Omicron Risk Remains "Very High": WHO chief ఒక్క వేడుక కన్నా ప్రాణం మిన్న: ప్రపంచ అరోగ్య సంస్థ

Overall risk from omicron covid variant remains very high says who

Omicron WHO, Omicron risk, Variants of SARS-CoV-2, COVID-19 pandemic in Botswana, COVID-19 pandemic in South Africa, SARS-CoV-2 Omicron variant, Occupational safety and health, Variant of concern, Infectious diseases, Medical specialties, Health, Omicron, COVID-19, COVID-19, concern, new variant, Omicron Variant, spreading vigourously, delta variant, corona vaccine, omicron, WHO, Omicron, WHO report on Omicron, WHO latest report on Omicron, Covid, Covid Omicron, WHO latest report, omicron latest news, omicron updates

The overall risk related to the new variant of concern Omicron remains "very high", the World Health Organization (WHO) said as the world continues to witness the surge in global COVID-19 cases. The weekly epidemiological update by WHO revealed the week of December 20-26 saw the global number of new COVID-19 cases increase by 11 per cent as compared to the previous week.

ఒమిక్రాన్ వేరియంట్ తేలిగ్గా తీసుకోవద్దు: ప్రపంచ ఆరోగ్య సంస్థ

Posted: 12/29/2021 01:39 PM IST
Overall risk from omicron covid variant remains very high says who

ఒమిక్రాన్‌ వేరియంట్ వ్యాప్తిపై ఇంకా అనిశ్చితి వీడటం లేదు. ఓ వైపు ఈ కరోనా వేరియంట్ మహమ్మారి శరవేగంగా ప్రపంచాన్ని తన కబంధహస్తాలలో చుట్టేస్తుంటే.. మరోవైపు తీవ్రత మాత్రం అంతగా లేదని ఇప్పటివరకు అందిన సమాచారం. కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఒమిక్రాన్‌ వేరియంట్‌ విషయంలో ప్రపంచ దేశాలన్నీ అత్యంత అప్రమత్తతో వ్యవహరించాలని సూచించింది. ఇది ఇప్పటికీ అత్యంత ప్రమాదకరమైన వేరియంట్ గానే తాము భావిస్తున్నామని.. దీని ప్రభావంతో అనేకమంది ఒక్కసారిగా ఆసుపత్రుల పాలయ్యే అవకాశాలు వున్నాయని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఇది ప్రపంచవ్యాప్తంగా నమోదు చేస్తున్న రికార్డు స్థాయి గణంకాలే ఇందుకు నిదర్శనమని చెప్పింది.

దాదాపుగా అన్ని దేశాల్లో కరోనా మహమ్మారి ఇక ముగిసిన ఉదంతమే అనుకుంటున్న తరుణంలో వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్.. చాలా దేశాల్లో మళ్లీ కేసులు గణనీయంగా పెరగడానికి కారణమని పేర్కొంది. నవంబర్ 24న వెలుగుచూసిన ఈ వేరియంట్.. అత్యంత వేగంగా కేసులను పెంచుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 11 శాతం పెరగడానికి ఒమిక్రాన్ వేరియంట్ కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జారీ చేసింది. వరుసగా వెల్లడవుతున్న ఆధారాలను చూస్తుంటే డెల్టా కంటే అధికంగా వృద్ధి చెందే అనుకూలత ఒమిక్రాన్ వేరియంట్ కు ఉన్నట్టు తెలుస్తోందని డబ్యూహెచ్ఓ తెలిపింది.

బ్రిటన్, అమెరికా సహా చాలా దేశాల్లో కేసులు శరవేగంగా పెరగడానికి ఈ వేరియంట్ కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తం చేసింది. అయితే ఈ వేరియంట్ తొలిసారిగా నవంబర్ 24న దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ మాత్రం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు డబ్యూహెచ్ఓ అధికారులు వెల్లడించారు. ఇక్కడ కేసులు 29 శాతం మేర తగ్గాయని పేర్కొంది. కార్టికో స్టెరాయిడ్స్, ఇంటర్ లూకిన్ 6 రిసెప్టర్ బ్లాకర్లు కరోనా రోగుల చికిత్సలో ప్రభావవంతంగా పని చేయగలవని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ ను న్యూట్రలైజ్ చేయడంలో మోనోక్లోనల్ యాంటీ బాడీల ప్రభావం తక్కువగా ఉంటున్నట్టు తెలియజేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles