SpiceJet winter sale with fares starting at Rs 1,122 రూ.1122లకే విమానయానం.. ప్రయాణికులకు స్పైస్ జెట్ బంపర్

Spicejet launches winter sale with fares starting at rs 1 122

Wow Winter Sale, spicejet Wow Winter Sale, spicejet, spicejet sale, spicejet winter sale, spicejet fare, spicejet flight booking, Aviation

Private carrier SpiceJet has announced winter goodies with an all-inclusive one-way fare starting at Rs 1,122 for travel during December 27 to 31. “The ‘Wow Winter Sale’ offers one-way fares starting for as low as Rs 1,122 (all inclusive) on destinations such as Chennai–Bengaluru, Bengaluru–Chennai, Chennai–Hyderabad, Jammu–Srinagar, among others on its domestic network,” SpiceJet said in a statement.

రూ.1122లకే విమానయానం.. ప్రయాణికులకు స్పైస్ జెట్ బంపర్

Posted: 12/28/2021 01:40 PM IST
Spicejet launches winter sale with fares starting at rs 1 122

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ తాజాగా ప్రయాణికులకు మంచి అదిరిపోయే ఆఫర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్పైస్ జెట్ "వావ్ వింటర్ సేల్" పేరుతో ఒక ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద డిసెంబర్ 27 నుంచి 31 మధ్య కాలంలో రూ.1,122 ప్రారంభ ధరతో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ నడుస్తున్న క్రమంలో టికెట్లు బుక్ చేసుకన్నవారికి మరో రెండు ఆఫర్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉచిత ఫ్లయిట్ ఓచర్ తో పాటుగా ఆడ్ అన్ ఆపర్ ను కూడా స్పైస్ జెట్ సంస్థ తమ కస్టమర్లకు అందించనుంది.

‘వావ్ వింటర్ సేల్' ఆఫర్‌ కింద టికెట్లు బుక్ చేసుకున్న కస్టమర్లకు అన్ని ధరలు కలుపుకుని కేవలం రూ. 1122కే గమ్యస్థానాలకు చేరుస్తోంది. అయితే ఇందుకుగాను కేవలం నాలుగు మార్గాలను మాత్రమే ఎంపిక చేసిన సంస్థ.. వీటిలో ప్రయాణించే కస్టమర్లకు మాత్రమే ఈ అవకాశాన్ని అందించనుంది. ఆ నాలుగు మార్గాలు చెన్నై-బెంగళూరు, బెంగళూరు-చెన్నై, చెన్నై-హైదరాబాద్, జమ్మూ- శ్రీనగర్ మధ్య ప్రయాణం చేసే ప్రయాణికులకు మాత్రమే రూ.1,122 ధరకు వన్ వే ఛార్జీలను అందిస్తున్నట్లు స్పైస్ జెట్ తన పోర్టల్ ప్రకటనలో తెలిపింది.

ఈ ఆఫర్ కింద విమాన టికెట్లను బుక్ చేసే ప్రయాణీకులు తమ ప్రయాణ ప్రణాళికలో ఏమైనా మార్పు వస్తే ప్రయాణ తేదీకి 2 రోజుల ముందు వరకు వారి విమాన తేదీని కూడా మార్చుకోవచ్చు. అలాగే, టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు జనవరి 15 - ఏప్రిల్ 15 మధ్య కాలంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ టికెట్లను స్పైస్ జెట్ వెబ్ సైట్, ఆన్ లైన్ ట్రావెల్ పోర్టల్స్, స్పైస్ జెట్ మొబైల్ యాప్, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇక ఉచిత ఫైయిట్ ఓచర్ కింద కస్టమర్ల తదుపరి విమాన ప్రయాణంలో తమ విమాన బేస్ ధరలో రూ.500 తగ్గింపును అందజేయనుంది. ఈ వోచర్ తో ఫిబ్రవరి 1 నుచి 30 సెప్టెంబర్ వరకు ప్రయాణం చేసుకోవచ్చు. ఇక దీంతో పాటు అడ్ ఆన్ కింద కూడా అందిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles