As Yellow Alert Sounded in Delhi Over Covid Surge ఢిల్లీలో ఎల్లో అలర్ట్: ఒమిక్రాన్ వ్యాప్తి నియంత్రణకు కఠిన ఆంక్షలు

Yellow alert issued in delhi schools to shut public transport to run at 50 seating capacity

Coronavirus, delhi, colour coded plan, colour coded graded plan, arvind kejriwal, covid-19, coronavirus, coronavirus pandemic, ddma, delhi govt colour coded system, covid 19, delhi covid restrictions, covid colour code system delhi explained, delhi colour code explained, delhi lockdown, delhi lockdown, indian express, National, Covid In Delhi, Coronavirus in delhi, Arvind Kejriwal, Covid-19 Delhi News, Delhi Covid-19, Delhi Coronavirus Cases,Yellow Alert, Arvind Kejriwal News, Delhi Covid-19 Updates, Delhi covid news

The yellow alert is issued when the city sees a positivity rate of over 0.5% for two consecutive days, cases cross 1,500 in a week, or average occupancy of oxygen beds in hospitals remains 500 for a week. Restaurants will operate at 50 per cent capacity between 8 am - 10 pm, bars will open between 12-10 pm also at 50 per cent capacity.

ఢిల్లీలో ఎల్లో అలర్ట్: ఒమిక్రాన్ వ్యాప్తి నియంత్రణకు కఠిన ఆంక్షలు

Posted: 12/28/2021 08:34 PM IST
Yellow alert issued in delhi schools to shut public transport to run at 50 seating capacity

కొత్త రూపం దాల్చుకుని వచ్చిన కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ మన దేశ రాజధాని ఢిల్లీలోనూ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 331 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీ వ్యాప్తంగా ఎల్లో అలెర్ట్ అమలు చేస్తోంది. కఠిన ఆంక్షలు విధిస్తూ.. కరోనా తొలి దశ అన్ లాక్ సమయంలో తొలినాళ్లతో తీసుకున్న సరి-బేసి సంఖ్య అధారంగా వ్యాపారాలను కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ మీడియా సమావేశంలో ఢిల్లీలో కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు.

ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, పాజిటివిటీ రేటు 0.5శాతం కంటే ఎక్కువగా వుంటోందని అందువల్ల ఎల్లో అలర్ట్ ప్రకటించామని అన్నారు. కోవిడ్ నిబంధనలు ప్రజలు తప్పనిసరిగా అమలు చేయాలని కోరారు. మాస్క్ ధరించడం.. బౌతికదూరం పాటించడం.. తప్పనిసరని సూచించారు. కాగా, కేసులు పెరుగుతున్నా.. బాధితులు వ్యాది తీవ్రత మాత్రం స్వల్పంగానే ఉందని ఆయన అన్నారు. ఆక్సిజన్‌ వినియోగం, వెంటిలేటర్ల అవసరం కూడా పెరగలేదన్నారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు మునుపటి అనుభవాల రిత్యా పది రెట్లు ఎక్కువగానే తాము సిద్దంగా వున్నామని తెలిపారు. గడిచిన 24 గంటల్లో 331 కొత్త కేసులు నమోదుకావడంతో.. జూన్‌ 9 తర్వాత ఇదే గరిష్టమని తెలిపారు.

ఎల్లో అలర్ట్‌తో ఢిల్లీలో ఆంక్షలు అమలు

* సినిమా హాళ్లు, మల్టిప్లెక్స్‌లు, ఆడిటోరియంలను పూర్తిగా మూసివేస్తారు.
* జిమ్‌లు, స్పా సెంటర్లు, యోగా ఇనిస్టిట్యూట్‌లు మూతబడుతాయి.
* స్కూళ్లు, విద్యా సంస్థలు, కోచింగ్‌ ఇనిస్టిట్యూట్‌లు తెరవడానికి అనుమతి లేదు.
* సామాజిక, రాజకీయ, మతపరమైన సామూహిక కార్యక్రమాలు, సభలు, సమావేశాలపై నిషేధం ఉంటుంది.
* హోటళ్లు తెరుచుకోవచ్చు. అయితే బాంకెట్‌ హాల్స్‌, కాన్ఫరెన్స్‌ హాళ్లను తెరిచేందుకు వీల్లేదు.
* రెస్టారంట్లను 50శాతం సామర్థ్యంతో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు తెరుచుకోవచ్చు. బార్లు 50శాతం సామర్థ్యంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే తెరవాలి.
* దిల్లీ మెట్రో 50శాతం సామర్థ్యంతో నడుస్తుంది. మెట్రోలో నిల్చుని ప్రయాణం చేసేందుకు అనుమతి లేదు.
* ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగించే బస్సులను కూడా 50శాతం సామర్థ్యంతో నడపాలి.
* ఆటోలు, టాక్సీలు, ఈ-రిక్షాల్లో ఇద్దరు ప్రయాణికులకు మాత్రమే అనుమతి.
* క్రీడా ప్రాంగణాలు, స్టేడియంలు, స్విమ్మింగ్‌ పూల్స్‌ను మూసివేయాలి.
* ప్రైవేటు కార్యాలయాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 50శాతం సామర్థ్యంతో నిర్వహించేందుకు అనుమతి ఉంటుంది.
* పబ్లిక్‌ పార్కులు తెరిచే ఉంటాయి.
* అవుట్‌డోర్‌ యోగాకు అనుమతి ఉంది. సెలూన్లు, బ్యూటీ పార్లర్లు తెరుచుకోవచ్చు.  
* సరి-బేసి పద్ధతిలో మాల్స్‌, దుకాణాలు తెరవాలి.
* రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ
* పెళ్లిళ్లు, ఇతర వేడుకల్లో 20 మంది మాత్రమే అనుమతి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles