Dad Shave Her Head After She Bullies A Girl With Cancer 16 ఏళ్ల కూతురికి గుండుకొట్టిన తండ్రి.. నెటిజనుల మద్దతు

Dad makes 16 year old daughter shave her head after she bullies a girl with cancer

Dad, Daughter, Divorced Wife, Cancer Patient, colleague student, Bulling cancer patient, pulling wig, punishment, tonsuring head, shave head, Crime

One father took to Reddit to explain the rationale behind forcing his daughter to go bald as a form of punishment, sending Reddit in an absolute uproar. The man claims that he has a 16-year-old daughter, who was in trouble “for making fun of a student that lost her hair from cancer treatment,” the father said, “Including pulling off her wig.”

16 ఏళ్ల కూతురికి గుండుకొట్టిన తండ్రి.. నెటిజనుల మద్దతు

Posted: 12/23/2021 03:52 PM IST
Dad makes 16 year old daughter shave her head after she bullies a girl with cancer

పిల్లల పట్ల వారు తెలిసీ తెలియక చేసే తప్పుల పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించి.. హింసించే తల్లిదండ్రుల తీరును అంతర్జాలంలో చూస్తూనేవుంటాం. వీరిపై నెటిజన్ల సంధించే విమర్శనాస్త్రాలను కూడా వారు ఎదర్కోన్న పరిస్థితులను చూశాం. అయితే తమ పిల్లలకు ఎలా బుద్ది చెప్పాలో.. ఎలా సక్రమైన మార్గంలో నడిపించాలో తమకు తెలుసునంటూ కొందరు తల్లిదండ్రులు కూడా నెట్ జనులకు అంతే ఘాటుగా సమాధానం ఇస్తారు. తమ పిల్లల మంచి చెడులు చూసుకుంటున్న తాము.. వారిని సన్మార్గంలో ఎలా నడిపించాలి.. వారిని నలుగురిలో ఎలా ఉన్నత స్థానంలో నిలబెట్టాలన్న అలోచనలు ఒక్క వీడియోలో బహిర్గతం కావని కూడా రిప్లై ఇస్తుంటారు.

వారి విషయం ఎలావున్నా.. ఇక్కడ ఒక తండ్రి తన కూతురికి గుండు కొట్టించడంపై నెటిజనులు మాత్రం సమర్థిస్తున్నారు. యుక్తవయస్సుకు వచ్చిన కూతురు చేసిన పనిని తెలుసుకున్న తండ్రి అమె తలపై శిరోజాలు లేకుండా గుండు చేశాడు. ఏకంగా పదహారేళ్ల కూతురికి గుండు చేయడంపై విమర్శలు ఎదుర్కోవాల్సిన తండ్రికి నెటిజనులు అండగా నిలుస్తూ.. ఆయన చర్యను సమర్థిస్తున్నారు. అయితే అందుకు ఓ ఉన్నతమైన కారణమే ఉండటం గమనార్హం. తన కూతురు తలపై జట్టును మొత్తం ట్రిమ్మర్ తో క్లీన్ సేవ్ చేశాడు. తన మాజీ భార్య కూతురు చేసిన పనికి.. వేరే మార్గం లేక.. అమె సమ్మతతోనే ఇలాంటి పనిచేశానని ఆ తండ్రి చెప్పుకోచ్చాడు.

అయితే ఇతా తాను తన బిడ్డకు బుద్ధి చెప్పాల్సి వచ్చిందంటూ బాధను వ్యక్తం చేశాడు. తన భార్య నుంచి విడిపోయినప్పటికీ పిల్లల బాధ్యత విషయంలో వారిద్దరి భాగస్వామ్యం ఉంటుంది. మాజీ భార్య కూతురికి గార్డియన్ గా ఉన్న ఆయన.. పిల్లలపై బాధ్యతను తీసుకున్నాడు. వారు సత్ప్రవర్తన కలిగి.. అందరితో కలసి మెలిసి వుండేలా బుద్ధులు చెప్పాడు. అయితే నిత్యం పిల్లలను బుజ్జగించడంతో పాటు వారు తప్పులు చేస్తే వారిని సక్రమమైన దారిలో నడిపించేందుకు అప్పడప్పుడూ మందలించడం, వారితో మాట్లాడకపోవడం వంటి చర్యలు చేస్తూనే వుంటారు. లేదంటే పిల్లలు తల్లిదండ్రుల గారాభంతో మెండివాళ్లుగా తయారై.. వక్రమార్గం పట్టే ప్రమాదం కూడా లేకపోలేదు. ఈ తండ్రి కూడా తన కుమార్తె విషయంలో అలానే బుద్ధిచెప్పాడు.

తనతో పాటు పాఠశాలలో చదువుకునే తోటి విద్యార్థిని క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. దాంతో ఆమె తలపై జుట్టుంతా రాలిపోయింది. అయితే అమె బాధను అర్థం చేసుకోని ఈ తండ్రి కూతురు.. తన తోటి విద్యార్థిని గేలి చేయడంతో పాటు అమెను నానా విధాలుగా పదేపదే వేధింపులకు గురిచేసేది. పాఠశాలలో ఉపాధ్యాయులు మందలించినా అమె చర్యలను అపుకోలేదు. తనపైనే పిర్యాదు చేస్తావా అంటూ ఓ రోజు క్యాన్సర్ బాధిత విద్యార్థి పెట్టుకున్న విగ్ ను కూడా లాగిపారేసి.. పాఠశాలలోని అందరి విద్యార్థులలో అమె పరుపును తీసేసింది. దీంతో పాఠశాల యాజమాన్యం అమె తండ్రిని పాఠశాలకు పిలిపించి విషయాన్ని కాసింత ఆగ్రహంగానే చెప్పింది. విద్యార్థిని ప్రపర్తనను మార్చుకోని పక్షంలో అమెపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

దీంతో ఆ తండ్రి తన కూతురిని ఏమీ అనలేదు.. అయతే అమె బుద్దమాత్రం చెప్పాలనుకున్నాడు. ఏ జుట్టు లేదని అవహేన చేసిందో అలానే తనకు కూడా జుట్టంతా కట్ చేశాడు. దాంతో తనకు ఇలా గుండు గీసి శిక్షించాలనుకున్నాడు. తన కూతరి ఎదుట రెండు ఆషన్లు ఉంచాడు. ఏదో ఒకటి నిర్ణయించుకోవాలని అమెకు చెప్పాడు. అందులో ఒకటి తన సెల్ ఫోన్లు, అన్నింటిని వదులుకోవాలన్నాడు. తిరిగి ఇచ్చేది లేదన్నాడు. రెండో ఆప్షన్ గుండు చేయించుకోవాలన్నాడు. దీనికి కూతురు అంగీకరించింది. అలా తన కూతురికి బుద్ధి చెప్పాడా తండ్రి. పిల్లల పట్ల ప్రేమనే కాదు.. అవసరమైతే వారిని సక్రమైన దారిలో పెట్టేందుకు కొన్నిసార్లు కఠినంగా కూడా ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేశాడు. గొప్ప తండ్రి అంటూ నెటిజన్లు కూడా అతడికి సలాం కొడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles