Man who touched woman’s feet without consent is guilty: Bombay HC అనుమతి లేకుండా మహిళల కాళ్లను తాకినా తప్పే: బాంబే హైకోర్టు

Touching woman s body without consent amounts to violation of modesty bombay hc

bombay high court, Aurangabad bench, touching woman's body, without consent, stranger, violation of modesty, Justice MG Sewlikar, sexual harassment, jail sentence, sexual abuse, woman, Maharashtra, Crime

The Aurangabad bench of the Bombay High Court has ruled that touching any part of a woman's body without her consent by a stranger amounts to violation of modesty of a woman. The order by the bench of Justice MG Sewlikar came on an appeal filed by a man against a trial court order which had awarded a one-year jail sentence to him in connection with a case of inappropriately touching a woman while she was asleep.

అనుమతి లేకుండా మహిళల కాళ్లను తాకినా తప్పే: బాంబే హైకోర్టు

Posted: 12/29/2021 04:33 PM IST
Touching woman s body without consent amounts to violation of modesty bombay hc

అపరిచిత వ్యక్తులు మహిళలను తాకడం నేరమేనని బాంబే హైకోర్టు పేర్కోంది. అనుమతి లేకుండా మహిళ పాదాలు సహా శరీరంలోని ఏ భాగాన్ని అపరిచితులు తాకినా అది నేరంగానే పరిగణించబడుతుందని బాంబే హైకోర్టుకు చెందిన ఔరంగాబాద్ బెంచ్ స్పష్టం చేసింది. ఓ కేసును విచారిస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని జల్నా జిల్లాకు చెందిన ఓ మహిళ.. తన పొరిగింటి వ్యక్తి ఒకరు రాత్రి 11 గంటల వేళ తన ఇంటికి వచ్చి తన పాదాలు తాకాడని ఆరోపిస్తూ 5 జులై 2014న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును విచారించిన స్థానిక కోర్టు నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో అతను హైకోర్టును ఆశ్రయించాడు.

విచారణ సందర్భంగా నిందితుడి తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. తన క్లయింట్ ఆమె ఇంటికి వెళ్లి పాదాలను తాకడం నిజమేనని.. అయితే, అందులో లైంగిక ఉద్దేశం లేదని కోర్టుకు తెలిపారు. ఈ వాదనను కోర్టు తీవ్రంగా వ్యతిరేకించింది. మహిళ అంగీకారం లేకుండా ఆమె నిద్రపోతున్న మంచం మీద కూర్చుని పాదాలను తాకడం ఆమె గౌరవానికి భంగం కలిగించడమే అవుతుందని తేల్చి చెప్పింది. అర్ధరాత్రి పరిచయం లేని వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడితే దానిని ఆమె గౌరవానికి భంగం కలిగించినట్టుగానే భావించాలని జస్టిస్ సెవ్లీకర్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles