Six Maoists killed in Chhattisgarh చత్తీస్ గడ్ ఎన్ కౌంట‌ర్: మిలిషియా ఏరియా కమాండర్ హతం

4 women naxals among 6 maos killed in encounter in chhattisgarh s bijapur

Maoists, Encounter, Maoist Party, Maoists, CRPF, Kurnapalli, pesalapadu forest area, Telangana Grey Hounds, Six Maoist killed Bijapur, four women naxals, naxals killed, encounter with naxals, police personnel, crude bomb explosion, Dantewada district, Chhattisgarh, Crime

Four women naxals including Six Maoists were killed in an encounter with Telangana grey Hound Security forces near Kurnaplly-pesalapadu forest area in the Bijapur district of Chhattisgarh on Monday. Among the two others were the Cherla Area Militia Commandar Madhu also been killed, said Police forces.

చత్తీస్ గడ్ ఎన్ కౌంట‌ర్: నలుగురు మహిళా సహా ఆరుగురు మావోయిస్టులు మృతి

Posted: 12/27/2021 12:35 PM IST
4 women naxals among 6 maos killed in encounter in chhattisgarh s bijapur

మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల జార్ఖంగ్ రాష్ట్రంలోని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు టెక్ రవి మరణించగా, మహారాష్ట్రలో ఎన్ కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డగా, ఇటు ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టు గ్రూపుకు చెందిన మిలీషియా టాప్ కమాండర్ కూడా ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఆతరువాత జరిగిన చత్తిస్ గడ్ లోని దంతెవాడ జిల్లా గోండేరాస్ అటీవీ ప్రాంతంలో జరిగినఎన్ కౌంటర్లో ఇద్దరు మహిళా మావోయిస్టు సభ్యులు మరణించారు. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులు ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతిచెందారు.

ఇక తాజాగా మరోమారు చత్తీస్ గడ్ లో కాల్పులు మోత దద్దరిల్లింది. రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మరోమారు పోలీసులకు-మావోయిస్టులకు మధ్య ఎన్ కౌంటర్ జరగింది. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. తెలంగాణ-చత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సరిహద్దు ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో ఎప్పుడు ఎక్కడ తుపాకుల తూటాల శబ్దం వినబడుతుందోనని అని అదివాసులు నిత్యం భయాందోళన చెందుతూనే వుంటారు. ఇక చత్తీస్ గడ్- తెలంగాణ సరిహద్దులో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు  మరణించారు.

బీజాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న వార్త తెలుసుకున్న తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. చర్లకు మండలానికి 25 కిలోమీటర్ల దూరంలోని కుర్ణపల్లి, పెసలపాడు అటవీ ప్రాంతంలో సంచరిస్తుండగా, పోలీసులను గమినించిన మావోలు వారిపై దాడులు జరిగి తప్పించుకునే యత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ప్రతికాల్పులకు పాల్పడ్డారు. దీంతో ఇవాళ ఉదయం ఆరు గంటల నుంచి 7.40 నిమిషాల వరకు ఇదరు వర్గాల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. అనంతరం ఆరుము మావోయిస్టులు మరణించారు. వీరిలో నలుగురు మహిళా మవోయిస్టులు వున్నారు. ఎదురుకాల్పుల్లో చర్ల ఏరియా మిలీషియా కమాండ్ మధు మృతిచెందినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles