Rs 800 cr black money in three Real estate companies ఆ మూడు రియల్ ఎస్టేట్ సంస్థల్లో రూ.800 మేర నల్లధనం.!

800 crore found after raids on real estate groups in andhra telangana

Tax raid in Andhra,Income Tax Department, Central Board of Direct Taxes (CBDT), IT Raids, Real Estates firms, Black Money transactions, Land Development and construction, Navya Developers, Skandhanshi infra, Ragamayuri infra, Bengaluru, Hyderabad, Kurnool, Ananthapur, Kadapa, Nandyal, Bellary, Shadnagar, Telangana, Andhra Pradesh

The Income Tax Department has detected unaccounted cash transactions of ₹ 800 crore after it recently raided three real estate groups in Andhra Pradesh and Telangana, the CBDT said. The unidentified groups are engaged in the business of land development and construction and the taxman raided over two dozen premises linked to them on January 5 in Kurnool, Ananthapur, Kadapa, Nandyal, Bellary and some other locations, it said.

ఆ మూడు రియల్ ఎస్టేట్ సంస్థల్లో రూ.800 మేర నల్లధనం.!

Posted: 01/11/2022 12:36 PM IST
800 crore found after raids on real estate groups in andhra telangana

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలోని తమ రియల్ ఎస్టేట్ వ్యాపారాలను నిర్వహిస్తున్న మూడు రియల్ ఎస్టేట్ సంస్థల్లో కోట్ల రూపాయల నల్లధనం వ్యవహారాలు యధేశ్చగా సాగుతున్నాయని ఆదాయ పన్నుశాఖ అధికారులు తెలిపారు. గత బుధవారం రోజున ఈ మూడు సంస్థల్లో సోదాలు నిర్వహించినట్టు ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల ఐదు నుంచి నాలుగు రోజులపాటు ఐటీ అధికారులు ఈ కంపెనీల్లో సోదాలు నిర్వహించినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. ఈ సందర్భంగా ఏకంగా రూ. 800 కోట్ల నల్లధన లావాదేవీలను గుర్తించినట్టు పేర్కొంది. అలాగే, రూ. 1.64 కోట్ల నగదు కూడా పట్టుబడిందని వెల్లడించింది.

భూముల అభివృద్ధి, నిర్మాణాల వ్యాపారం చేస్తున్న మూడు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలపై దాడులు చేసిన ఆదాయశాఖ అధికారులు, వారికి సంబంధించిన ఏకంగా రెండు డజన్లకు పైగా స్థలాలపై జనవరి 5 నుంచి సోదాలు నిర్వహించారు. అటు కర్నాటక, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో ఈ సంస్థకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యవహరాలు జరుగుతున్నాయని తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, కర్నూలు, అనంతపురం, కడప, నంద్యాల, బళ్లారి తదితర ప్రాంతాల్లో ఆదాయశాఖ అధికారులు దాడులు చేశారని తెలిపారు. దీంతో పాటు అనంతపురం, కర్నూలు, కడప, నంద్యాలతోపాటు వివిధ పట్టణాల్లో ఈ కంపెనీలకు చెందిన 24 కార్యాలయాల్లో నాలుగు రోజులపాటు తనిఖీలు నిర్వహించినట్టు చెప్పారు.

ఇందులో భాగంగా పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. చేతితో రాసిన పుస్తకాలు, అగ్రిమెంట్లు మరియు డిజిటల్ డేటా వంటి నేరారోపణ పత్రాలు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల నుండి స్వాధీనం చేసుకున్నట్లు సిబిడిటి తెలిపింది. కాగా, నవ్య డెవలపర్స్, రాగమయూరి ఇన్‌ఫ్రా, స్కంధానీ ఇన్‌ఫ్రా కంపెనీలు ఆస్తుల రిజిస్టర్డ్ విలువ కంటే ఎక్కువ "నగదు స్వీకరిస్తున్నట్లు" గుర్తించబడ్డిందని తెలిపారు. ఈ అక్రమ నగదును భూముల కొనుగోలు సహా ఇతర ఖర్చులకు వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ తనిఖీలలో లెక్కల్లో చూపని రూ. 1.64 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా ఏకంగా రూ. 800 కోట్ల వరకు ఖాతాలో లేని నగదు లావాదేవీలను గుర్తించినట్లు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles