IndiGo flight with MLA Roja Makes Emergency Landing వైసీపీ ఎమ్మెల్యే రోజా వీడియో వైరల్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..

Indigo plane with ysrcp mla roja makes emergency landing in bengaluru

indigo flight, Rajamandry, tirupathi, Technical problem, YSRCP MLA RK Roja Stuck In Indigo Plane For Four Hours, MLA RK Roja in Bengaluru Airport, MLA RK Roja flight Emergency Landing, YSRCP, MLA RK Roja, IndiGo airline, Tirupati, Bengaluru, emergency landing, Andhra Pradesh, Politics

A Rajahmundry - Tirupati Indigo flight had to make an emergency landing in Bengaluru due to a technical glitch. This was shared by YSRCP Nagari MLA RK Roja Selvamani who was on board the flight along with TDP senior leader Yenamala Ramakrishnudu and several other VIPs. She shared the news through a video, that the plane was circling in the air for more than an hour as it could not get permission to land in the Tirupati airport.

ITEMVIDEOS: వైసీపీ ఎమ్మెల్యే రోజా వీడియో వైరల్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..

Posted: 12/14/2021 03:22 PM IST
Indigo plane with ysrcp mla roja makes emergency landing in bengaluru

సినీ న‌టి, ఎమ్మెల్యే రాజా ప్ర‌యాణిస్తున్న విమానం బెంగుళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. రాజ‌మండ్రి నుంచి తిరుప‌తి వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో దానిని బెంగళూరుకు మళ్లించి ల్యాండింగ్ చేశారు. తిరుపతిలో ల్యాండ్ కావాల్సిన విమానం గాల్లో గంటపాటు చక్కర్లు కోట్టినా.. ల్యాండింగ్ కు ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్ నుంచి అనుమతి రాలేదు. దీంతో హుటాహుటిన బెంగళూరుకు మళ్లించి ల్యాండింగ్ చేశారు. అయితే బెంగుళూరులో ల్యాండింగ్ అయిన విమానంలోంచి ప్రయాణికులు ఎవరినీ దిగేందుకు విమాన సిబ్బంది అనుమతించలేదు. కాగా విమానం డోర్స్ లాక్ అయ్యాయని.. అవి అన్ లాక్ కావడానికి అనుమతి రావాలని చెప్పారు.

దీంతో నాలుగు గంటలుగా ప్రయాణికులు అందరూ బెంగళూరు విమానాశ్రయంలోనే కూర్చోని వున్నారు. ఇక అధికార పార్టీకి చెందిన నగరి ఎమ్మెల్యే రోజా వీడియో నిమిషాల వ్యవధిలోనే వైరల్ కావడంతో ఎట్టకేలకు మెట్టుదిగిన సిబ్బంది ప్రయాణికులను విమానాశ్రయం లాంజ్ లోకి వెళ్లేందుకు అనుమతించారు. అంతకుముందు ఎమ్మెల్యే రోజా మొబైల్ వీడియో ద్వారా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఆ విమానంలో టీడీపీ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణ కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. తిరుప‌తి విమానాశ్ర‌యంలో విమానం దిగేందుకు అనుమ‌తి రాలేదు. చాలా సేపు విమానం గాలిలో తిర‌గ‌డం వ‌ల్ల ప్ర‌యాణికులు తీవ్ర ఆందోళ‌న‌కు లోనైన‌ట్లు ఆమె వెల్ల‌డించారు.

అయితే తిరుప‌తికి ద‌గ్గ‌ర‌గా ఉన్న క‌డ‌ప‌లో కాకుండా ఆ విమానాన్ని బెంగుళూరుకు ఎందుకు మ‌ళ్లించారో అర్థం కావ‌డం లేద‌ని ఆమె అన్నారు. ప్ర‌యాణికులు బ‌ట‌య‌కు వెళ్ల‌డానికి అనుమ‌తించ‌డం లేద‌న్నారు. ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ అయి నాలుగు గంట‌లు అవుతున్నా.. ఇంకా విమానం డోర్ల‌ను తీయ‌డం లేద‌న్నారు. త‌న‌కు మేజ‌ర్ స‌ర్జ‌రీ జ‌రిగింద‌ని, క‌డ‌పులో 29 కుట్లు ఉన్నాయ‌ని, అయితే ఎక్కువ స‌మ‌యం కుర్చీలో కూర్చ‌వ‌డం ఇబ్బందిగా మారుతోంద‌ని రోజా తెలిపారు. రాజ‌మండి నుంచి ఇండిగో విమానం ఉద‌యం 9.20 నిమిషాల‌కు బ‌య‌లుదేరింది. తిరుప‌తికి ఆ విమానం 10.20 నిమిషాల‌కు చేరాల్సి ఉంది. కానీ సాంకేతిక కార‌ణాల వ‌ల్ల బెంగుళూరు విమానాశ్ర‌యంలో ఆ విమానాన్ని దింపారు. ఆ విమానంలో ఎమ్మెల్యే రోజాతో పాటు ప‌లువురు వీఐపీలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. విమానంలో 70 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles