BJP chief Bandi Sanjay sent to judicial custody జ్యుడీషియల్‌ రిమాండ్‌ కు బీజేపి చీఫ్ బండి సంజయ్

Telangana bjp chief bandi sanjay arrested amid high drama sent to judicial custody

Telangana, Bandi sanjay, Arrest, Bandi, Sanjay, Kumar, Bjp, Karimnagar, Jail, Jailed, Protest, Go 317, Jagarana, Deeksha, Judicial custody, karimnagar, Telangana, Politics

Telangana BJP chief Bandi Sanjay Kumar, who had planned to stage a protest, was taken into custody by the police in Karimnagar on Sunday, January 2, for allegedly violating the state government's guidelines to curb COVID-19, attacking police personnel and violating the Disaster Management Act.

14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ కు బీజేపి చీఫ్ బండి సంజయ్

Posted: 01/03/2022 06:21 PM IST
Telangana bjp chief bandi sanjay arrested amid high drama sent to judicial custody

బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ను కరీంనగర్ కోర్టు 14 రోజుల రిమాండ్ కు పంపించింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317 జివోకు నిరసనగా చేపట్టిన దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. ఆయనను న్యాయస్థానంలో హాజరుపర్చారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించారని బండి సంజయ్‌పై కేసును నమోదు చేసిన పోలీసులు న్యాయమూర్తి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువచ్చారు. అయితే న్యాయస్థానం ఆయనను 14 రోజుల జుడీషియల్ రిమాండ్ కు తరలించింది. అయితే తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్‌ ను విడిపించుకునేందుకు బీజేపి లీగల్ సెల్ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ ను న్యాయస్థానం తోసిపుచ్చింది.

అయితే బండి సంజయ్ కి బెయిల్ మంజూరు చేయరాదని కరీంనగర్ పోలీసులు న్యాయస్థానంలో అభ్యంతరాలను వ్యక్తం చేశారు. బండి సంజయ్ నమోదైన కేసులను పోలీసులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆయనపై నమోదైన 10 కేసులు రిమాండ్ రిపోర్టులో పోలీసులు ప్రస్తావించారు. కాగా బీజేపి లీగల్ సెల్ తరపున వాదనలు వినిపించన న్యాయవాదులు కరీంనగర్ పోలీసులు ఆయనపై నమోదు చేసిన ఐపీసీ 353 సెక్షన్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే పోలీసులు మాత్రం బండి సంజయ్ పై రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి.. తమ వాదనలు బలంగా వినిపించారు.

ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం బండి సంజయ్‌ బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. రెండో ఎఫ్‌ఐఆర్ ఆధారంగా బండి సంజయ్‌ సహా ఐదుగురికి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. కోర్టు తీర్పు అనంతరం వారిని కరీంనగర్‌ జైలుకు తరలించారు. బెయిల్‌ కోసం బండి సంజయ్‌ జిల్లా కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. అయితే జైలులో బండి సంజయ్‌కి అందించే ఆహారాన్ని జైలర్‌ రుచి చూశాకే ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. దీనిపై న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bandi sanjay  Arrest  Bandi  Sanjay  Kumar  Bjp  Karimnagar  Jail  Jailed  Protest  Go 317  Jagarana  Deeksha  Judicial custody  Telangana  Politics  

Other Articles