Women constables save man from committing suicide రైల్వేట్రాకుపై పడుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. అంతలో..

Watch women constables save man from committing suicide on railway track

Man suicide attempt foiled, Man rescued by woman RPF constables, Man laid on railway track, man laid on track to commit suicide, Man rescued women constables, Madhukar sable, suicide attempt, suicide attempt foiled by women constables, RPF women constables, Belapur local, sewri station, Mumbai, Life Saving, RPF India

A group of women constables did a commendable job by saving the life of a 59-year-old man identified as Madhukar Sable, who was about to commit suicide by laying on the railway tracks at Sewri station.

ITEMVIDEOS: రైల్వేట్రాకుపై పడుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. అంతలో..

Posted: 12/30/2021 06:51 PM IST
Watch women constables save man from committing suicide on railway track

సమస్యలు చుట్టుముట్టిన వ్యక్తి వాటినుంచి బయటపడేందుకు కొందరు ప్రయత్నిస్తున్న మార్గాన్నే అనుసరించాడు. అయితే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్న సామెత తెలియని వ్యక్తి బలవన్మరణం కోసం ఏకంగా రైల్వే ట్రాకులపై పడుకున్నాడు. అదీనూ కొంత దూరం నుంచి రైలు వస్తుందని గమనించిన తరువాతే ఈ పనికి పూనుకున్నాడు. సరిగ్గా రైల్వే స్టేషన్ వద్దకు చేరుకుంటున్న రైలు.. అప్పుడే కాస్త నెమ్మెదించింది. దీంతో రైలు పైలెట్ వ్యక్తిని గమనించాడు. ఇంతలో అనూహ్యంగా రైలు ఆగిపోయింది. సరిగ్గా ఆత్మహత్యకు పాల్పడుతున్న ఆ వ్యక్తికి కొంత దూరంలోకి చేరుకున్న రైలు నిలిచిపోయింది. అదెలా..

ముంబైలోని సెవ్రీ రైల్వే స్టేషన్ల సమీపంలోని పట్టాలపై ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తచ్చాడుతున్న విషయాన్ని సెవ్రీ రైల్వేస్టేషన్ లోని రైల్వే ప్రోటెక్షన్ ఫోర్స్ కు చెందిన మహిళా కానిస్టేబుళ్లు గమనించారు. అయితే కాలకృత్యం తీర్చుకుంటున్నాడేమోనని ఊరుకున్నారు. ఇంతలో ఆ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లాల్సిన బేలాపూర్ మెట్రో రైలు వస్తోంది. దీంతో ఆ వ్యక్తి రైలు వస్తుందని గమనించి ఒక్కసారిగా పట్టాలపైకి వచ్చాడు. రైలును గమనిస్తూనే పట్టాలపై పడుకున్నాడు. అయితే వ్యక్తి ఆత్మహత్యకు యత్నిస్తున్నాడని గమనించిన పోలీసలు రైలును నిలపాల్సిందిగా ఎమర్జెన్సీ సిగ్నల్ ఇచ్చారు. దీంతో రైలు వ్యక్తిని సమీపంలోని కొంతదూరంలోనే నిలిచిపోయింది.

దీంతో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు పరుగు పరుగున వెళ్లి సదరు వ్యక్తిని పట్టాలపై నుంచి లేపి.. సెవ్రీ రైల్వే స్టేషన్ లోకి తీసుకువచ్చారు. అతన్ని 59 ఏళ్ల మధుకర్ సాబ్లేగా గుర్తించారు. ఈ ఘటన ఈ నెల 27న సోమవారం రోజు చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు రైల్వే స్టేషన్ లోని సీసీటీవీల్లో నిక్షిప్తం కాగా, మహిళా కానిస్టేబుళ్ల పనితీరును ప్రశంసిస్తూ.. నిన్న ఈ వీడియోలను రైల్వేశాఖను సేకరించిన రాజేంద్ర బి అక్లేకర్ అనే జర్నలిస్టు తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేయగా ఏకంగా రెండు లక్షల మంది వీక్షించారు. ఆలస్యమెందుకు మీరు ఈ వీడియోను వీక్షించండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles