Insurer can’t deny claim citing existing illness: SC ఆరోగ్యభీమా సంస్థలకు సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు

Insurer can t refuse claim citing existing illness supreme court on mediclaim policy

Supreme Court, Mediclaim Policy, Insurance Claim, Pre-existing diseases, National Consumer Disputes Redressal Commission (NCDRC), Justice DY Chandrachud, Justice BV Nagarathna, United India Insurance, Manmohan Nanda, Health Insurance policy

An insurer cannot repudiate (refuse) a claim by citing an existing medical condition that was disclosed by the insured in the proposal form, once the policy has been issued, the Supreme Court has said. A bench of justices DY Chandrachud and BV Nagarathna also said a proposer is under a duty to disclose to the insurer all material facts within his knowledge.

పీఈడీల పేరుతో క్లెయిమ్ తిరస్కరించరాదు: మెడిక్లెయిమ్ పాలసీలపై ‘సుప్రీం’

Posted: 12/29/2021 03:35 PM IST
Insurer can t refuse claim citing existing illness supreme court on mediclaim policy

ఆరోగ్యభీమా పాలసీదారులకు దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అదే సమయంలో హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలకు చెంపపెట్టులాంటి తీర్పును అత్యున్నత న్యాయస్థానం వెలువరించింది. తమ సంస్థ తీసుకువచ్చిన పాలసీలను తీసుకోవాలని హెల్త్ ఇన్సూరెన్స్ సేల్స్ టీం సభ్యులు కస్టమర్ల వెంటపడి.. వారి నుంచి ఆఘమేఘాల మీద సమాచారం అందుకుని వాటిని భర్తీ చేసి.. తమ పని పూర్తైయ్యింది. టార్గెట్ రీచ్ అయ్యాం అన్నట్లుగా చేస్తారు. ఈ క్రమంలో పాలసీదారు తనకు గుర్తుకు వున్న సమాచారం మాత్రమే అందించగలడు. ఇక ఏదేని ఆరోగ్య సమస్యతో అసుపత్రులకు వెళ్లినప్పుడు మాత్రం వైద్యులు ఈ సమస్య ఎప్పట్నించి వుందని.. ఇంతకుముందు ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యారా.? అని అడిగినప్పుడు మాత్రం బాగా ఆలోచించి.. చెబుతుంటారు.

అయితే ఇలా చెప్పగానే వైద్యుడు పాత రోగమే మళ్లీ తిరగబెట్టింది అని రాయడంతో కథ ప్రారంభం అవుతుంది. వైద్యం చేసిన తరువాత ఈ అనారోగ్యానికి తాము బిల్లు చెల్లించమని అంటాయి హెల్త్ ఇన్సేరెన్స్ సంస్థలు. ఎందుకు అంటే.. మీరు ముందు నుంచి వున్న వ్యాధిని నయం చేయించుకున్నారని.. ఆ విషయాన్ని మీ పాలసీలో చెప్పలేదని కూడా కోట్ చేసి మరీ పేమెంట్ తిరస్కరిస్తారు. ఇక హెల్త్ పాలసీ వున్నా జేబులోంచి డబ్బు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడటంతో బాధపడుతూనే కడుతుంటారు చాలామంది కస్టమర్లు. అయితే వీరిందరిలో మన్ మోహన్ నందా మాత్రం వేరు. ఆయన తనకు ఎందుకు చెల్లింపులు చేయలేదని సుప్రీంకోర్టు ఇద్దరు సభ్యుల ధర్మాసనాన్ని ఆశ్రయించి పోరాడి విజయం సాధించాడు.

తనలాంటి పరిస్థితిని ఎదుర్కోనే కస్టమర్లకు ఆ పరిస్థితి రాకుండా చేశారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునిచ్చింది. ఒక్కసారి పాలసీ జారీ చేసిన తర్వాత.. ముందు నుంచి ఉన్న ఆరోగ్య సమస్యలకు క్లెయిమ్ తిరస్కరించడానికి లేదని తేల్చి చెప్పింది. జస్టిస్ డీవై చంద్రచూద్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ కేసు విచారణకు వచ్చింది. ప్రపోజర్ కు పాలసీ ఇవ్వాలా.? లేదా.? అన్నది ముందు ఆలోచించుకోవాల్సిన అరోగ్య భీమా సంస్థలు.. ఒక్కసారి పాలసీ జారీ చేసిన తరువాత మాత్రం క్లెయిమ్ లను తిరస్కరించదాదని సర్వోన్నత న్యాయస్థానం కీలక అదేశాలు జారీ చేసింది.

పాలసీదారు బీమాకు సంబంధించి అన్ని వాస్తవాలను తెలుసుకోవాల్సిన బాధ్యత భీమా సంస్థది. తనకు తెలిసిన అన్ని సమస్యల గురించి బీమా సంస్థకు తెలియజేయాల్సిన బాధ్యత పాలసీదారుది. అయితే పాలసీదారు తనకు తెలిసిన వాటినే వెల్లడించగలడు. అయితే సమస్యతో వైద్యుడి వద్దకు వెళితే మాత్రం అతనికి ఇలాంటి పరిస్థితి ఇంతకుముందు కూడా వచ్చింది అని గుర్తుకు వస్తుంది. దీనిని ఆధారంగా చేసుకుని ఆరోగ్య భీమా సంస్థలు చెల్లింపులను చేయమంటే కుదరదు. ఒక్కసారి పాలసీ జారీ చేయడం పూర్తయితే.. బీమా సంస్థ ముందు నుంచి ఉన్న సమస్య అంటూ క్లెయిమ్ ను తిరస్కరించరాదు’’ అని ధర్మాసనం పేర్కొంది. మన్మోహన్ నందాకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు వెలువరించింది.

 అమెరికా వెళుతూ ఆయన ఓవర్సీస్ మెడిక్లెయిమ్ పాలసీ తీసుకున్నాడు. శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయం చేరుకున్న తర్వాత హార్ట్ ఎటాక్ రావడంతో ఆస్పత్రికి తరలించారు. గుండె రక్తనాళాలు పూడుకుపోయినట్టు గుర్తించి స్టెంట్లు వేశారు. నందా క్లెయిమ్ కోసం అప్లె చేయగా సంస్థ తిరస్కరించింది. అతడికి హైపర్ లిపిడేమియా, మధుమేహం సమస్యలు ఉన్నాయని, స్టాటిన్ మాత్రలు వాడుతున్నాడని.. వీటి గురించి పాలసీలోని ముందునుంచి వున్న వ్యాధులు జాబితాలో పేర్కెనలేదని బీమా సంస్థ క్లెయిమ్ ను తిరస్కరించింది. వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ లోనూ పాలసీదారుకు వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది. దీంతో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించి విజయం సాధించాడు. ఉన్నట్టుండి అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చేరాల్సి వస్తే రక్షణ కోసమే పాలసీ తీసుకుంటారన్న సూక్ష్మ అంశాన్ని కోర్టు గుర్తు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles