Bundles of Torned currency notes on the road కలకలం రేపిన కరెన్సీ నోట్లు.. నిజామాబాద్ నడిరోడ్డుపై ఘటన..

Bundles of torned currency notes on the road in nizamabda of telangana

currency notes, Mondora Mandal, Bussapur, Hyderabad-Nagpur National Highway, Nizamabad, vehicles, Currency, Bank, local language, police

Corrosion of currency notes in the nizamabad district has caused a stir. A bag came out of a lorry on the Hyderabad-Nagpur National Highway at Bussapur in the Mondora Zone. The bag was torn apart by vehicles coming from behind on it and the rust of currency notes in it came out. Pieces of those currency notes were washed into the surrounding areas by the wind.

కలకలం రేపిన కరెన్సీ నోట్లు.. నిజామాబాద్ నడిరోడ్డుపై ఘటన..

Posted: 12/30/2021 12:13 PM IST
Bundles of torned currency notes on the road in nizamabda of telangana

నిజామాబాద్ జిల్లాలో కరెన్సీ నోట్ల కట్టలు కలకలం రేపాయి. నడిరోడ్డుపై పడివున్న చిరిగిన కరెన్సీనోట్ల మూటను చూసిన స్థానికులు షాక్ కు గురయ్యారు. హైదరాబాద్ నాగపూర్ జాతీయ రహదారిపై నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద రోడ్డుపై గుట్టలుగా పడి ఉన్న చిరిగిన నోట్లు గాలికి ఎగిరి స్థానికుల చెంతకు చేరడంతో వారు ఆశ్చర్యానికి గురై..ఎక్కడి నుంచి ఈ నో్ట్లు వస్తున్నాయని వెతకాగా.. నడిరోడ్డుపై గుట్టలుగా పడివున్నాయి. గుట్టలుగా పడివున్న ఈ చిరిగిన నోట్లను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

నోట్లు ముద్రణ తరువాత కట్ చేసిన.. వ్యర్థంగా గుర్తించిన పోలీసులు అవి అక్కడికి ఎలా వచ్చాయి? నోట్లు తుక్కుగా ఎలా మారాయి? అన్న విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నోట్ల కట్టలున్న సంచి లారీ పైనుంచి కిందపడి ఉంటుందని, దానిపై నుంచి వాహనాలు వెళ్లడంతో నోట్లన్నీ ఇలా చినిగిపోయి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. కాగా ఈ నోట్లను ముద్రించే టంకశాల నుంచి వచ్చిన వ్యర్థమా.? అని పోలీసులు విచారణ జరుపుతున్నారు.

అయితే, వీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? అవి అసలైనవా? లేక, నకిలీవా? ఒకవేళ అసలైనవే అయితే ఇలా ఎందుకు తుక్కుగా మార్చారు? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసు అధికారులు మాట్లాడుతూ.. రిజర్వు బ్యాంకు ఇలా చేసే అవకాశం లేదని, పాత నోట్లను అది రహస్య ప్రదేశంలో కాల్చివేస్తుందని పేర్కొన్నారు. కాబట్టి ఇది నల్లధనం కానీ, నకిలీ నోట్లు కానీ అయ్యే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. నోట్లున్న సంచి ఏ వాహనం నుంచి జారిపడిందో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles