కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ తీసుకువచ్చిన నూతన వ్యవసాయ సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతులు ఎట్టకేలకు దేశ రాజధాని సరిహద్దులను వదిలి వెళ్తున్నారు. తమ ఏఢాది కాల నిరసనలను పరిగణలోకి తీసుకుని కేంద్రం వ్యవసాయ సాగు చట్టాలను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో విజయ గర్వంతో రైతులు తమ నిరసన ప్రాంతాలను వదిలి వెళ్తున్నారని సంయుక్త కిసాన్ మోర్చా నేత రాకేశ్ టికాయత్ అన్నారు. అయితే ఒక్కసారిగా ఈ ప్రాంతాలను అందరూ వదిలి వెళ్లడం కష్టమని అన్నారు. దీంతో ఈ సరిహద్దు ప్రాంతాలను వదిలి వెళ్లడానికి కనీసం 4 నుంచి 5 రోజుల సమయం పడుతుందని అన్నారు.
కాగా, ఇప్పటికే కొందరు రైతులు నిరసన ప్రాంతాలను వదిలి వెళ్లారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి రాకేశ్ టికాయత్ మాట్లాడుతూ.. రైతులువిజయంతో హస్తిన సరిహద్దుల నుంచి తిరుగు పయనం కావడం సంతోషంగా ఉందని అన్నారు. ఇక తాము పండించే పంటలకు అత్యధిక మద్దతుధరపై కూడా కేంద్రం ఇచ్చిన హామీలను త్వరలోనే అమలు చేస్తుందని తము భావిస్తున్నామని అన్నారు. రైతులందరూ తమ వ్యవసాయ పనులపై దృష్టి నిలపాలని కోరారు. శాంతియుతంగా ఉంటూ అందరూ తమ తమ పనుల్లో మునిగిపోవాలని సూచించారు.
కాగా, వాగా సరిహద్దు మొత్తం ఖాళీ అవడానికి వారం రోజులు కచ్చితంగా పడుతుందని అన్నారు. తమకు కేంద్రంతో ఎలాంటి గొడవా లేదని స్పష్టం చేశారు. అయితే ఇచ్చిన మాటపై నిలబడకుంటే మాత్రం మరోసారి ఉద్యమం చేపట్టడం మాత్రం ఖాయమని, అందులో అనుమానాలే లేవని టికాయత్ తేల్చి చెప్పారు. జనవరి 15 న సంయుక్త కిసాన్ మోర్చా సమావేశం జరగబోతోందని, ఈ లోగా హర్యానా ముఖ్యమంత్రితో సహా మరికొంత మంది ముఖ్యమంత్రులతో భేటీ అవుతామని ప్రకటించారు. అయితే యూపీ ఎన్నికల్లో ఎలాంటి విధానాన్ని అవలంబించాలన్న విషయంపై మాత్రం ఇతరులతోనూ చర్చిస్తామని టికాయత్ తెలిపారు.
కేంద్రం తమకు ప్రస్తుతానికి కొన్ని హామీలను ఇచ్చిందని.. అందుకే తమ ఉద్యమానికి తాత్కాలికంగా విరామం ప్రకటించామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చని పక్షంలో మరోసారి ఉద్యమానికి సన్నద్ధమవడం ఖాయమని ఆయన తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని మరో రైతు నేత బల్వీర్ రాజేవాల్ కూడా నొక్కి చెప్పారు. ఇక 13 న స్వర్ణ దేవాలయానికి వెళ్తామని, 15 కల్లా పంజాబ్లోని రైతులు తమ ఉద్యమానికి తాత్కాలికంగా స్వస్తి పలుకుతారని రైతు అశోక్ ధావలే పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more