ఇటీవల జరిగిన శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై పలువురు అధికార పార్టీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దానికి ప్రతిగా కొందరు టీడీపీ మహిళా నేతలు అనంతపురంలో పత్రికా సమావేశంలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో మహిళా నేతలపై ఏయే సెక్షన్ల కింద కేసును నమోదు చేశారో.. మరి అలాంటప్పుడు వారి ఇల్లు వంటగదులతో పాటుగా ఎందుకని పోలీసులు సోదాలు నిర్వహించారని ఈ నెల 10న న్యాయస్థానం ప్రశ్నించింది.
ఈ కేసులో జిల్లా ఎస్పీ ఫకీరప్పను ఈ మేరకు తమ ఎదుట హాజరుకావాలని అదేశించింది. ఇక హాజరుకాబోయేందుకు ముందు తమ ఎదుట ఈ కేసుకు సంబంధించిన సమగ్ర దర్యాప్తు నివేదికను సమర్పించాలని కూడా ఆదేశించింది. తాజాగా ఈ కేసును విచారించిన న్యాయస్థానం.. అనంతపురంలో కొందరు టీడీపీ మహిళా నేతలపై నమోదైన కేసు, ఆ తర్వాతి పరిణామాలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఎస్పీ ఫకీరప్పపై ప్రశ్నల వర్షం కురిపించింది. మహిళలపై నమోదైన కేసుకు, వారి ఇళ్లలో సోదాలు చేయడానికి ఉన్న సంబంధమేంటని ప్రశ్నించింది. అసలేం జరుగుతోందో చెప్పాలని నిలదీసింది. ఏ చట్టంలోని నిబంధనల ప్రకారం సోదాలు చేశారో చెప్పాలని ప్రశ్నించింది.
ఈ ఘటనపై దర్యాప్తు జరిపి అఫిడవిట్ సమర్పించాలని కోర్టు ఆదేశిస్తే.. దర్యాప్తు అధికారి నివేదిక జతచేసి అఫిడవిట్‌గా ఎలా సమర్పిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు అఫిడవిట్లో ఏమైనా విషయం ఉందా? దానిని మీరు చూశారా? అని ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ ఘటనపై పూర్తిగా దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చేందుకు ఎన్ని రోజులు పడుతుందని ఎస్పీని ప్రశ్నించగా రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేస్తానని ఎస్పీ సమాధానమిచ్చారు. దీంతో కేసు విచారణను రెండు వారాలు వాయిదా వేసింది. కాగా, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు టీడీపీ మహిళా నేతలకు ఇది వరకే కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది.
(And get your daily news straight to your inbox)
May 25 | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఢిల్లీ పటియాలా హౌజ్ ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతోపాటు రూ.10లక్షల జరిమానా... Read more
May 25 | తన కుటుంబం ఒక చిన్న ఇళ్లు కొనుక్కోవాలని అనుకుంది. అయితే తాముండే గ్రామంలో కాకుండా జిల్లా కేంద్రంలో అంటే లక్షల రూపాయల వ్యవహారం. ఐతే లక్షలు కావాలంటే ఎవరు మాత్రం ఇస్తారు. వ్యాపారం చేస్తామంటే... Read more
May 25 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై న్యాయస్థానం అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి అక్కడ చిత్రాలను రూపోందించిన దర్శకుడిగా పాపులారిటీని సంపాదించిన ఆయన..... Read more
May 25 | ఆవేశం, కంగారు, తొందరపాటు మనల్ని ఊబిలోకి నెట్టివేస్తాయి. వీటి ప్రభావంతో ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు.. చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. అందుకనే పెద్దలు అంటారుగా తన కోపమే తన శత్రువు,... Read more
May 25 | ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోన మహమ్మారి.. భారతదేశంలోనూ అధికారికంగా ఐదు లక్షలమందికిపైగా పోట్టనపెట్టుకుంది. అయితే అల్పా, డెల్టా వేరియంట్లు నేరుగా పేషంట్ల శ్వాసకోశలపై ప్రభావాన్ని చూపగా, ఆతరువాత తీవ్ర లక్షణాలు లేనిది... Read more