RBI allows offline digital payments నెట్ లేకుండా.. ఆఫ్ లైన్లో ఇక డిజిటల్ చెల్లింపులు..

Rbi allows offline digital payments capped at rs 200 per transaction

offline payment, RBI, offline transactions, digital transactions, digital payments, digital offline payments, Reserve Bank of India (RBI), Rural India, Economy

Giving a big push to digital transactions in areas with poor internet connectivity, the Reserve Bank of India (RBI) has allowed offline mode of payments using any channel or instrument like cards, wallets or mobile devices. The new framework is applicable with immediate effect, the RBI said.

ఇకపై ఆఫ్ లైన్ డిజిటల్ పేమెంట్స్.. ఆర్బీఐ అదేశంతో తక్షణం అమల్లోకి..

Posted: 01/05/2022 12:15 PM IST
Rbi allows offline digital payments capped at rs 200 per transaction

గ్రామీణ భారతంలోని ప్రజలను కూడా డిజిటలైజ్ చేసేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు పూనుకుంది. నగదు చెల్లింపులు మాత్రమే అత్యధికంగా వుండే గ్రామీణభారతంతో డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడేలా చేయడం కోసం తాజాగా ఆర్బిఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడ ఓ చిక్కుంది. అదేంటంటే డిజిటల్ పేమెంట్స్ కు తప్పనిసరిగా ఇంటర్ నెట్ అవసరం. అంతర్జాలం లేకపోతే డిజిటల్ చెల్లింపులు జరగవు. అయితే వై-ఫై సర్వీసులు, లేదా మొబైల్ డేటా తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే గ్రామీణ భారతంలో ఇప్పటికే అనేక గ్రామాలకు ఫోన్ 2జీ సిగ్నల్ కూడా లభించని పరస్థితి నెలకొంది.

దీంతో గ్రామీణ భారతంలో డిజిటల్ చెల్లింపులకు ఆదరణ లేదు. ఇక గ్రామీణ భారతవాసులకు ఈ అలవాటు కూడా లేదు. ఈ క్రమంలో వీరికి కూడా డిజిటల్ పేమెంట్స్ అలవాటు చేయాలని భారతీయ రిజర్వు బ్యాంకు చర్యలు తీసుకుంది. ఇకపై ఆఫ్ లైన్‌లోనూ డిజిటల్ పేమెంట్లకు అనుమతినిస్తూ భారతీయ రిజర్వు బ్యాంకు విధివిధానాలు రూపొందించింది. సోమవారం వీటిని విడుదల చేయగా, తక్షణమే ఇవి అమల్లోకి వస్తాయని తెలిపింది. అయితే, ఆఫ్‌లైన్ చెల్లింపుల్లో ఒక్కో లావాదేవీ గరిష్ఠంగా రూ. 200, లావాదేవీల మొత్తం రూ. 2 వేలకు మించకుండా మాత్రమే ఈ వెసులుబాటును కల్పించింది. గ్రామీణ ప్రాంతాలతోపాటు చిన్న పట్టణాల్లో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

సెప్టెంబరు 2020 నుంచి గతేడాది జూన్ వరకు కొన్ని ప్రాంతాల్లో వివిధ దశల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టింది. సత్ఫలితాలు రావడంతో దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. అయితే, ఈ చెల్లింపులు ముఖాముఖి (ఫేస్ టు ఫేస్) మాత్రమే చేయాల్సి ఉంటుంది. పాయింట్ ఆఫ్ సేల్ (పీఎస్ఓ) లాంటి యంత్రాల ద్వారానూ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు దీనికి నెట్‌తో పని ఉండదు. రోజువారీ లావాదేవీలు పూర్తయ్యాక వ్యాపారి తన పీఎస్ఓను నెట్‌కు అనుసంధానిస్తే ఆ రోజు జరిగిన లావాదేవీలన్నీ ప్రాసెస్ అవుతాయి. ఈ మేరకు పేమెంట్ సిస్టం ఆపరేటర్లు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వంటి పేమెంట్ సిస్టం పార్టిసిపెంట్లు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని రిజర్వు బ్యాంకు సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles