GoAir announces discount for vaccinated passengers పూర్తి వాక్సీన్ తీసుకున్నవారికి గో-ఎయిర్ బంపర్ ఆఫర్.!

Go first to offer special 20 percent discount on tickets for fully vaccinated passengers

aviation, Go First, 100 % Covid vaccination, Go First offers 20% discount, airlines, goair, vaccinated customers, discount, domestic passengers, India

Go First (formerly known as GoAir) today announced the introduction of a special 20 percent discount on domestic flights for passengers who have received the second dose of the COVID vaccine. The airline aims to encourage more people to get fully vaccinated in the fight against the COVID-19 virus.

పూర్తి వాక్సీన్ తీసుకున్నవారికి గో-ఎయిర్ బంపర్ ఆఫర్.!

Posted: 12/22/2021 06:06 PM IST
Go first to offer special 20 percent discount on tickets for fully vaccinated passengers

విదేశాల్లో కరోనా వాక్సీన్ రెండు డోసులతో పాటు బూస్టర్ డోస్ కూడా తీసుకున్నారు అక్కడి ప్రజలు. ఇంతలా వీరు బుద్దిగా వాక్సీన్ తీసుకోవడానికి అక్కడి ప్రభుత్వాలతో పాటు ప్రవేటు సంస్థలు కూడా పూర్తి వాక్సీన్ తీసుకున్నవారికి పలు రకాల రాయితీలు కల్పించడం కూడా దోహదపడింది. తాజాగా అమెరికాలోని ఓ నగరంలో బూస్టర్ డోస్ వాక్సీన్ తీసుకున్నవారికి ఏకంగా వంద డాలర్లను అందిస్తోంది అక్కడి పురపాలక సంస్థ. ఇలాంటి రాయితీలన్నీ కేవలం విదేశీయులకేనా.. మన దేశంలోనివారికి ఏమీ లేవా.? అంటే ఉన్నాయనే చెప్పాలి.

మొన్నామధ్య మహారాష్ట్రలోని ఓ పురపాలక సంఘం కూడా ఇదే తరహాలో ఓ రాయితీని ప్రకటించింది. కాగా తాజాగా విమానయానం చేసే ప్రయాణికులకు స్వదేశీ ఎయిర్ లైన్స్‌ గో ఎయిర్ తాజాగా బంపరాఫర్ ప్రకటించింది. గో-ఫస్ట్ గా పేరు మార్చుకున్న గో-ఎయిర్ విమానయాన సంస్థ తమ ప్యాసింజర్లకు ఈ రాయితీని కల్పిస్తోంది. ఎవరైతే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారో వారందరికీ 20 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. గో ఎయిర్‌ కు చెందిన విమానాల్లో ప్రయాణించాలని అనుకునేవారు టికెట్ బుకింగ్ సమయంలో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపిస్తే 20 శాతం తగ్గింపు పొందవచ్చు.ఈ ఆఫర్ ఇండియన్ ప్యాసింజర్లకు మాత్రమే వర్తిస్తుందని గో ఎయిర్‌ సంస్థ వెల్లడించింది.

గోవ్యాక్సి పథకంలో భాగంగా ఈ ఆఫర్ ను సంస్థ తీసుకొచ్చింది. గో ఫస్ట్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన కోవిడ్ 19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ను ప్రయాణికులు తమతో పాటే తీసుకువెళాల్సి ఉంటుంది.ఎయిర్ పోర్టు చెకింగ్ కౌంటర్ వద్ద వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పకుండా చూపించాల్సి ఉంటుంది. లేదా ఆరోగ్య సేతు మొబైల్ యాప్‌లో వ్యాక్సినేషన్ స్టేటస్ చూపిస్తే సరిపోతుంది.బుకింగ్ చేసుకున్నాక 15 రోజుల వరకు మాత్రమే డబుల్-వ్యాక్సినేషన్ డిస్కౌంట్ వర్తిస్తుంది. ప్రయాణికులు సెర్చ్ పేజీలోని ప్రోమో కోడ్ సెక్షన్ లో గోవాసీ (GOVACCI) అనే ప్రోమో కోడ్‌ను ఎంటర్ చేసి డిస్కౌంట్ పొందొచ్చు.

భారతదేశంలో ఇప్పటికే 214కు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్ర, ఢిల్లీలలో 54 చొప్పున కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.ఇలాంటి పరిస్థితులలో ప్రజలను వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించేందుకు అన్ని సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా గో ఎయిర్ విమానయాన సంస్థ కూడా 20 శాతం డిస్కౌంట్ ప్రకటించింది.ఇదిలా ఉండగా యూఎస్ మళ్లీ కరోనా కోరల్లో చిక్కుకుంది.ప్రస్తుతం అక్కడ నమోదవుతున్న మొత్తం కరోనా కేసుల్లో 73% ఒమిక్రాన్ కేసులే ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది.ఇప్పుడు యూఎస్‌లో ఒమిక్రాన్ అత్యంత సాధారణమైన కరోనా వైరస్ వేరియంట్‌గా మారిపోతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles