Maryland homeowner sets house on fire పాముల కోసం పొగబెడితే.. బూడిదైన రూ. 13 కోట్ల ఇళ్లు..

Homeowner trying to smoke out snake infestation burns down own house

Montgomery County, Dickerson, Maryland, Pete Piringer, Coal, smoke, snake infestation, Fire Accident, Fire Firefighters, snakes, America

A Maryland homeowner accidentally burned down their house after attempting to smoke out snakes infesting the basement. The Montgomery County resident used coals in the basement to try to ward off the snakes, WTOP of Washington, D.C., reported. A fire broke out on Nov. 23 at 10 p.m. Officials said 75 firefighters were called to put out a blaze that had caused more than $1 million in damage.

ITEMVIDEOS: పాముల కోసం పొగబెడితే.. బూడిదైన రూ. 13 కోట్ల ఇళ్లు..

Posted: 12/07/2021 10:24 AM IST
Homeowner trying to smoke out snake infestation burns down own house

ఎలుకలు వున్నాయిని ఇంటికి నిప్పు పెట్టాడని తెలుగులో ఒక నానుడి వుంది. అయితే ఈ నానుడిని బాగా వంటబట్టించుకున్నాడో ఏమో తెలియదు కానీ.. ఓ వ్యక్తి తన ఇంటి అవరణలో వున్న పాముల బెడద నుంచి విముక్తుడు కావాలని నిప్పు పెడితే ఏకంగా 13 కోట్ల రూపాయల ఇల్లు కూడా కాలి బూడిదయ్యింది. అగ్రరాజ్యంలో వుంటూ.. పాముల బెడదకు అందుబాటులో వున్న ప్రోఫెషనల్ సలహాలు, సూచనలు తీసుకోకుండా.. తమకు తెలిసిన విధానాన్ని అవలంభిస్తే.. చివరకు బూడిదే మిగులుతుందని ఈ ఘటన అనుభవపూర్వకంగా ఇంటి యజమానితో పాటు అందరికీ తెలిపింది.

ఈ ఘటన అమెరికాలోని మేరీల్యాండ్‌లో జరిగింది. మేరీల్యాండ్ లోని డిక్కర్సన్ ప్రాంతంలో ఏకంగా పదివేల చదరపు ఫీట్లలో నిర్మితమైన బహుళ అంతస్థుల భవనం అది. ఆ భవనాన్ని గతలఓ ఇంటి యజమాని అద్దెకు ఇచ్చింది. దీంతో అద్దెకు దిగినవారికి స్థానికంగా వుండే పాములు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాయి. దీంతో వారు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. దీంతో ఎవరు అద్దెకు వచ్చినా ఎక్కువకాలం ఉండలేక పాబుల బెడదతో ఇబ్బందులు పడుతూ వెళ్లిపోవడంతో చివరకు ఆ ఇంటి యజమానురాలే ఇంట్లో ఉంటోంది. అయితే అమె కూడా ఇంట్లోని పాముల బెడదకు గురయ్యింది.

దీంతో పాములును వెళ్లిపోయేలా చేసేందుకు ఆమకు ఒక ఉపాయం తోచింది. అంతే ఉన్నఫళంగా అమె బొగ్గును తీసుకువచ్చి.. తన ఇంటి కింద బేస్ మెంటులో పోగబెట్టాలని అనుకుంది. అనుకున్నదే తడవుగా అమె తన ఇంటి బేస్ మెంట్లో ఒక గోయ్యిని తీసి.. అక్కడ బోగ్గును పోసి నిప్పంటించింది. ఆ తరువాత కొద్దీ సేపటికి దానిని చల్లార్చింది. దీంతో విపరీతంగా పోగ లేచింది. అయితే గాలి వీచించో లేక నిప్పుకు వేంటనే మంటలంటుకునే వస్తువులు ఉన్న కారణంగానో తెలియదు కానీ.. ఏకంగా మంటలు చెలరేగి.. ఇళ్లు కాలిపోవడం ప్రారంభమయ్యింది.

ఇక మంటలకు తోడు గాలి కూడా తోడయ్యింది. ఈ క్రమంలో క్షణాల్లోనే ఇల్లంతా పాకి బూడిద చేశాయి. ఇక అంతస్థు.. నుంచి మరో అంతస్థుగా వేగంగా వ్యాపించిన మంటలు నిమిషాల వ్యవధిలో ఇంటిని బూడిదగా మార్చివేసింది. దీంతో ఇంటి యజమానురాలు లబోదిబోమనడం తప్ప.. ఏమీ చేయలేకపోయింది. అప్పటివరకు ఏకంగా రూ.13 కోట్ల రూపాయల విలువైన ఇంటి యజమాని కాస్తా.. కట్టుబట్టలతో విగతజీవిలా మారిపోయింది. పాముల కోసం పెట్టిన పొగ తన జీవితాన్నే కాల్చి బూడిద చేస్తుందని భావించలేదని అమె అవేదన వ్యక్తం చేసింది.


అయితే, భవనం పూర్తిగా కాలిబూడిదైనా ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో స్థానికులతో పాటు మాంట్గోమెరీ కౌంటీ అగ్నిమాపక దళాలు కూడా ఉపిరి పీల్చుకున్నాయి. స్థానిక అగ్నిమాపకదళ అధికార ప్రతినిధి పిటీ పిరింగర్ మాట్లాడుతూ.. బొగును త్వరగా మంటలు చెలరేగి వస్తువులకు అత్యంత సమీపంలో ఉంచడం కారణంగానే మంటలు చెలరేగి ఇళ్లు కాలి బూడిదయ్యిందని అన్నారు. ఇలాంటి సమస్యలు వచ్చిన నేపథ్యంలో పెస్ట్ కంట్రోల్ లేదా ప్రోషెషనల్స్ సలహాల మేరకు నడుచుకోవాలని సూచించారు.

మంటలు వ్యాపించడం ద్వారా ఏకంగా ఒక మిలియన్ డాల్లర్ల విలువైన ఆస్తినష్టం వాటిల్లిందని అన్నారు. ఇక ప్రస్తుతం ఇక్కడ నివసించలేని పరిస్థితులు అలుముకున్నాయిని అన్నారు. కాలిబూడితైన ప్రాంతం నివాసయోగ్యానికి అనుకూలంగా లేదని అన్నారు. ఈ ఘటన గత నెల 23న జరిగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక అగ్నిమాసక బృందాలు ట్విట్టర్ లో పెట్టిన వీడియోలతో ఈ వార్త వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోను అగ్నిమాపక శాఖ ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో వైరల్ అయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles