ఇద్దరు మేజర్లు ఒకే ఇంట్లో వుండటం సహజీవనం కిందకు వస్తుందా.? లేదా అన్న విషయంలో క్లారిటీ వచ్చింది. కొన్ని రోజులు ఇద్దరు మేజర్లు కలిసి జీవించడం, తాము సహజీవనం చేస్తున్నామని ప్రకటించుకోవడం నిజమైన సహజీవనం(లివ్ ఇన్ రిలేషన్) కిందకు రాదని పంజాబ్, హర్యానా హైకోర్టు అభిప్రాయపడింది. సహజీవనం విషయంలో న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కొన్ని రోజులపాటు కలిసి ఉన్నంత మాత్రాన అది సహజీవనం అనిపించుకోదని స్పష్టం చేసింది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ ఓ ప్రేమ జంట వేసిన పిటిషన్‌ను తిరస్కరించిన న్యాయస్థానం ఈ కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని యమునానగర్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల యువతి, 20 ఏళ్ల యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు వీరి ప్రేమను నిరాకరించారు. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన ఈ జంట గత నెల (నవంబరు) 24 నుంచి ఓ హోటల్ గదిలో ఉంటున్నారు. అనంతరం తమ పెద్దల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అమ్మాయి తల్లిదండ్రుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, అమ్మాయిపై తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారని యువకుడు ఆ పిటిషన్‌లో ఆరోపించాడు.
అయితే, ఈ ఆరోపణలు నమ్మశక్యంగా లేవని హైకోర్టు జడ్జి జస్టిస్ మనోజ్ బజాజ్ పేర్కొన్నారు. సహజీవనం అంటే కొన్ని రోజులు కలిసి ఉండడం కాదని, దాని వెనక మరెన్నో బాధ్యతలు కూడా ఉంటాయని గుర్తు చేశారు. ఇలాంటి పిటిషన్ దాఖలు చేసిన ప్రేమ జంటకు రూ. 25 వేల జరిమానా విధించారు. కలిసి జీవించే కాలం, ఈ కాలంలో ఇరువురు నెరవేర్చిన బాధ్యతలు, ఒకరికొకరు చేసుకున్న సాయం తదితర అనేక అంశాలను బట్టి సహజీవనాన్ని గుర్తించాల్సిఉంటుందని జస్టిస్ మనోజ్ బజాజ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా స్త్రీ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని ఒక జంట పెట్టుకున్న అభ్యర్ధనను కొట్టివేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more