Watch: Badrinath Temple, nearby areas witness heavy snowfall వీక్షించండీ: బధ్రీనాథ్ ఆలయ పరిసరాల్లో మంచువర్షం..

Snowfall increased in devbhoomi fresh snowfall in badrinath temple

mercury, badrinath temple, Badrinath Temple Snowfall, visu, badrinath temple heavy snowfall, Uttarkhand, viral video, devotional video, trending video

Badrinath Temple and the nearby areas got covered in a thick blanket of snow after heavy snowfall on December 29. Mercury levels also dropped in the area. Visuals showed tourists enjoying the fresh spell of snow in the region

బధ్రీనాథ్ ఆలయ పరిసరాల్లో మంచువర్షం.. వీక్షిస్తే చాలు తన్మయత్వం..

Posted: 12/29/2021 06:48 PM IST
Snowfall increased in devbhoomi fresh snowfall in badrinath temple

శీతాకాలం అంటేనే వెన్నులో చలిపుట్టేలా చలిపులి పంజా విసురుతుందన్న విషయం తెలిసిందే. దేశ‌మంతా తీవ్రమైన చ‌లి పెరిగిపోతోంది. ఇక గడచిన కొన్నేళ్లుగా తెలుగురాష్ట్రాలపై కూడా చలిపులి పంజా విసురుతొంది. క్రమంగా ఏడాదికేడాది ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉత్తరాది నుంచి వీచే చల్లని గాలుల ప్రభావంతో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. బయటకు రావాలంటేనే జంకే పరిస్థితులు అలుముకున్నాయి. రాత్రి నుంచి ఉదయం వరకు ఏకంగా రాష్ట్రాలలో అప్రకటిత కర్ప్యూ అలుముకున్నట్లు ఉంటోంది. ఇదంతా చలిపులి పంజా ప్రభావమే.

డెక్కన్ ఫ్లాటూగా వున్న దక్షణభారతంలోని మన తెలుగు రాష్ట్రాల పరిస్థితే ఇలావుంటే.. వేసవి వేడిలోనూ శీతలం ప్రదేశంగా బాసిల్లుతున్న ఉత్త‌రాది రాష్ట్రాల పరిస్థితి ఎలా వుంటుంది. ఇక అందులోనూ హిమాల‌యాల స‌మీప రాష్ట్రాల్లో అయితే ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు అత్యంత దారుణంగా ప‌డిపోయాయి. పైగా ఆయా రాష్ట్రాల్లో తీవ్రంగా మంచు కురుస్తున్న‌ది. ఇవాళ ఉత్త‌రాఖండ్ లోని చార్‌ధామ్‌లో ఒక‌టైన బ‌ద్రీనాథ్ ఆల‌యం మంచు వ‌ర్షంలో త‌డిసి ముద్దయ్యింది. బ‌ద్రినాథ్ ఆల‌యంపైన, దాని ప‌రిస‌రాల్లో విప‌రీతంగా మంచుకురిసింది.

దాంతో ఆల‌య ప‌రిస‌రాలు, దాని చుట్టుప‌క్క‌ల ప్రాంతాలు తెల్ల‌ని వ‌స్త్రం ప‌రిచిన‌ట్లుగా మారిపోయాయి. ఈ దృశ్యాలు చూప‌రుల‌కు క‌నువిందు చేస్తున్నాయి. ఈ వీడియోలో బంధించబడిన దృశ్యాలను చూస్తే ఏకంగా మనస్సు తన్మయత్వం పోందేలా వున్నాయి. ఆలయం మూసివున్నా.. ఆ పర్వతశ్రేణులను చూస్తే చాలు ఆ పరమాత్ముడు కనుల ముందే కదలాడుతున్నట్లుగా వుంది. శీతాకాలం కార‌ణంగా ఆల‌యాన్ని మూసివేయ‌డంతో ఈ సుంద‌ర దృశ్యాల‌ను ప్ర‌త్య‌క్షంగా చూసే అవ‌కాశం భ‌క్తుల‌కు ద‌క్క‌లేదు. కనుల‌కు ఇంపైన ఈ దృశ్యాల‌ను కింది వీడియోలో మీరు కూడా ఒక‌సారి వీక్షించండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles