ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలోని తమ రియల్ ఎస్టేట్ వ్యాపారాలను నిర్వహిస్తున్న మూడు రియల్ ఎస్టేట్ సంస్థల్లో కోట్ల రూపాయల నల్లధనం వ్యవహారాలు యధేశ్చగా సాగుతున్నాయని ఆదాయ పన్నుశాఖ అధికారులు తెలిపారు. గత బుధవారం రోజున ఈ మూడు సంస్థల్లో సోదాలు నిర్వహించినట్టు ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల ఐదు నుంచి నాలుగు రోజులపాటు ఐటీ అధికారులు ఈ కంపెనీల్లో సోదాలు నిర్వహించినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. ఈ సందర్భంగా ఏకంగా రూ. 800 కోట్ల నల్లధన లావాదేవీలను గుర్తించినట్టు పేర్కొంది. అలాగే, రూ. 1.64 కోట్ల నగదు కూడా పట్టుబడిందని వెల్లడించింది.
భూముల అభివృద్ధి, నిర్మాణాల వ్యాపారం చేస్తున్న మూడు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలపై దాడులు చేసిన ఆదాయశాఖ అధికారులు, వారికి సంబంధించిన ఏకంగా రెండు డజన్లకు పైగా స్థలాలపై జనవరి 5 నుంచి సోదాలు నిర్వహించారు. అటు కర్నాటక, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో ఈ సంస్థకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యవహరాలు జరుగుతున్నాయని తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, కర్నూలు, అనంతపురం, కడప, నంద్యాల, బళ్లారి తదితర ప్రాంతాల్లో ఆదాయశాఖ అధికారులు దాడులు చేశారని తెలిపారు. దీంతో పాటు అనంతపురం, కర్నూలు, కడప, నంద్యాలతోపాటు వివిధ పట్టణాల్లో ఈ కంపెనీలకు చెందిన 24 కార్యాలయాల్లో నాలుగు రోజులపాటు తనిఖీలు నిర్వహించినట్టు చెప్పారు.
ఇందులో భాగంగా పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. చేతితో రాసిన పుస్తకాలు, అగ్రిమెంట్లు మరియు డిజిటల్ డేటా వంటి నేరారోపణ పత్రాలు ప్రత్యేక సాఫ్ట్వేర్ అప్లికేషన్‌తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల నుండి స్వాధీనం చేసుకున్నట్లు సిబిడిటి తెలిపింది. కాగా, నవ్య డెవలపర్స్, రాగమయూరి ఇన్ఫ్రా, స్కంధానీ ఇన్ఫ్రా కంపెనీలు ఆస్తుల రిజిస్టర్డ్ విలువ కంటే ఎక్కువ "నగదు స్వీకరిస్తున్నట్లు" గుర్తించబడ్డిందని తెలిపారు. ఈ అక్రమ నగదును భూముల కొనుగోలు సహా ఇతర ఖర్చులకు వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ తనిఖీలలో లెక్కల్లో చూపని రూ. 1.64 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా ఏకంగా రూ. 800 కోట్ల వరకు ఖాతాలో లేని నగదు లావాదేవీలను గుర్తించినట్లు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
May 28 | పెంపుడు కుక్కతో పాటు వాకింగ్ చేసేందుకు స్టేడియం ఖాళీచేయించిన ఐఏఎస్ అధికారుల జంట నిర్వాకంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధీగా ఉండాల్సిన ఐఏెఎస్ అధికారులు కూడా నాయకులను మించిపోతున్నారని... Read more
May 28 | కన్న కొడుకు సక్రమమైన మార్గంలో నడవాలని ఏ తల్తైనా కోరుకుంటోంది. అదే కొడుకు తెలిసి.. చేసినా తెలియక చేసినా కొడుకును ఓ వైపు మందలిస్తూనే.. మరోవైపు తన కోడుకును వెనుకేసుకొస్తోంది. అమెది మాతృ హృదయం.... Read more
May 28 | కాలం మారింది.. కాలంతోపాటు మనుషులు కూడా మారుతున్నారు. సంప్రదాయాలను పాతచింతకాయ పచ్చడిలా భావిస్తున్న యువతరం నిత్యం ట్రెండీ ఆలోచనలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. పదిమందిలో కొత్తగా కనిపించాలని అనుకోవడమే కాదు.. విభిన్నంగా అలోచించి జీవితంలో... Read more
May 28 | తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నందమూరి తారకరామారావు శత జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఆయన ఘాట్ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ పుష్పగుచ్ఛాలు ఉంచి... Read more
May 27 | హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ లోక్ దళ్ మాజీ అధ్యక్షుడు వృద్దనేత ఓం ప్రకాశ్ చౌతాలా మరోమారు కారాగారవాసానికి వెళ్లనున్నారు. ఇటీవలే ఆయన ఉపాధ్యయుల అక్రమ నియామకాల కేసులో జైలు శిక్షను అనుభవించి.. విడుదలయ్యారు.... Read more