woman in-laws took her home after serving divorce notice కోర్టుకెక్కి తన ప్రేమ వివాహాన్ని చక్కదిద్దుకున్న మహిళ

Woman in laws took her home after serving divorce notice in gwalior of madhya pradesh

woman gives birth to baby just six months after marriage, man divorces wife for baby born after six months, woman approches family court, love marriage, physical attachment before marriage, lalitha, suneel, Gwalior, madhya pradesh, crime

A woman has been served a divorces notice by her husband for giving birth to a baby assisinating her charecter. In-laws along with husband left her at her parents and then sends her divorce notice. After the family court standing by her side, and warns of DNA test will proove every thing. Then in-laws withdraws divorce and took her home.

కోర్టుకెక్కి తన ప్రేమ వివాహాన్ని చక్కదిద్దుకున్న మహిళ

Posted: 12/22/2021 03:36 PM IST
Woman in laws took her home after serving divorce notice in gwalior of madhya pradesh

తన కళ్ల ముందే కలలసౌధం కూలిపోతుండటంతో ఆ మహిళ పోరాటానికి సిద్దమైంది. తన సంసారాన్ని చిధ్రం చేయడంతో పాటు తన భర్తకు కూడా దూరం చేసే కుట్రపై ఆమె పిడికిలి బిగింది. అంతేకాదు తనపై వేయకూడని ముద్ర వేయడంతో.. తన పరువు ప్రతిష్టాలకే భంగం వాటిల్లడంతో పాటు తన క్యారెక్టర్ ను చంపేసే కుతంత్రాన్ని అధిగమించాలని పోరాటం చేసింది. అనుకున్నదే తడవుగా అమెను విజయం వరించింది. ఎవరైతే అమె క్యారెక్టర్ ను మంచిది కాదు అని ముద్రవేశారో.. వారే వచ్చి అమెను తమ ఇంటికి తీసుకెళ్లారు. అమె అత్తింటివారు మెట్టు దిగివచ్చారు. అమెను వద్దనుకుని వదిలేసిన భర్త.. అమెను వెతుకుంటూ వచ్చి ఇంటికి తీసుకెళ్లాడు. ఇలాంటి పరిణామాలెందుకు అంటే..

వివాహం జ‌రిగిన ఆరు నెల‌ల‌కే అమె ఒక‌ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. దీంతో ఆమెను అత్త‌మామ‌లు ఇంటి నుంచి త‌రిమేశారు. ఆమెకు విడాకులివ్వ‌మ‌ని భ‌ర్త‌పై అత్త‌మామ‌లు ఒత్తిడి చేశారు. అత‌ను కూడా స‌రేనన్నాడు. ఏమి చేయ‌లేని స్థితిలో ఆ యువ‌తి కోర్టుకెక్కింది. అక్క‌డ ఆమె చెప్పిన ఒక నిజంతో క‌థ అడ్డం తిరిగింది. అస‌లేం జ‌రిగిందంటే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని గ్వాలియ‌ర్ న‌గ‌రానికి చెందిన ల‌లిత‌కు.. స్థానికంగా నివసించే సునీల్ అనే యువ‌కుడితో మే నెల చివ‌రిలో వివాహం జ‌రిగింది. అయితే వీరిద్దరు ఒకరినోకరు ప్రేమించిన కారణంగా వారి పెద్దలు అంగీకరించి పెళ్లి చేశారు.

కాగా పెళ్లైన తరువాత ఆరు మాసాలకే లలిత డిసెంబ‌ర్ మొద‌టి వారంలోనే ఒక బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. దీంతో ల‌లిత అత్త‌మామ‌లకు అనుమానం వచ్చింది. దీనికి తోడు ఇరుగు పోరుగు వారు వీరిని చూసి నవ్వుకోవడంతో భరించలేకపోయిన వారు పుట్టిన బిడ్డ‌కు తండ్రి సునీల్ కాద‌ని సందేహించారు. ఇక కాలనీలోని వారంతా ల‌లిత గురించి చెడుగా మాట్లాడ‌డం ప్రారంభించారు. ఈ విష‌యం తెలిసి సునీల్ త‌ల్లిదండ్రులు ల‌లిత‌ను ఆమె పుట్టింటికి పంపించేశారు. కొన్ని రోజుల త‌రువాత ల‌లిత‌కు విడాకుల నోటిస్ పంపించారు. దీంతో ల‌లిత త‌న భ‌ర్త‌ను నిల‌దీసింది. సునీల్ కూడా ఆ బిడ్డకు తండ్రి తాను కాద‌ని చెప్పి వెళ్లిపోయాడు. భ‌ర్త కూడా ముఖం చాటేయడంతో ల‌లిత ఫ్యామిలీ కోర్టుని ఆశ్ర‌యించింది. అక్క‌డ ల‌లిత‌, సునీల్‌కు కౌన్సెలింగ్ నిర్వ‌హించారు.

అక్క‌డ ల‌లిత బిడ్డ పుట్టుక‌కు సంబంధించిన ఒక నిజం చెప్పింది. పెళ్లికి ముందే తాను, సునీల్ ప్రేమించుకున్నామ‌ని.. అప్పుడు ఇద్ద‌రూ శారీర‌కంగా క‌లిశామ‌ని.. ఆ కార‌ణంగా గ‌ర్భం రావ‌డంతోనే సునీల్ ఆమెను త్వ‌ర‌గా పెళ్లి చేసుకున్నాడ‌ని చెప్పింది. కౌన్సెలింగ్ చేసిన కోర్టు వారు సునీల్‌, పుట్టిన బిడ్డ‌కు డీఎన్ఏ ప‌రీక్ష చేస్తామ‌ని.. అందులో ఆ బిడ్డకు తండ్రి సునీల్ అని తేలితే అత‌నికి జైలు శిక్ష త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. ఇది తెలిసిన సునీల్ విడాకులు కేసు ఉప‌సంహ‌రించుకొని.. ఆ బిడ్డకు తండ్రిగా ఒప్పుకున్నాడు. నిజం తెలుసుకున్న లలిత అత్త‌మామ‌లు ఆమెను తిరిగి ఇంటికి తీసుకెళ్లారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : baby born  six months marriage  divorce  family court  lalitha  suneel  Gwalior  madhya pradesh  crime  

Other Articles