Omicron could lead to 75,000 deaths in UK: study ఒమిక్రాన్ వేరియంట్ ప్రమాదకారే: ప్రపంచ ఆరోగ్య సంస్థ

Omicron poses very high risk but data on severity limited

COVID-19, Omicron, covaxin, phfi, covid variant, covid, icmr, Omicron, covid, delta variant, omicron symptoms, what are the symptoms of omicron, what are the symptoms of omicron virus, COVID booster dose Britain, booster dose above 30 years, booster dose at-risk people, Omicron symptoms, Omicron corona variant, Omicron B.1.1.529, covid new variant, covishield, covaxin, astrazeneca, covid-19 vaccination, nationwide vaccination drive, vaccination drive, covid news, corona updates

The Omicron coronavirus variant, reported in more than 60 countries, poses a "very high" global risk, with some evidence that it evades vaccine protection but clinical data on its severity is limited, the World Health Organization says.

ఒమిక్రాన్ వేరియంట్ ప్రమాదకారే: ప్రపంచ ఆరోగ్య సంస్థ

Posted: 12/14/2021 11:03 AM IST
Omicron poses very high risk but data on severity limited

సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే సుమారు 60 దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్.. మరీముఖ్యంగా యూరోప్ దేశాలలో ఇప్పటికే తన ప్రబావాన్ని చాటుతున్న ఒమిక్రాన్ ఇప్పటికే బ్రిటన్ లో ఒక మరణాన్ని నమోదు చేసుకున్నవిషయం తెలిసిందే. ఈ మేరకు బ్రిటెన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అధికారిక ప్రకటన చేశారు. కొత్త వేరియంట్ కారణంగా అసుపత్రి పాలవుతున్నవారి సంఖ్య పెరుగుతోందని వెల్లడించారు. ఒమిక్రాన్ కట్టడికి ప్రజలకు కరోనా వాక్సీన్ బూస్టర్ డోస్ తీసుకోవాలని ఆయన కోరారు.

ఇప్పటికే దీని కారణంగా యూరోప్ దేశాలలో వచ్చే ఏప్రిల్ నాటికి 25 నుంచి 75 వేల మంది ఈ వేరియంట్ బారినపడి మరణించే అవకాశం ఉందని ఓ అధ్యయనం వెల్లడించిన నేపథ్యంలో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అందోళన వ్యక్తం చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ ప్రమాదకారేనని తాజాగా వెల్లడించింది. ఇది బౌగోళిక ముప్పుగా పరిణమించిందని అందోళన వ్యక్తం చేసింది. వాక్సీన్ల ద్వారా లభించే రక్షణను కూడా ఇది ఏమార్చుతోందని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయని వివరించింది. తీవ్ర పరిణామాలతో మరో విజృంభనకు దారితీసే అవకాశం ఉందని అందోళన వ్యక్తం చేసింది.

అయితే, ఈ వేరియంట్ తీవ్రత గురించి ఓ అంచనాకు రావడానికి ముందు మరింత సమాచారం అందాల్సి ఉందని పేర్కొంది. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ వ్యాధి తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ ఒకసారి అది ప్రబలితే మాత్రం ఆసుపత్రులలో చేరే వారి సంఖ్య పెరుగుతుందని పేర్కొంది. అదే జరిగితే మరిన్ని మరణాలు సంభవిస్తాయని తెలిపింది. ఇక మరోవైపు అమెరికాలోని సుమారు 30 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించింది. 30 రాష్ట్రాల్లోనూ ఒమిక్రాన్ కేసులను గుర్తించారు. అమెరికాలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 మిలియ‌న్లు దాటిన‌ట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివ‌ర్సిటీ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Omicron  Variant  Covid  WHO  covaxin  phfi  covishield  coronavaccine booster dose  above 30 years  omicron symptoms  

Other Articles