Dates For Assembly Elections In 5 States Announced ఐదు రాష్ట్రాల ఎన్నికలకు మ్రోగిన నగారా

Assembly election 2022 7 phase election in up results for all states on march 10

assembly elections 2022, punjab assembly elections, uttar pradesh assembly elections, assembly elections covid19 guidelines, Uttar Pradesh elections dates live, Uttarakhand elections, Punjab elections, Goa elections, Manipur elections, Samajwadi Party, BJP, PM Modi, Akhilesh Yadav, Congress, Priyanka Gandhi, Rahul Gandhi, Mayawati, BSP, Arvind Kejriwal, ferozepur rally, pm security breach, election commission, election press conference, election 2022, state assembly election 2022, assembly election 2022 dates, Election Commission of India, Election Commission of India press Conference, UP Election 2022, UP Election News, UP Election Date Announcement

The Election Commission of India (ECI) Saturday announced the schedule for the assembly elections in Goa, Punjab, Manipur, Uttarakhand and Uttar Pradesh. While UP will go to polls in seven phases from February 10 to March 7, Punjab, Uttarakhand and Goa will vote in a single phase on February 14. Manipur, on the other hand, will vote in two phases on Feb 27 and March 3. The counting of votes will be held on March 10, the poll body added.

ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఫెడ్యూల్ విడుదల.. తేదీల ప్రకటన. మార్చి 10న కౌంటింగ్

Posted: 01/08/2022 06:03 PM IST
Assembly election 2022 7 phase election in up results for all states on march 10

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగరా మ్రోగింది.  పంజాబ్, ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఐదు రాష్ట్రాల్లో ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు మే 14తో ముగుస్తుండగా, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీల కాలపరిమితి మార్చితో ముగియనుంది. దీంతో ఫిబ్రవరి 10న జరిగే తొలిదశ పోలింగ్ తో ఎన్నికలు ప్రారంభం కానుండగా, ఫిబ్రవరి 14న రెండో దశ, ఫిబ్రవరి 20న మూడో దశ, ఫిబ్రవరి 23న నాలుగో దశ, ఫిబ్రవరి 27న ఐదో దశ, మార్చి 3న ఆరో దశ, మార్చి 7న ఏడో దశ పోలింగ్ జరగనుంది.  

తాజా నోటిఫికేషన్‌ ప్రకారం ఉత్తర ప్రదేశ్ లోని 403 స్థానాలకు ఏడు దశలు, మణిపూర్ లోని 60 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరుగునున్నాయి. కాగా 40 అసెంబ్లీ స్థానాలున్న గోవా, 117 స్థానాలున్న పంజాబ్‌ అసెంబ్లీకి, 70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్ లో మాత్రం  ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్‌ విడుదల సందర్భంగా ప్రధాన ఎన్నికల ఆధికారి సుశీల్‌ చంద్ర మాట్లాడుతూ.. మొత్తం ఐదు రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగనున్నాయని తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో 18.34 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఐదు రాష్ట్రాల్లోనూ మహిళా ఓటర్లు పెరిగారని తెలిపారు.

ఈ ఐదు రాష్ట్రాల్లో కోవిడ్‌ సేఫ్‌ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటించి.. పరిస్థితిని సమీక్షించారని.. ఆయా రాష్ట్రాల వైద్యారోగ్యశాఖ అధికారులతోనూ సంప్రదింపులు జరిపిన తరువాతే ఎన్నికలకు సమాయత్తమయ్యామన్నారు. మాస్క్, థర్మల్ స్కానర్లు,  శానిటేషన్  తదితర లాజిస్టిక్స్ అన్ని  పోలింగ్ కేంద్రాల్లో ఉంచుతామన్నారు. ఇక పోలింగ్ కేంద్రాలను కూడా గణనీయంగా పెంచామని, దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద కూడా రద్దీ తగ్గుతుందన్నారు. సగటున ఒక్కో పోలింగ్ స్టేషన్లో 860 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు.

ఒమిక్రాన్ వేరియంట్ ప్రభులుతున్న సందర్భంలో ఎన్నికలసంఘం పలు నూతన సవరణలను అభ్యర్థుల అందుబాటులోకి తీసుకువచ్చింది. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా నామినేషన్లు వేసే అవకాశం కల్పించామని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. అభ్యర్థులు నేర చరిత్రను పార్టీలన్నీ తమ వెబ్ సైట్లలో హోం పేజిలో ఉంచాలని సూచించారు.అభ్యర్థిని ఎంపిక చేసిన 24 గంటల్లో నేరచరిత్ర వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. కోవిడ్‌ సోకిన వాళ్లకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించారు. యూపీ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లో అభ్యర్థులు రూ.40లక్షలు ఎన్నికల వ్యయాన్ని కల్పించిన సీఈసీ.. గోవా, మణిపూర్‌ అభ్యర్థులకు మా్తరం రూ.28లక్షలను వ్యయంగా నిర్ధేశించింది.

జనవరి 14న తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్‌
* తొలి దశ పోలింగ్‌ తేదీ ఫిబ్రవరి - 10
(యూపీలో మాత్రమే)

రెండో దశ ఎన్నికల నోటిఫికేషన్‌ జనవరి 21న
* రెండో దశ పోలింగ్‌ ఫిబ్రవరి -14
-(పంజాబ్‌, గోవా, ఉత్తరాఖండ్‌, యూపీ)
-ఒకే దశలో పంజాబ్‌, గోవా, ఉత్తరాఖండ్‌ ఎన్నికలు

మూడో దశ ఎన్నికల నోటిఫికేషన్‌ జనవరి 25న
* మూడో విడత పోలింగ్‌ ఫిబ్రవరి -20 (యూపీ మాత్రమే)

నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్‌ జనవరి 27న
* నాలుగో విడత పోలింగ్‌ ఫిబ్రవరి -23 (యూపీ మాత్రమే)

ఐదో దశ ఎన్నికల నోటిఫికేషన్‌ ఫిబ్రవరి 01న
* ఐదో విడత పోలింగ్‌ ఫిబ్రవరి -27 (యూపీ, మణిపూర్‌)

ఆరో దశ ఎన్నికల నోటిఫికేషన్‌ ఫిబ్రవరి 04న
* ఆరో విడత ఎన్నికలు మార్చి 3 (యూపీ, మణిపూర్‌)

ఏడో దశ ఎన్నికల నోటిఫికేషన్‌ ఫిబ్రవరి 10న
* ఏడో విడత ఎన్నికలు మార్చి 7న (యూపీ మాత్రమే)

* మార్చి 10న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : assembly elections 2022  punjab  uttar pradesh  Manipur  Uttarakhand  Goa  election commission  Congress  BJP  AAP  SP  Politics  

Other Articles