Minor Dalit girl beaten up in Amethi: Priyanka slams UP govt దళిత యువతిపై అమానుషం: నిందితుల అరెస్టుకు కాంగ్రెస్ డిమాండ్

Girl in amethi attacked priyanka gandhi says congress will launch stir if accused not arrested soon

dalit girl beaten, amethi, priyanka gandhi, congress, bjp, amethi girl beaten, Amethi criminal, minor girl beaten in amethi, amethi video viral, dalit girl video viral, amethi police, amethi crime, dalit girl attacked, protection of children from sexual offences act, Raipur, Amethi, CM Yogi Adityanath, Uttar Pradesh, up latest news, up police, Crime

Congress leader Priyanka Gandhi Vadra attacked the Yogi Adityanath government over the thrashing of a Dalit girl in Amethi, and said her party will launch an agitation if the accused in the case are not arrested soon. Her remarks come after a video purportedly showing a 16-year-old Dalit girl being beaten up and molested went viral on social media.

ITEMVIDEOS: దళిత యువతిపై అమానుషం: నిందితుల అరెస్టుకు కాంగ్రెస్ డిమాండ్

Posted: 12/29/2021 09:01 PM IST
Girl in amethi attacked priyanka gandhi says congress will launch stir if accused not arrested soon

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. దళిత వర్గానికి చెందిన ఓ బాలిక పట్ల ఓ కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులు అమానుషంగా వ్యవహరించారు. బాలికపై దొంగతనం అరోపణలు పెట్టి.. సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించారు. సినిమాల్లో పోలీసుల టార్చర్ పెట్టే విధానాన్ని వంటపట్టించుకున్న ఈ కుటుంబసభ్యులు.. అదే తరహాలో బాలిక అరికాళ్లపై లాఠీతో దారుణంగా కోట్టారు. అమెను జుట్టు పట్టుకుని లాగుతూ.. కాలు పట్టుకుని ఈడ్చుతూ.. అత్యంత పాశవికంగా హింసించారు. ఇందుకు సంబంధించి వీడియో వైరల్‌ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

అయితే ఈ వీడయోను తన అకౌంట్ ద్వారా పోస్టు చేసిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకా గాంధీ ఉత్తర్ ప్రదేశ్ లోని యోగి అధిత్యనాత్ సర్కారును తీవ్రంగా దుయ్యబట్టారు. ఉత్తర్ ప్రదేశ్ లో రోజుకు 34 ఘటనలు దళితులకు వ్యతిరేకంగానే జరుగుతున్నాయని.. ఇక మహిళలకు వ్యతిరేకంగా రోజుకు 135 ఘటనలు జరుగుతున్నాయని అయినా.. రాష్ట్రంలో మాత్రం శాంతిభద్రతలు అమోఘమని కితాబిచ్చుకుంటున్నారని అమె ధ్వజమెత్తారు. 24 గంటల వ్యవధిలో ఈ బాలికపై జరిగిన అమానుష ఘటలో నిందితులను అరెస్టు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధర్నాను చేపట్టి ప్రభుత్వ మెండినిద్రను మేలుకొల్పుతుందని హెచ్చరించారు.

ఈ వీడియోలో.. ఇద్దరు వ్యక్తులు ఆమె కాళ్లను కర్రతో పట్టుకోగా.. మరో వ్యక్తి ఆమెపై కర్రలతో విచక్షణ రహితంగా కొట్టారు. జుట్టు పట్టుకుని లాగడంతో పాటు కాలు పట్టుకుని ముందుకు ఈడ్చాడు. దెబ్బలకు తాళలేక బాలిక ఏడుస్తూ ఉంటే.. వారి కఠిన హృదయాలు మాత్రం కరగలేదు. ఇప్పటికైనా నిజం ఒప్పుకో అంటూ కొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు కూడా బాలికను తీవ్రంగా దూషించారు. నిజం చెప్పేవరకు తగలించు అంటూ బాలికను కొడుతున్న వ్యక్తికి వంతపాడారు. బాలికను కొడుతూ ఉంటే అక్కడ ఉన్నవారు వీడియో తీస్తూ పైశాచికంగా ప్రవర్తించారు. కాగా, ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో అమేథీ పోలీసులు నిందితులపై పోక్సో, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కింద కేసులను నమోదు చేశారు.

ఈ ఘటన ప్రస్తుతం యూపీలో తీవ్ర దుమారాన్ని రేపుతుంది. అమేథీ పోలీసు అధికారి అర్పిత్‌ కుమార్‌ మాట్లాడుతూ.. బాలికను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒకరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. పరారీలో వున్న మిగతా వారికోసం గాలిస్తున్నట్టు తెలిపారు. యోగి ప్రభుత్వం కేవలం అధికారం కోసం మాత్రమే చూస్తుందని.. ప్రజల భద్రతను పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఘటన ప్రస్తుతం యూపీలో కలకలం రేపుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh