With 5% GST, app-based auto rides may get costlier from Jan 1 వాయింపులతో న్యూఇయర్ కు కేంద్రం రెడీ.. ఆటో ఎక్కినా 5శాతం జీఎస్టీ..

Ola uber auto rides to get costlier from jan 1 2022 as govt imposes gst

Ola, Uber, Government, GST, India, News, Auto rides, uber, riders, new year, gst, digital india, app, Business news,

There are chances that autorickshaw rides booked through ride hailing apps like Ola and Uber will get costlier as the central government declared that it will levy a 5 per cent GST on auto rides booking online from January 1, 2021. However, autorickshaw rides taken from the streets will remain free from GST

వాయింపులతో న్యూఇయర్ కు కేంద్రం రెడీ.. ఆటో ఎక్కినా 5శాతం జీఎస్టీ..

Posted: 12/29/2021 09:54 PM IST
Ola uber auto rides to get costlier from jan 1 2022 as govt imposes gst

పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరల కారణంగా ఇబ్బంది పడుతున్న సామాన్య జనానికి ఇప్పుడు ఇంకో చేదువార్త. మరి కోన్ని గంటల్లో కొత్త ఏడాదిని ఆస్వాదిద్దామని.. వచ్చే ఏడాదైనా తమకు కలసి వస్తుందని సామాన్యులు భావిస్తున్న తరుణంలో.. న్యూఇయర్ వాయింపులకు కేంద్రం సిద్దమైంది. సాధారణంగా ఇలాంటి వాయింపులను ఫిబ్రవరిలో వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించి.. ఆ తరువాత నూతన అర్థిక సంవత్సరం నుంచి అమలు పర్చే విధానానికి కూడా స్వస్తి పలికిన కేంద్రం.. తాము అనుకున్నదే తడవుగా వాయింపులకు మాత్రం న్యూఇయర్ ను ఎంపిక చేసుకుంది.

అదేంటి అర్థరాత్రి అంకమ్మ శివాలు అన్నట్లు అందరూ కొత్త సంవత్సర వేడుకల్లో మునిగి తేలుతున్న ఈ క్రమంలో దేశవ్యాప్తంగా యాఫ్ ఆధారిత ఆటోలను ప్రయాణాలపై అదనపు చార్జీలు పడనున్నాయి. అటోవాలాలు తమకు డీజిల్ ధర పెరింగిందని ధరలు పెంచేందుకు అనుమతించాలని ధర్నాలు చేసే రోజులు పోయి.. ఏకంగా ప్రభుత్వమే తమకు జీఎస్టీ ఇవ్వాలని అటో ప్రయాణికులపై భారాన్ని మోపుతున్నాయి. దీంతో ఇకపై ఆటో ప్రయాణాలు కూడా మరింత ప్రియం కాబోతున్నాయి. అంటే కొత్త సంవత్సరం రాకతో ఆటో ప్రయాణానికి కూడా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

ఓలా, ఉబర్ వంటి రైడ్ షేరింగ్ యాప్‌లలో ఆటో బుక్ చేసుకుంటే కనుక ప్రభుత్వం 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తుంది. ర్యాపిడో నుంచి బైక్ బుక్ చేసుకున్నా ఇదే వర్తిస్తుంది. బుక్ చేసుకునే సమయంలోనే జీఎస్టీ 5 శాతం కలిపేసి ధరను నిర్ణయిస్తారు. అయితే, ఆన్‌లైన్‌లో కాకుండా బయట ఆటోను బుక్ చేసుకుంటే మాత్రం ఈ జీఎస్టీ వర్తించదు. కాబట్టి ఇది కొంత ఊరటనిచ్చే విషయమే. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 4 లక్షల మందిపై భారం పడనుంది. నగరంలో 38 వేల ఆటోలు ఓలా, ఉబర్ నుంచి బుకింగులు స్వీకరిస్తున్నాయి.

అలాగే, ఒక్కో ఆటో రోజుకు 20 నుంచి 25 ట్రిప్పులు వేస్తుంటాయి. ఇవన్నీ కలుపుకుంటే రోజూ 8 లక్షలకు పైగా రైడ్లు అవుతున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే ప్రయాణికులపై నిత్యం లక్షల రూపాయల భారం పడుతుంది. నిజానికి మధ్య తరగతి ప్రజలు కారు కంటే ఆటో ప్రయాణానికే ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. కారుతో పోలిస్తే ఆటో ధర తక్కువ కావడమే ఇందుకు కారణం. ఇప్పుడు ఆటో రైడ్‌పై జీఎస్టీ విధించడం వల్ల వీరందరిపైనా భారం పడనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కేంద్రం పునరాలోచించాలని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ కార్మికుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ola  Uber  Government  GST  India  News  Auto rides  uber  riders  new year  gst  digital india  app  Business news  

Other Articles