Liquor sales see boost as GHMC experiences cold wave చలి తీవ్రతతో నగరంలో పెరుగుతున్న మధ్యం అమ్మకాలు

Liquor sales see boost as hyderabad experiences low temperatures

Hyderabad liquor sales, liquor sales in Telangana, liquor sales GHMC, cold wave, cold wave increase liquor sales in GHMC, Low temperatures high demand in liquor, GHMC, excise department, Hyderabad, telangana

Telangana's liquor sales have shown significant growth since last week in the state and Capital Hyderabad as the cold breeze rocks in the city and the state.

నగరంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. పెరుగుతున్న మధ్యం అమ్మకాలు

Posted: 12/23/2021 03:07 PM IST
Liquor sales see boost as hyderabad experiences low temperatures

తెలంగాణ ఎక్సైజ్ శాఖకు పెరుగుతున్న చలి తీవ్రత బాగా కలసివచ్చేట్టు వుంది. హైదరాబాదు వాసులు చలి తీవ్రతను తట్టుకునే చర్యలు ఉపక్రమించడంతో రాష్ట్రా ఖజానాకు బాగా కలిసివస్తోంది. చలి తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో గ్రేటర్ హైదరాబాదులో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. గత వారం, పది రోజులుగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోవడంతో చలి తీవ్రత బాగా పెరిగింది. అయితే చలి తీవ్రతను తట్టుకునేందుకు మద్యం ప్రియులు మందు కొట్టడమే మార్గంగా ఎంచుకున్నారు. దీంతో మద్యం అమ్మకాలు బాగా పెరిగి రాష్ట్ర ఖజానాకు బాగా కలసివస్తోంది. కొత్త మద్యం పాలసీ ఆరంభంలోనే అమ్మకాలు పెరగడంతో మద్యం దుకాణాలు సైతం కళకళలాడుతున్నాయి.

మద్యం దుకాణాలతో పాటు రెస్టారెంట్లు, బార్లలోనూ మద్యం వినియోగం పెరిగినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే ఊపు నూతన సంవత్సర వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు. గతేడాది కోవిడ్‌ కారణంగా చాలా మంది కొత్త సంవత్సర వేడుకలకు దూరంగానే ఉన్నారు. పబ్బులు, బార్లు వెలవెలబోయాయి. కొద్ది రోజులుగా ఒమిక్రాన్‌ ఆందోళనలు నెలకొన్నప్పటికీ కోవిడ్‌ తీవ్రత అంతగా లేకపోవడంతో కొత్త సంవత్స వేడుకల సందర్భంగా మద్యం వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్‌ అధికారి ఒకరు తెలిపారు. మరో నాలుగైదు రోజుల్లో ఇందుకు అనుగుణంగా టార్గెట్‌లపైన దృష్టి సారించే అవకాశం ఉంది.

గతంలో కోవిడ్‌ ఆంక్షల దృష్ట్యా చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. తక్కువ మోతాదులో ఇళ్ల వద్దనే మద్యం వినియోగించారు. బార్లు తెరిచి ఉన్నప్పటికీ ధైర్యంగా వెళ్లేందుకు వెనుకడుగు వేశారు. ప్రస్తుతం చాలా వరకు సాధారణ పరిస్థితులు నెలకొనడంతో వినియోగం పెరిగింది. దానికి తోడు వారం, పది రోజులుగా పెరిగిన చలి వాతావరణం మందుబాబులను మరింత ఉత్సాహపరుస్తోంది. కొత్త మద్యం పాలసీ మేరకు గ్రేటర్‌లో 615 మద్యం దుకాణాలకు అను మతులనిచ్చిన సంగతి తెలిసిందే. నగరంలోని అన్ని చో ట్ల కొత్త దుకాణాల్లో పూర్తిస్థాయిలో అమ్మకాలు మొదలయ్యాయి. ఆరంభంలోనే లి క్కర్‌ సేల్స్‌ భారీగా పెరగడం పట్ల వైన్స్‌ నిర్వాహకులు సైతం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles