first gay wedding held in telangana hyderabad వికారాబాద్ జిల్లాలో తొలి స్వలింగ సంపర్కుల వివాహం

Hyderabad gay couple ties knot in ceremony with closed ones

Homosexual couple, Marriage, tie knot, Family, close friends, Abhay Dange, Supriyo Chakraborty, Moinabad Resort, Vikarabad district, Telangana

For the first time in Hyderabad, a homosexual couple married by exchanging rings and tying the knot in front of their family and close friends. Abhay Dange, aged 34 and Supriyo Chakraborty, aged 31 tied the knot by exchanging rings and vows. The event was held in a private ceremony at a resort on the outskirts of Hyderabad. Sophia David, a trans woman from Hyderabad, conducted the wedding, which was attended by 60 family members and close friends of the couple.

తెలంగాణలో తొలి స్వలింగ సంపర్కుల వివాహం.. తల్లిదండ్రుల సమక్షంలో

Posted: 12/20/2021 01:41 PM IST
Hyderabad gay couple ties knot in ceremony with closed ones

ఎల్‌జీబీటీక్యూ వ‌ర్గానికి చెందిన వాళ్ల‌కూ హ‌క్కులు ఉంటాయ‌ని, సాధార‌ణ వ్య‌క్తుల‌కు ఉన్న హ‌క్కులే వాళ్ల‌కూ వ‌ర్తించాల‌ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఈ వ‌ర్గం ప్ర‌జ‌లు చాలా ఏళ్ల నుంచి నిర‌స‌లు తెలుపుతున్నారు. అయితే.. మ‌న దేశంలో కూడా ఎల్‌జీబీటీక్యూ క‌మ్యూనిటీ హ‌క్కుల కోసం పోరాటాలు జ‌రుగుతున్నాయి. ట్రాన్స్‌జెండ‌ర్ల‌ను మాత్రం ఇప్ప‌టికే గుర్తించి వాళ్ల‌కు అన్నింట్లో భార‌త్ హ‌క్కుల‌ను క‌ల్పించింది. దీంతో.. గే, లెస్బియ‌న్ వ‌ర్గం వాళ్లు కూడా త‌మ‌కూ హ‌క్కులు క‌ల్పించాల‌ని కోరుతున్నారు. అయిన‌ప్ప‌టికీ భార‌త్ ఇంకా ఆ వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు.

అయినా.. దేశంలో లెస్బియ‌న్, గే పెళ్లిళ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశంలోని ప‌లు చోట్ల ఇప్ప‌టి వ‌ర‌కు చాలా గే మ్యారేజ్‌లు జ‌రిగాయి. తాజాగా తెలంగాణ‌లో తొలి గే మ్యారేజ్ జ‌రిగింది. శ‌నివారం నాడు ఇద్ద‌రు పురుషులు ఒక్క‌ట‌య్యారు. పెద్దల స‌మ‌క్షంలో ఇద్ద‌రు యువ‌కులు పెళ్లి చేసుకొని రికార్డు క్రియేట్ చేశారు. తెలంగాణ‌లో జ‌రిగిన తొలి గే మ్యారేజ్ ఇది. ఈ పెళ్లికి ఇద్ద‌రు నూత‌న వ‌రుల ఫ్యామిలీ మెంబ‌ర్స్‌, క్లోజ్ ఫ్రెండ్స్‌, ఎల్‌జీబీటీక్యూ క‌మ్యూనిటీ నుంచి కొంద‌రు స‌భ్యులు కూడా వ‌చ్చి నూత‌న వ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. వికారాబాద్‌లోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో వీళ్ల పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది.

దీంతో సుప్రియో చ‌క్ర‌వ‌ర్తి, అభ‌య్ డాంగ్.. ఇద్ద‌రూ అధికారికంగా ఒక‌రికి మ‌రొక‌రు భ‌ర్త అయ్యారు. ఇద్ద‌రూ ఇప్పుడు భ‌ర్త‌భ‌ర్త‌లు. ఈ పెళ్లికి ఇద్ద‌రు వ‌రులు వైట్ క‌ల‌ర్ సూట్ వేసుకున్నారు. ఈ పెళ్లిలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే.. హైద‌రాబాద్‌కు చెందిన కొంద‌రు ట్రాన్స్‌జెండ‌ర్ మ‌హిళ‌లు ఈ వేడుక‌కు హాజ‌ర‌యి ఇద్ద‌రు పెళ్లికొడుకుల‌ను ఆశీర్వ‌దించారు. అయితే.. తామిద్ద‌రం పెళ్లి చేసుకుంటున్న‌ట్టు గ‌త అక్టోబ‌ర్‌లోనే ఇద్ద‌రూ ప్ర‌క‌టించారు. అప్ప‌టి నుంచి తెలంగాణ వ్యాప్తంగా గే మ్యారేజ్ గురించి అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత కూడా వాళ్ల మ్యారేజ్‌కు మ‌ద్ద‌తు ప‌లికింది. ఇద్ద‌రు కపుల్స్‌కు అభినంద‌న‌లు తెలిపి.. దానికి సంబంధించిన ట్వీట్‌ను రీట్వీట్ చేసింది.

సుప్రియో వ‌య‌సు 31 ఏళ్లు. అభ‌య్ వ‌య‌సు 34 ఏళ్లు. తాము ఇద్ద‌రం గేల‌మ‌ని వాళ్ల‌కు త‌మ చిన్న‌త‌నంలోనే తెలిసింద‌ట‌. వెస్ట్ బెంగాల్‌కు చెందిన సుప్రియో.. హైద‌రాబాద్‌లో ఆతిథ్య రంగంలో ప‌నిచేస్తున్నాడు. అభ‌య్‌ది పంజాబ్, ఐటీ ప్రొఫెష‌న‌ల్‌. వీళ్లిద్ద‌రికి 8 ఏళ్ల క్రితం ఓ డేటింగ్ యాప్ ద్వారా ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అప్ప‌టి నుంచి ఇద్ద‌రూ స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. ఇటీవ‌ల పెళ్లి చేసుకొని ఒక్క‌ట‌వ్వాల‌ని డిసైడ్ అయి.. తాము పెళ్లిచేసుకోబోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. తాజాగా అంగ‌రంగ వైభ‌వంగా పెళ్లి చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles