Anam Ramanarayana Reddy sensational comments on police ‘‘సామాన్యుడికి భద్రత కరువైంది’’: ఎమ్మెల్యే ఆనం తీవ్ర వ్యాఖ్యలు

Ycp mla anam ramanarayana reddy sensational comments on police department

Anam Ramanarayana Reddy, Venkatagiri MLA Anam Ramanarayana Reddy, former Minister Anam Ramanarayana Reddy, Anam Ramanarayana Reddy sensational comments, Anam Ramanarayana Reddy comments on police, Anam Ramanarayana Reddy comments on Local Mafia, Venkatagiri MLA, Local Mafia, Police Department, Razakar Movement, Naxalism, Nellore, Andhra Pradesh, Politics

Venkatagiri MLA and former Minister Anam Ramanarayana Reddy said that the local mafia activities have come down in the state due to stringent measures taken by the police department. He also appealed to police personnel not to involve in such activities as they would bring bad reputation to the department.

మాఫియాతో పోలీసుల మైత్రి.. సామాన్యుడికి భద్రత కరువు: ఎమ్మెల్యే ఆనం తీవ్ర వ్యాఖ్యలు

Posted: 12/30/2021 04:57 PM IST
Ycp mla anam ramanarayana reddy sensational comments on police department

రాష్ట్ర సీనియర్ నేత, మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. అధికార పార్టీలో కొనసాగుతున్న ఆయన పోలీసు శాఖలోని కొందరు అధికారులను టార్గెట్ చేయడం సంచలనంగా మారింది. తనకు పోలీసు శాఖకు చాలా అవినాభావ సంబంధం ఉందని, తన తాత పోలీస్ శాఖలో పనిచేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. అందరు పోలీసు అధికారుల తరహలో డిపార్టుమెంటు ఉత్తమ గౌరవం పొందేలా బాధ్యతలు నిర్వర్తించారన్నారు.

తమ తాతా ఆనం సుబ్బరామిరెడ్డి స్వతంత్ర్య వచ్చేవరకు పోలీసుశాఖలో విదులు నిర్వహించారని తెలిపారు. తన మామ ఆనం రంగారెడ్డి కూడా రజాకార్ల ఉద్యమం వరకు పోలీసు శాఖలో ఒకడిగా సేవలు అందించారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసులు పనితీరు కూడా బాగా వుందని.. వారి అకుంటిత దీక్ష కారణంగా రాష్ట్రంలో నక్సలిజం, ఉగ్రవాదం బాగా తగ్గాయని అన్నారు. అయితే కొందరు పోలీసులు మాత్రం అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారని ఆయన అరోపించారు. కొందరు అధికారుల ప్రోద్భలం, సహాయసహకారాలతో స్థానిక మాఫియా మాత్రం చెలరేగిపోతోందని విమర్శించారు.

కొందరు పోలీసులు కూడా లోకల్ మాఫియాతో చేతులు కలిపారని, దీంతో సామాన్యులకు భద్రత లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటగిరి 9వ బెటాలియన్‌లో నిన్న జరిగిన స్పోర్ట్స్ మీట్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో నమ్మకం, భరోసా కల్పించాల్సిన పోలీసులే ఇలా మాఫియాతో చేతులు కలపడం బాధాకరమన్నారు. పోలీస్ స్టేషన్‌లో న్యాయం జరుగుతుందన్న నమ్మకం సామాన్యుల్లో రోజురోజుకు సన్నగిల్లుతోందన్నారు. అయినా.. పోలీసులు, మాఫియా కలిశాక సామాన్యులకు భద్రత ఇంకెక్కడ ఉంటుందని ప్రశ్నించారు. అలాంటి కలుపు మొక్కలను ఏరిపారేస్తేనే సమాజం బాగుపడుతుందని ఆనం పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles