Elephant Chases And Attacks Man In Assam 30 ఏళ్ల వ్యక్తిని వెంబడించి దాడి చేసిన ఏనుగు

Wild elephant chases and attacks 30 year old man in assam with trunk

elephant attacks man, human-animal conflict, wild elephant, elephant attack, forest officer, Tamarhat region, Dhubri district, Assam Police, Assam, social media, social media viral, Viral video, Trending video, Terrifying video

As per officials, the elephant that went rogue was presumed to have been separated from its herd, which had been moving along the state's boundary with Assam, followed by a debate on how humans have taken over the forests, which are the natural habitat of animals, forcing them to step out.

ITEMVIDEOS: భయానక వీడియో: 30 ఏళ్ల వ్యక్తిని వెంబడించి దాడి చేసిన ఏనుగు

Posted: 12/20/2021 05:32 PM IST
Wild elephant chases and attacks 30 year old man in assam with trunk

అసోంలోని ప్రజలపై గజరాజుల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ దాడుల్లో వంద‌ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో అడవులు రానురాను కుంచించుకు పోతున్నాయన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. అడవులు అన్యాక్రాంతం కావడంతోనే క్రూరమృగాలు మనుషుల అవాసాల మధ్యకు చోరబడి వారి ప్రాణాలను తీస్తున్నాయని.. దీంతో అటు మనుషులకు- మృగాలకు మధ్య ఘర్షణ వాతావరణం పెరుగుతోందన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి ఘటనలు జరిగిప్పుడు మాత్రమే కాకుండా అటవీశాఖ అధికారులు ముందునుంచే చర్యలు తీసుకుని మనుషులకు-మృగాలకు మధ్య ఘర్షణ వాతావరణాన్ని తొలగించాలన్న డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి.

ఇక అదేవిధంగా విద్యుత్ షాక్‌, రోడ్డు ప్ర‌మాదాలు, రైలు ప్ర‌మాదాలు, విషాహారం తిన‌డం, గోతుల్లో ప‌డిపోవ‌డం, పిడుగుపాట్ల‌కు గురికావ‌డం లాంటి కార‌ణాల‌తో ఏనుగులు కూడా భారీ సంఖ్య‌లో మ‌ర‌ణిస్తున్నాయి. వరల్డ్ వైడ్ ఫండ్ అనే సంస్థ నిర్వహించిన నేచుర్ బ్లాగ్ ప్రకారం 2010 నుంచి 2019 వరకు 761 మంది ప్రజలు, అలాగే 249 గజరాజులు ఒక్క అస్సోం జిల్లాలోనే మరణించాయి. అయితే, త‌ర‌చూ ఏనుగుల దాడులు జ‌రుగుతుండ‌టంతో అట‌వీ ప్రాంతాల స‌మీప గ్రామస్తులు ఆందోళ‌న చెందుతున్నారు. తాజాగా ధుబ్రి జిల్లా త‌మ‌ర్‌హ‌ట్ ఏరియాలోని ఓ గ్రామంలో వ్య‌క్తిపై ఏనుగు దాడిచేసింది.  

త‌మ‌ర్‌హట్ ఏరియాలోని ఓ గ్రామానికి చెందిన వ్య‌క్తులు త‌మ టీ తోట‌ల్లో ప‌నులు చేసుకుంటుండ‌గా స‌మీప అడ‌వి నుంచి దారి త‌ప్పిన ఏనుగు ఒక్కటి అటువైపు వ‌చ్చింది. మంద నుంచి విడిపోయిన ఏనుగు దారితప్పి.. వెతుకుతూ అటుగా వచ్చింది. దానిని చూసి గ్రామ‌స్తులు భ‌యంతో ప‌రుగులు తీశారు. అది గ‌మినంచిన ఏనుగు వారిని వెంబ‌డించింది. ఈ క్ర‌మంలో క‌న‌క‌రాయ్ అనే వ్య‌క్తి కాలుజారి ప‌డిపోయాడు. దాంతో అత‌నివ‌ద్ద‌కు చేరుకున్న ఏనుగు క‌న‌క‌రాయ్‌పై దాడిచేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డ్డ క‌న‌క‌రాయ్ ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలోమృత్యువుతో పోరాడుతున్నాడు. ఇటీవల మేఘాలయలోని ఇదే తరహాలో ఘటన జరిగింది. వెస్ట్ గారో హిల్స్ ప్రాంతంలోనూ ఇద్దరిని చంపి.. ఒకరిని తీవ్రంగా గాయపర్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles