I20 Car turtles in air and hits another vehicle అన్నం పెట్టండయ్యా అని అడిగితే.. ఉసురు తీసారు..

Man beaten to death on suspicion of theft in kphb of hyderabad

Man beaten to death in KPHB, Man beaten to death, Man beaten to death in Hyderabad, Man beaten to death in Moghuls Restaurant, Man beaten to death by moghuls restaraurant staff, migrant labourer, beaten to death, Food, Birthday celebrations, Moghul's Paradise Restaurant, Kphb, Cyberabad police, Telangana, Crime

A 32-year-old man was allegedly beaten to death by a group of men on suspeccting as Thief in Hyderbad's KPHB, police said on Friday. Rajesh a migrant labourer was hit by the Moghul's Paradise Restaurant staff on late Wednesday night and was found unconscious in the cellar of the Hotel. He was taken to a hospital where he succumbed to injuries on Thursday, a senior police officer said.

దారుణం: మిగిలింది కొంచెం పెట్టండయ్యా అంటే.. మానవత్వం మర్చి..

Posted: 12/17/2021 12:18 PM IST
Man beaten to death on suspicion of theft in kphb of hyderabad

మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేదుచూడు మానవత్వం ఉన్నవాడు.. అంటూ అందెశ్రీ తన కలంతో కాకుండా ఇప్పటితరం మనుషులను చూసి గుండెతో తన అవేదనను వ్యక్తం చేసిన పాట ఇది. పూర్వం ఇంట్లో వండుకున్న అన్నమైనా అతిధికి పెట్టకుండా తినేవారు కాదు. అలాంటిది.. ఈ రోజుల్లో అన్నమో రామచంద్రా అంటూ ఆర్తానాదాలు పెడుతూ.. వీదుల వెంబడి తిరిగినా.. కనికరించే వారు కరువయ్యారు. ఎవరైనా ఏదైనా తింటుంటే వారి వ్దదకు వెళ్లి అడిగితేనైనా కొంచెం ఇస్తారేమోనని అడిగేవారు ఉంటారు. ఆకలికేం తెలుసు అంటారా.. మనసు చంపుకోని మనిషిని.. కుటుంబం కోసం కుంగదీయడం తప్ప.

ఇలాంటి వారు ఎదురైతే తమకు దిష్టి తగులుతుందని కసురుకునేవారు కొందరు.. ఇంకొందరు మరో మెట్టు ఎక్కి.. ఏరా తినడానికే వచ్చావా.. లేక మేం కనబడ్డాం కాబట్టి అడగుతున్నావా.. నువ్వు దొంగవే కాదా.? అంటూ అబాండాలు కూడా వేస్తారు. మరికోందరు అంతటితోనూ అగకుండా.. అబాండాలు వేయడంతో పాటు చేయిచేసుకోవడం వరకు కూడా వెళ్తుంటారు. తన కాలే కడుపును నీళ్లతోనైనా నింపుకునేందుకు ఇష్టపడే తండ్రి.. తాను కన్న బిడ్డల కోసం ఏదైనా రుచిగా తీసుకెళ్లాలన్న తాయత్రయమే ఆ తండ్రిని తిరిగిరాని లోకావకు పంపింది. ఇలా ఆకలితో అలమటిస్తున్న ఓ వ్యక్తిపై మూకుమ్మడి దాడి జరగడంతో మృతి చెందిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది.  
సీఐ కిషన్‌ కుమార్‌ వివరాల ప్రకారం.. ఒరిస్సాకు చెందిన రాజేష్‌ (32), భార్య, పిల్లలతో కలిసి మాదాపుర్‌లో ఉంటూ బాచుపల్లిలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి పని ముగించుకొని ఇంటికి వచ్చే క్రమంలో జేఎన్‌టీయూహెచ్‌ మెట్రో స్టేషన్‌ పక్కనే ఉన్న మొఘల్స్‌ ప్యారడైజ్‌ రెస్టారెంట్‌ సెల్లర్‌లోకి వెళ్లాడు. అప్పటికే అక్కడ రెస్టారెంట్‌ మేనేజర్‌ అరవింద్‌ పుట్టిన రోజు వేడుకలు సిబ్బందితో కలిసి చేసుకుంటున్నారు. వాళ్లు తినగా మిగిలింది తనకు ఇవ్వమంటూ రాజేశ్‌ వాళ్లను వేడుకున్నాడు. కానీ, మానవత్వం మరిచిపోయారు. దొంగగా పొరబడి వాళ్లంతా అతన్ని చితకబాది వెళ్లిపోయారు.

రాత్రంతా అక్కడే స్పృహ లేకుండా పడిఉన్న రాజేష్‌ను.. గురువారం ఉదయం హోటల్‌ సిబ్బంది గుర్తించారు. ఒరిస్సాలోని రాజేష్‌ తండ్రికి సమచారమివ్వగా అతను భార్య సత్యభామకు తెలుపడంతో ఆమె వెళ్లి ఇంటికి తీసుకొచ్చింది. ఇంటికి వెళ్లిన కాసేపటికే రాజేష్‌ మృతి చెందాడు. సత్యభామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని హోటల్‌ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  రాజేష్‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నట్లు తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles