Mercury drops further in parts of Telangana తెలంగాణలో సాధారణం కన్నా కిందకు రాత్రి పూట ఉష్ణోగ్రతలు

Telangana experiences massive drop in mercury since three days

Telangana weather, Telangana temperatures, Telangana State Development Planning Society, Hyderabad weather, Kumarambheem Asifabad, Dip in mercury, low temp in Telangana, Asifabad, Adilabad, Mancherial, Sangareddy, Patancheru, BHEL, Rajendranagar, Hyderabad, Telangana

Adilabad recorded minimum temperature of 7.8 degree Celsius. Many places in the state recorded minimum temperature in single digits. In GHMC limits, Patancheru registered the lowest temperature at 9.4, said Meteorological Centre Hyderabad. The night temperature is likely to be 2-4 degree below normal in few pockets for the next three days. The met office attributed the chill to cold winds blowing from North-East.

తెలంగాణలో మళ్లీ పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. పంజా విసరుతున్న చలిపులి

Posted: 12/30/2021 01:02 PM IST
Telangana experiences massive drop in mercury since three days

రోజురోజుకూ తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుండటంతో రాష్ట్రంలో నమోదువుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. డిసెంబర్ మధ్యనెల నుంచి ఆకస్మికంగా పెరిగిన చలితీవ్రంగా రాత్రివేళ్లలో మాత్రం పంజా విసురుతోంది. గత పది రోజులుగా రాత్రి వేళ ఉష్ణోగ్రతలు పడిపోగా.. ఆ తరువాత గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదయ్యాయి. కాగా గత మూడురోజులుగా రాత్రి పూట ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోతున్నాయి. అంతేకాదు పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా కనిష్టంగా నమోదవుతున్నాయి. ఇటీవల 14 డిగ్రీల వరకు పెరిగిన ఉష్ణోగ్రతలు.. రెండు మూడు రోజులుగా తగ్గుతూ బుధవారం 11.4 డిగ్రీలకు పడిపోయాయి.  వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

అయితే తెలంగాణ రాష్ట్ర అభివృద్ది ప్రణాళిక సోసైటీ సహా పలు ప్రవైటు వాతావరణ సంస్థలు, బ్లాగులు ఇక తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతుందని పేర్కోన్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో దాదాపుగా 14 జిల్లాల్లో 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు టీఎస్‌డీపీఎస్‌ తెలిపింది. అయితే చల్లగాలులకు ఉపరితల ద్రోణి కారణంగా పేర్కోన్నారు. తూర్పు మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి విస్తరించిందని, దీని ప్రభావంతో చలి తవ్రత పెరుగుతోందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.  

రాష్ట్రంలో బుధవారం రాత్రి పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో పొడివాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో బుధవారం వడగండ్ల వర్షం కురిసింది. ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌, గాదిగూడ మండలాల్లో మధ్యాహ్నం, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌ మండలంలో సాయంత్రం వర్షం పడింది. నిజామాబాద్‌ జిల్లాలో రాత్రి 7 గంటల ప్రాంతంలో బోధన్‌, కోటగిరి, రుద్రూర్‌, చందూర్‌, మోస్రా, బోధన్‌, డిచ్‌పల్లి మండలాలతోపాటు నిజామాబాద్‌లోనూ వాన కురిసింది. పలు గ్రామాల్లో వడగండ్ల వాన పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles