sexual relation from the spouse and it played a part in the marital rape exemption in criminal law.

పెళ్లైనా.. బలవంతపు శృంగారం అత్యాచారంగానే పరిగణించాలి: హైకోర్టు

Posted: 01/12/2022 11:28 AM IST
A woman remains a woman delhi high court on marital rape

వివాహమైనా, కాకున్నా బలవంతపు శృంగారాన్ని తిరస్కరించే హక్కు మహిళకు ఉందని ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా జస్టిస్ రాజీవ్ శక్దేర్, జస్టిస్ సి. హరిశంకర్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. వివాహమైనంత మాత్రాన ఇష్టం లేని శృంగారాన్ని నిరాకరించే హక్కును మహిళలు కోల్పోతారా? అని ప్రశ్నించింది. దాదాపు 50 దేశాల్లో వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా  ధర్మాసనం గుర్తు చేసింది.

అత్యాచారం అవివాహిత మహిళ గౌరవాన్ని ఎందుకు ప్రభావితం చేస్తుందని ప్రశ్నించిన న్యాయస్థానం.. మరి అదే విధంగా బలవంతపు శృంగారం కూడా వివాహిత మహిళ గౌరవాన్ని ప్రభావితం చేస్తుంది కదా? అని ఢిల్లీ ప్రభుత్వం తరపు న్యాయవాది నందితా రావును జస్టిస్ రాజీవ్ శక్ధేర్ ప్రశ్నించారు. నందితా రావ్ తన వాదనలు వినిపిస్తూ భర్తకు ప్రస్తుతం ఉన్న మినహాయింపులను రద్దు చేయాల్సిన అవసరం లేదన్నారు. వీటి వల్ల భార్యల గౌరవానికి భంగం కలిగిస్తున్నట్టు నిరూపించగలరా? అని ప్రశ్నించారు. దీంతో కలుగజేసుకున్న జస్టిస్ శక్దేర్.. మహిళ నెలసరిలో ఉన్నప్పుడు శృంగారానికి నిరాకరిస్తే, అప్పుడు అతడు బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడితే అది నేరం కాదా? అని ప్రశ్నించారు.

స్పందించిన నందిత రావ్.. అది నేరమే కానీ అత్యాచార పరిధిలోకి రాదని సమాధానమిచ్చారు. మరోమారు కల్పించుకున్న న్యాయమూర్తి.. ఇప్పుడు ఇదే ప్రశ్నార్థకమవుతోందని, సహజీవనం చేసే వారి విషయంలో ఈ చర్య ఐపీసీ-375 పరిధిలోకి వస్తే, వివాహిత విషయంలో ఎందుకు రాదని ప్రశ్నించారు. సంబంధాన్ని బట్టి అలా చెప్పడం సరికాదని న్యాయమూర్తి అన్నారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 375 నేరం జరిగిన పరిస్థితితో వ్యవహరిస్తుంది.. అయితే మినహాయింపు మాత్రం నిందితులను తప్పించేందుకు దోహదపడుతోందని జస్టిస్ రాజీవ్ శక్ధర్ వ్యాఖ్యానించారు. ఈ తరహా మినహాయింపులు సబబేనా అన్నది ఆర్టికల్ 14, 21లో ఉన్న నిర్దిష్టతను బట్టి పరిశీలిస్తామని న్యాయస్థాన ధర్మాసనం పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles